World chess champion
-
కోటీశ్వరుడిగా గుకేశ్.. ప్రైజ్‌మనీపై స్పందించిన వరల్డ్ చాంపియన్
కఠిన శ్రమ, అంకిత భావం ఉంటే ఎన్ని సవాళ్లు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని దొమ్మరాజు గుకేశ్ నిరూపించాడు. పద్దెమినిదేళ్ల వయసులోనే ప్రపంచ చెస్ చాంపియన్‌గా అవతరించి నీరాజనాలు అందుకుంటున్నాడు. అయితే, గుకేశ్ ఈ ఘనత సాధించడంతో అతడి తల్లిదండ్రులు రజనీకాంత్, పద్మాకుమారిలది కీలక పాత్ర.కోటీశ్వరుడిగా గుకేశ్ఇక వరల్డ్ చాంపియన్‌గా గుకేశ్ రూ. 11.45 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. తన విజయంతో జాతి మొత్తాన్ని గర్వపడేలా చేసిన ఈ గ్రాండ్ మాస్టర్‌కు తమిళనాడు ప్రభుత్వం ఏకంగా రూ. 5 కోట్ల నజరానా ప్రకటించింది. ఈ నేపథ్యంలో గుకేశ్ కోటీశ్వరుడైపోయాడు.నా తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.. ఇకపైఈ విషయం గురించి గుకేశ్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రైజ్‌మనీ నాకు ఎంత ముఖ్యమైనదో మాటల్లో చెప్పలేను. అయితే, డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు. నిజానికి నేను చెస్ ఆడటం మొదలుపెట్టినపుడు మా కుటుంబం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. నన్ను ఈ స్థాయికి చేర్చడానికి... నా తల్లిదండ్రులు ఆర్థికంగా, భావోద్వేగాలపరంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు.అయితే, ఇప్పుడు కాస్త మేము సౌకర్యవంతంగా జీవించగలుగుతాం. ఇకపై వాళ్లు దేనికీ పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నాడు. అంతేకాదు.. తనకు తెలిసింది కొంతేనని.. ఇంకా నేర్చుకోవాల్సి ఎంతో ఉందంటూ గుకేశ్.. ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటానని చెప్పకనే చెప్పాడు.అప్పుడే మా అమ్మకు సంతోషంఇక తన తల్లి తనకు గొప్ప చదరంగ ఆటగాడిగా కంటే.. గొప్ప మనిషిగా గుర్తింపు వచ్చినపుడే ఎక్కువ సంతోషిస్తానని చెప్పిందని ఈ సందర్భంగా గుకేశ్ వెల్లడించాడు. కాగా ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్న నాలుగు రోజుల తర్వాత గుకేశ్ స్వదేశంలో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. సింగపూర్ సిటీ నుంచి అతడు సోమవారం చెన్నైకి చేరుకున్నాడు.పుట్టి పెరిగి ఆటలో ఓనమాలు చేర్చుకున్న గడ్డపై విశ్వ విజేత హోదాలో గుకేశ్‌కు సోమవారం భారీ స్థాయిలో ఘన స్వాగతం లభించింది. అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ప్రతినిధులు, తమిళనాడు రాష్ట్ర అధికారులతో పాటు అతను చదువుకున్న వేలమ్మాల్ స్కూల్ విద్యార్థులు, వర్ధమాన చెస్ ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో విమానాశ్రయంలో గుకేశ్‌కు వెల్కమ్ చెప్పారు. అతని ఫోటోలు, ఇతర చెస్ చిత్రాలతో అలంకరించి ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వాహనంలో ఈ యువ చాంపియన్ విమానాశ్రయం నుంచి ముందుగా తన ఇంటికి వెళ్లాడు. ఆపై వేలమ్మాల్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నాడు. తల్లిదండ్రులు రజనీకాంత్, పద్మాకుమారి అతని వెంట ఉన్నారు. ఇక మంగళవారం గుకేశ్‌కు స్థానిక కలైవానర్ ఆరంగం ఆడిటోరియంలో ప్రత్యేక సన్మానం జరిగే అవకాశం ఉంది. ఇదే కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పాల్గొని ఇప్పటికే ప్రకటించిన రూ.5 కోట్ల బహుమతి పురస్కారాన్ని గుకేశ్‌కు అందించనున్నారు.తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సహకారం వల్లే‘నాకు మద్దతు పలికిన అందరికీ కృతజ్ఞతలు. ఇలాంటి సహకారం నాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. వరల్డ్ చాంపియన్‌గా నిలవడం చాలా గొప్పగా ఉంది. భారత ఆటగాడు మరోసారి విశ్వ విజేత కాగలిగాడు. నా ఈ విజయంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా ఎంతో ఉంది. గత ఏడాది గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నీ నిర్వహించి నాకు స్పాన్సర్షిప్ అందించడంతో పాటు అన్ని ఏర్పాట్లు చేశారు.అక్కడ గెలవడంతో క్యాండిడేట్స్ విజయానికి పునాది పడింది. ఇలాంటి సహకారం ఉంటే రాష్ట్రం నుంచి మరెంతో మంది ఆటగాళ్లు పైస్థాయికి చేరతారు. ఈ రోజు లభించిన స్వాగతాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. రాబోయే కొన్ని రోజులు కలిసి సంబరాలు చేసుకుందాం’ అని గుకేశ్ వ్యాఖ్యానించాడు.ఆయన సహకారం మరువలేనిదితన చాంపియన్‌షిప్ విజయంపై స్కూల్ విద్యార్థులు అడిగిన ప్రశ్నకు సమాధానిస్తూ... ‘చెస్‌లో విజయం అంటే బాగా ఆడితేనే సరిపోదు. ఎంతో మానసిక ఒత్తిడి ఉంటుంది. దానిని అధిగమించాలి. అందుకే మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ సహకారం తీసుకున్నాను. ఆయనతో కలిసి పని చేయడం నాకు కలిసొచ్చింది’ అని వెల్లడించాడు. కాగా ఈఎన్టీ స్పెషలిస్ట్ అయిన గుకేశ్ తండ్రి కుమారుడి ప్రయాణంలో తోడుండేందుకు తన వృత్తిని త్యాగం చేయగా.. తల్లి పద్మాకుమారి ఉద్యోగం(మైక్రోబయాలజిస్ట్) చేస్తూ కుటుంబాన్ని పోషించారు. చదవండి: శెభాష్.. గండం నుంచి గట్టెక్కించారు! మీరే నయం -
చెన్నైకి చేరుకున్న గుకేశ్.. వరల్డ్ చాంపియన్ భావోద్వేగం
ప్రపంచ చెస్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ స్వదేశానికి తిరిగి వచ్చాడు. చదరంగ రారాజు హోదాలో తొలిసారి భారత్‌లో అడగుపెట్టాడు. ఈ వరల్డ్ చాంపియన్ సోమవారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నాడు.నాలో శక్తిని, స్థైర్యాన్ని నింపారుఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వ అధికారులు, జాతీయ చెస్ సమాఖ్య ముఖ్యులు, అభిమానులు గుకేశ్‌కు ఘన స్వాగతం పలికారు. సందర్భంగా... గుకేశ్ మాట్లాడుతూ.. ‘‘సొంతగడ్డ మీద తిరిగి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. మీ అభిమానం, మద్దతు చూసిన తర్వాత.. భారత్‌కు ఈ విజయం ఎంతటి గొప్ప అనుభూతిచ్చిందో నాకు మరింతగా అర్థమైంది. మీరంతా అత్యద్భుతం. నాలో శక్తిని, స్థైర్యాన్ని నింపారు’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది. కాగా భారత్ తరఫున వరల్డ్ చెస్ చాంపియన్‌గా నిలిచిన రెండో ఆటగాడిగా పద్దెమినిదేళ్ల గుకేశ్ చరిత్రకెక్కాడు. చెన్నైకే చెందిన విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించాడు. అంతేకాదు.. అత్యంత పిన్న వయసులోనే ప్రపంచ చాంపియన్ అయిన చెస్ ప్లేయర్‌గానూ రికార్డు సాధించాడు. సింగపూర్ సిటీలో ఇటీవల జరిగిన క్లాసికల్ ఫార్మాట్లో గుకేశ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్‌ను ఓడించిడిఫెండింగ్ చాంపియన్, చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌ను ఓడించి చాంపియన్ కిరీటాన్ని అందుకున్నాడు. 32 ఏళ్ల లిరెన్‌తో జరిగిన 14 గేమ్‌ల పోరులో 7.5–6.5 పాయింట్ల తేడాతో గెలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. 58 ఎత్తుల్లో లిరెన్ ఆట కట్టించి విజేతగా అవతరించాడుభారీ నజరానాఈ నేపథ్యంలో దొమ్మరాజు గుకేశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక వరల్డ్ చాంపియన్‌గా ట్రోఫీతో పాటు గుకేశ్ 13 లక్షల 50 వేల డాలర్ల(రూ.11.45 కోట్లు) ప్రైజ్‌మనీ పొందాడు. ఇక తమ రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకువచ్చిన గుకేశ్‌ను కొనియాడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భారీ నజరానా ప్రకటించారు. గుకేశ్‌కు రూ. ఐదు కోట్ల క్యాష్ రివార్డు అందచేస్తామని తెలిపారు. చదవండి: WPL 2025 Auction: ఆశ్చర్యం.. అనూహ్యం.. వారిపై కోట్ల వర్షం! వీరికి మొండిచేయి#WATCH | Chennai, Tamil Nadu: World Chess Champion #GukeshD says, "I am very glad to be here. I could see the support that and what it means to India...You guys are amazing. You gave me so much energy..." pic.twitter.com/iuFXDiLcjx— ANI (@ANI) December 16, 2024 -
అందుకే అంతగా ఏడ్చాను!
సింగపూర్ సిటీ: వరల్డ్ చెస్ చాంపియన్‌గా ఖాయమైన తర్వాత దొమ్మరాజు గుకేశ్ ఎంతో భావోద్వేగానికి లోనైన వీడియోను అభిమానులంతా చూశారు. విజయానంతరం అతను కన్నీళ్లపర్యంతమయ్యాడు. దీనిపై ‘ఫిడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుకేశ్ మాట్లాడాడు. అందుకు కారణాన్ని వివరించాడు. ‘నేను ఈ పోరులో మొదటినుంచి ఆధిక్యం కనబర్చలేదు. కొన్ని గేమ్‌లలో విజయానికి దగ్గరగా వచ్చి కూడా ఆ అవకాశం ఉపయోగించుకోలేకపోయాను. అంతా సాఫీగా, ఏకపక్షంగా పోరు జరిగి నా గెలుపు కాస్త ముందే ఖాయమై ఉంటే నేనూ మామూలుగానే కనిపించేవాడినేమో. కానీ చివర్లో గెలిచిన తీరుతో నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. అప్పటి వరకు గేమ్ డ్రా అవుతుందని, టైబ్రేక్‌కు వెళితే ఎలా సిద్ధం కావాలనే విషయం గురించి కూడా ఆలోచనలు మెదులుతున్నాయి. కానీ అద్భుతం జరిగి గెలిచేశాను. పైగా ఎనిమిదేళ్ల వయసులో చెస్ నేర్చుకున్న రోజులు కూడా ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. అందుకే ఆ కన్నీళ్లు’ అంటూ గుకేశ్ వివరించాడు. తాను ప్రపంచ చాంపియన్‌గా నిలిచినా...ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని, అయితే ప్రతీ సవాల్‌కు తాను సిద్ధమేనని గుకేశ్ వ్యాఖ్యానించాడు. పైగా చదరంగంలాంటి ఆటలో ఎవరూ వంద శాతం పర్ఫెక్ట్గా ఉండరని అతను అన్నాడు. ‘ఇప్పటి వరకు చెస్‌ను శాసించిన గొప్ప గొప్ప ఆటగాళ్లకు కూడా పరాజయాలు ఎదురైన సందర్భాలు ఉన్నాయి. ఆటలో నేర్చుకునేందుకు ఇంకా అవకాశం ఉంటుంది. నా వయసు కూడా అందుకు సహకరిస్తుంది. ఏదో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఇంకా బాగా ఆడేందుకు ప్రయత్నిస్తాను’ అని గుకేశ్ చెప్పాడు. చాంపియన్‌షిప్ సమయంలో తనకు సరిగ్గా ఇంటి భోజనం తరహాలో దక్షిణాది వంటకాలు అందించిన చెఫ్‌కు అతను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. -
గుకేశ్‌పై విమర్శలు: కొన్నిసార్లు పేలవంగా ఆడాను.. నిజమే.. కానీ
తన గెలుపును విమర్శిస్తున్న వారికి ప్రపంచ చెస్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ‘ఇలాంటి వ్యాఖ్యలు నన్నేమీ బాధపెట్టలేదు. కొన్ని గేమ్‌లు ఆశించిన స్థాయిలో దూకుడుగా సాగలేదనేది వాస్తవమే. అయితే చెస్ బోర్డుపై ఆటలో వేసే ఎత్తులు మాత్రం వరల్డ్ చాంపియన్‌ను నిర్ణయించవు. పట్టుదల, పోరాటతత్వం ఉండటంతో పాటు మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తే గెలుస్తాడు.కొన్నిసార్లు పేలవంగా ఆడాను.. నిజమే.. కానీవీటిన్నింటిని నేను చూపించానని నమ్ముతున్నా. ఆట విషయానికి వస్తే ఇది అత్యుత్తమ స్థాయి ప్రదర్శన కాకపోవచ్చు. ఎందుకంటే నేను తొలిసారి ఆడుతున్నాను. ఇతరులతో పోలిస్తే నాపై ఒత్తిడి కూడా భిన్నంగా ఉంటుంది. కొన్నిసార్లు నేను పేలవంగా ఆడాననేది కూడా నిజం. అయితే కీలక సమయాల్లో నేను సత్తా చాటి స్థాయిని ప్రదర్శించగలిగాను. దాని పట్ల నేను సంతోషంగా ఉన్నా’ అని గుకేశ్ వివరించాడు. చదరంగం చచ్చిపోయింది అంటూ విమర్శలుకాగా.. ‘గుకేశ్, లిరెన్ మధ్య గేమ్‌లు చూస్తే అసలు వరల్డ్ చాంపియన్షిప్లా లేదు... చదరంగం చచ్చిపోయింది... ఒక చిన్న తప్పు వరల్డ్ చాంపియన్‌ను నిర్ణయించడం ఏమిటి?’... గురువారం గుకేశ్ గెలుపు అనంతరం వచ్చిన విమర్శలివి! స్టార్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్తో పాటు మాజీ ఆటగాడు క్రామ్నిక్ తదితరులు గుకేశ్ ఘనతకు గౌరవం ఇవ్వకుండా ఆ విజయం స్థాయిని తక్కువగా చేసి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో గుకేశ్ పైవిధంగా స్పందించాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ విజయానికి ఆటతో పాటు మరెన్నో కారణాలు ఉంటాయని అతను అభిప్రాయపడ్డాడు.విమర్శలను పట్టించుకోవద్దు: ఆనంద్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత గుకేశ్ ఆటపై వస్తున్న కొన్ని విమర్శలను భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తిప్పి కొట్టాడు. ఎవరో ఒకరు ఇలాంటి మాటలు అంటూనే ఉంటారని, వాటిని పట్టించుకోవద్దని అతను గుకేశ్‌కు సూచించాడు. ‘గుకేశ్ చరిత్ర సృష్టించడం నేను కళ్లారా చూశాను. నాకు చాలా ఆనందంగా అనిపించింది. విమర్శలు ప్రతీ మ్యాచ్‌కు వస్తూనే ఉంటాయి.విజయాలు సాధించినప్పుడు ఇలాంటివి సహజం. వరల్డ్ చాంపియన్ అయ్యాక ఎవరో అనే ఇలాంటి మాటలను లెక్క చేయవద్దు. లిరెన్ క్షణం పాటు ఉదాసీనత ప్రదర్శించాడు. ఇలాంటి క్షణాలు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో దాదాపు ప్రతీ మ్యాచ్‌లో వస్తాయి. గుకేశ్ దానిని బాగా వాడుకున్న తీరును ప్రశంసించాలి’ అని ఆనంద్ పేర్కొన్నాడు. ఎన్నో త్యాగాలు చేశాడు ‘‘గుకేశ్ విశ్వ విజేతగా నిలిచిన క్షణం మా జీవితంలోనే అత్యుత్తమమైనది. ఇన్నేళ్ల తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడంతో చాలా సంతోషంగా ఉంది. గుకేశ్ ప్రపంచ చాంపియన్ అయ్యాడనే వార్త విని నేను నమ్మలేకపోయా. పది నిమిషాల పాటు ఏడ్చేశా. చిన్నప్పటి నుంచి గుకేశ్ ఎంతో క్రమశిక్షణతో చాలా కష్టపడ్డాడు. తానూ ఎన్నో త్యాగాలు చేశాడు. ఈ టైటిల్‌తో ఆ కష్టమంతా సంతోషంగా మారిపోయింది’’ అని గుకేశ్ తల్లి పద్మాకుమారి పుత్రోత్సాహంతో పొంగిపోయారు. చదవండి: గుకేశ్‌కు భారీ నజరానా ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం -
జాతికి గర్వకారణం
పది, పన్నెండేళ్ళుగా కంటున్న కలను నెరవేరిన తరుణం ఇది. చిన్నప్పుడు ఆడడం మొదలుపెడు తూనే మనసులో నాటిన లక్ష్యాన్ని సాధించిన చేరుకున్న దిగ్విజయ క్షణాలివి. అత్యంత పిన్నవయ స్కుడైన ప్రపంచ చదరంగ ఛాంపియన్‌గా నిలవడంతో పద్ధెనిమిదేళ్ళ దొమ్మరాజు గుకేశ్‌కు చిర కాలపు స్వప్నం సాకారమైంది. చరిత్రలో నిన్నటి వరకు గుకేశ్ కేవలం పిన్నవయస్కుడైన మూడో గ్రాండ్ మాస్టర్. కానీ, సింగపూర్‌లో జరుగుతున్న ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గురువారం సాయంకాలపు విజయంతో ఈ టీనేజ్ కుర్రాడు చదరంగ చరిత్రలో కొత్త అధ్యాయం రచించాడు. సుదీర్ఘ కాలం తరువాత మనవాడు ఒకడు ఇలా భారత ఘనవారసత్వ సంప్రదాయ ప్రాచీనక్రీడ చదరంగంలో జగజ్జేతగా నిలిచి, జాతికి గర్వకారణమయ్యాడు.చైనాకు చెందిన ప్రస్తుత ఛాంపియన్ డింగ్ లిరెన్‌పై చిరస్మరణీయ విజయంతో, అంచనాల్ని అధిగమించి, కాస్పరోవ్, మ్యాగ్నస్ కార్ల్సెన్ సరసన తన పేరు లిఖించాడు. గతంలో కాస్పరోవ్ పేరిట ఉన్న అత్యంత పిన్నవయస్కుడైన ప్రపంచ ఛాంపియన్ రికార్డును బద్దలుకొట్టాడు. ఇది ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగే క్షణం. మన చదరంగ క్రీడాలోకంలోనే కాదు... క్రీడాకారులందరిలోనూ ఉత్సాహం ఉరకలెత్తించే సందర్భం. నిజానికి, ఈ ఛాంపియన్షిప్ పోటీల్లో కొన్నిసార్లు గుకేశ్ తడబడకపోలేదు. మొత్తం 14 గేమ్‌ల ఈ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్ ప్రస్థానం అతని పట్టుదల, వ్యూహచతురతకు నిదర్శనం. మొదట్లో తడబడి, ఓపెనింగ్ రౌండ్లో ఓటమి పాలయ్యాడు. కానీ, కుంగిపోకుండా రెట్టించిన ఉత్సాహంతో విజృంభించాడు. విమర్శలను విజయసోపానాలుగా మలుచుకున్నాడు. పట్టువదలని విక్రమార్కు డిలా ఆటలో పైచేయి సాధించాడు. మొదటి నుంచి గుకేశ్ బృందం వేసుకున్న వ్యూహం ఒకటే. గుకేశ్ తన లాగా తాను ఆడాలి. అంతే! పక్కా ప్రణాళికతో ఈ యువ ఆటగాడు, అతని క్రీడాశిక్షకుడు, మిగతా బృందం పడ్డ శ్రమ ఫలించింది. కొన్నిసార్లు ఆట ఆరంభపుటెత్తులను ఆఖరి నిమిషంలో నిర్ణయిస్తే, మరికొన్నిసార్లు వాటి మీద వారాల తరబడి కసరత్తు చేస్తూ వచ్చారు. ఆ సాధన ఉపకరించింది. డింగ్‌తో ప్రతి గేమ్‌లోనూ తన ఓపెనింగ్స్ ద్వారా ప్రత్యర్థిని గుకేశ్ ఆశ్చర్యపరిచాడు. 14 గేమ్‌ల మ్యాచ్‌లో 13 గేమ్‌లు ముగిసినా, చెరి రెండు విజయాలతో టై నెలకొంది. ఆ పరిస్థితుల్లో గురువారం నాటి 14వ గేమ్ ఒక దశలో డ్రా దిశగా వెళుతున్నట్టు అనిపించినా, ప్రస్తుత ఛాంపియన్ డింగ్ లిరెన్ అనూహ్యంగా దిద్దుకోలేని తప్పు చేశాడు. అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకొని, గుకేశ్ తన ప్రత్యర్థి ఆట కట్టించాడు. 2.5 మిలియన్ డాలర్ల బహుమతి నిధిలో సింహభాగాన్నిసంపాదించాడు. గతంలో ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించిన విశ్వనాథన్ ఆనందన్ తర్వాత మళ్ళీ ఆ ఘనత సాధించిన రెండో భారతీయుడు అయ్యాడు.ఎప్పుడూ గంభీరంగా కనిపించే ఈ చెన్నై చిన్నోడు ఈ విజయంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టిన క్షణాలు, బయటకు వస్తూనే తండ్రిని గాఢంగా హత్తుకొని మాటల కందని భావా లను మనసుతో పంచుకున్న దృశ్యాలు ఇప్పుడిప్పుడే ఎవరికీ మరపునకు రావు. గుకేశ్ ఇప్పుడు చద రంగ ప్రపంచానికి సరికొత్త రారాజు. లెక్కల్లో చూస్తే, ప్రపంచ చదరంగానికి 18వ చక్రవర్తి. చదరంగంలో గుకేశ్ ప్రస్థానం ఇప్పుడొక పూర్తి ఆవృత్తం పూర్తి చేసుకుందనుకోవచ్చు. 2013లో 7 ఏళ్ళ గుకేశ్ చెన్నైలో ప్రేక్షకుల మధ్య కూర్చొని, విశ్వనాథన్ ఆనంద్‌కూ, మ్యాగ్నస్ కార్ల్సెన్కూ మధ్య జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మ్యాచ్ చూశాడు. ఆ మ్యాచ్‌లో గెలిచిన కార్ల్సెన్ అప్పటి నుంచి గత ఏడాది వరకు ప్రపంచ ఛాంపియన్‌గా పట్టు కొనసాగించారు. నిరుడు డింగ్ ఆ పట్టం గెలిచారు. చిన్న నాటి నుంచి అలా సౌండ్‌ప్రూఫ్ గ్లాస్ బూత్‌లో కూర్చొని, ఆటలో గెలవాలని కలలు గన్న గుకేశ్ ఎట్టకే లకు ఆ స్వప్నాన్ని నిజం చేసుకున్నాడు. అయితే, ఇంత త్వరగా తన ఆకాంక్ష నెరవేరుతుందని అతనూ ఊహించలేదు. కార్ల్సెన్ నంబర్ 1 ర్యాంకులో ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ తాను ప్రపంచ అత్యుత్తమ ఆటగాణ్ణి కాదని వినయం ప్రదర్శిస్తున్నాడు. ఏదో ఒక రోజున కార్ల్సెన్లా చెస్ ప్రపంచాన్ని ఏలాలని తమిళనాట పెరిగిన ఈ తెలుగు మూలాల టీనేజ్ కుర్రాడు ఆశిస్తున్నాడు. గతంలో 22 ఏళ్ళ వయసుకే గ్యారీ కాస్పరోవ్ ప్రపంచ ఛాంపియన్ టైటిల్ సాధించారు. అప్పట్లో ఆయన అనటోలీ కార్పోవ్‌ను ఓడించి, ఆ టైటిల్ సాధించి, అతి పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించారు. కేవలం పన్నెండేళ్ళ ఏడు నెలల వయసుకే గ్రాండ్ మాస్టరైన గుకేశ్ ఇప్పుడు 18వ ఏట ఆ ఘనత సాధించడం ఎలా చూసినా విశేషమే. గుకేశ్ బాటలోనే మన దేశ కీర్తిపతాకాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళగల సత్తా ఉన్న ప్రతిభావంతులైన చెస్ క్రీడాకారులు ఇంకా చాలామంది ఉన్నారు. ఇటీవల బుడాపెస్ట్‌లో జరిగిన ఒలింపియాడ్‌లో ఓపెన్ గోల్డ్, ఉమెన్స్ గోల్డ్... రెంటినీ భారత చదరంగ జట్లు విజయవంతంగా గెలిచాయి. ప్రస్తుతం దాదాపు 85 మందికి పైగా గ్రాండ్ మాస్టర్లు భారత్‌లో ఉన్నారనేది ఆశ్చర్యపరిచే గణాంకం. పైగా, వారిలో చాలామంది ఇప్పటికీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రానంతటి పిన్న వయస్కులు. అంటే ఈ విశ్వక్రీడలో భారత్‌కు ఎంతటి బంగారు భవిష్యత్తు ఉందో అర్థం చేసుకోవచ్చు. రాగల రోజుల్లో ప్రజ్ఞానంద లాంటి పలువురు ప్రపంచ ఛాంపియన్లుగా ఎదగగల సత్తా పుష్కలంగా ఉన్నవారు. అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ శిష్యరికంలో ఈ స్థాయికి ఎదిగిన గుకేశ్ ఇప్పుడు అలాంటి ఎందరికో సరికొత్త ప్రేరణ. సుదీర్ఘ క్రీడా జీవితం ముందున్న ఈ టీనేజర్ భవిష్యత్ ప్రయాణంలో ఈ కొత్త ప్రపంచ కిరీటం ఓ మైలురాయి మాత్రమే. రానున్న రోజుల్లో ఇలాంటివి అనేకం కైవసం చేసుకొని, మరింత మంది గుకేశ్ల రూపకల్పనకు ఈ కుర్రాడు స్ఫూర్తి కిరణంగా భాసించడం ఖాయం. -
గుకేశ్‌కు భారీ నజరానా
పిన్న వయస్సులోనే చదరంగ రారాజుగా అవతరించిన దొమ్మరాజు గుకేశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. పద్దెనిమిదేళ్ల వయసులో ఈ కుర్రాడు సాధించిన విజయం పట్ల యావత్ భారతావని పులకరించిపోతోంది. ‘‘సరిలేరు నీకెవ్వరు’’ అంటూ ఈ ప్రపంచ చాంపియన్‌కు క్రీడాలోకం నీరాజనాలు పలుకుతోంది.ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం గుకేశ్‌కు భారీ నజరానా ప్రకటించింది. చెన్నైకి చెందిన ఈ చెస్ ప్లేయర్‌కు ఏకంగా రూ. 5 కోట్ల రివార్డు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.రూ. 5 కోట్ల నజరానా‘‘చిన్న వయసులోనే ప్రపంచ చెస్ చాంపియన్‌గా దొమ్మరాజు గుకేశ్ అవతరించిన ఈ చారిత్రక సందర్భంలో రూ. 5 కోట్ల నజరానా అందిస్తున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉంది.గుకేశ్ చారిత్రాత్మక విజయం దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసింది. అతడు భవిష్యత్తులోనూ ఇలాంటి గొప్ప విజయాలెన్నో మరిన్ని సాధించాలని కోరుకుంటున్నా. ఇలాంటి యువ తారలను తీర్చిదిద్దడంలో శక్తి వంచన లేకుండా తమ మద్దతు అందిస్తున్న తమిళనాడు క్రీడా శాఖ, ఉదయనిధి స్టాలిన్‌కు అభినందనలు’’ అని స్టాలిన్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.డిఫెండింగ్ చాంపియన్‌ను ఓడించి.. రూ. 11 కోట్ల ప్రైజ్మనీసింగపూర్ సిటీ వేదికగా జరిగిన క్లాసికల్ ఫార్మాట్లో డిఫెండింగ్ చాంపియన్, చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేశ్ వరల్డ్ చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. లిరెన్‌తో జరిగిన 14 గేమ్‌ల పోరులో గుకేశ్ 7.5–6.5 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. 58 ఎత్తుల్లో 32 ఏళ్ల లిరెన్ ఆటకు చెక్ పెట్టి అత్యుత్తమ ప్రదర్శనతో చదరంగ రారాజుగా అవతరించాడు. తద్వారా విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇక వరల్డ్ చాంపియన్‌గా ట్రోఫీతో పాటు గుకేశ్‌కు 13 లక్షల 50 వేల డాలర్లు (రూ.11.45 కోట్ల ప్రైజ్‌మనీ) లభించింది. అంతేకాకుండా మూడు గేమ్‌లు గెలిచినందుకు అదనంగా రూ.5.07 కోట్లు గుకేశ్‌కు అందాయి.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
జగజ్జేత మన గుకేశ్
అద్భుతం జరగడంలో కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు... కానీ అసలు సమయంలో అలాంటి అద్భుతాన్ని ఎవరూ ఆపలేరు! ఒకటి కాదు... రెండు కాదు... కనీసం మూడుసార్లు దొమ్మరాజు గుకేశ్‌కు విజయావకాశాలు వచ్చాయి... కానీ దురదృష్టవశాత్తూ త్రుటిలో అతను వాటిని చేజార్చుకున్నాడు. మరోవైపు ప్రత్యర్థి కూడా మూడుసార్లు పైచేయి సాధించి గెలుపుపై కన్నేసినా... బలంగా నిలబడ్డాడు. అన్నింటికి మించి యుద్ధ వ్యూహాల్లో ‘సంధి’ కూడా ఒక భాగమే అన్నట్లుగా ఒక అడుగు వెనక్కి తగ్గుతూ అవసరమైనప్పుడు ‘డ్రా’లకు అంగీకరించాడు. కానీ పోరు ఆఖరి ఘట్టానికి చేరేసరికి ఇక సంధి దశకు సమయం మించిపోయింది. దాడి చేయడం మినహా మరో మార్గం లేదు. ఇక్కడ వెనుకంజ వేస్తే ఇక కోలుకునేందుకు ఎలాంటి అవకాశమూ ఉండదు. అందుకే ఆ సమయంలో తనలోని అసలైన అస్త్రశ్రస్తాలకు పదును పెట్టాడు.అతను పన్నిన ఉచ్చులో డింగ్ లిరెన్ చిక్కాడు. 55వ ఎత్తు వద్ద అతను సరిదిద్దుకోలేని తప్పిదం చేశాడు. అంతే...మరో మూడు ఎత్తుల్లోనే గుకేశ్ చైనా కింగ్ ఆట కట్టించాడు... అద్భుత ప్రదర్శనతో కొత్త చరిత్రను సృష్టిస్తూ అరవై నాలుగు గళ్ల ప్రపంచంలో రారాజుగా కిరీటధారణ చేశాడు. ఆట ముగిశాక సాంప్రదాయం ప్రకారం గుకేశ్ చెస్ బోర్డుపై మళ్లీ పావులను పేరుస్తున్నాడు... ఒక్కో గడిలో వాటిని పెడుతున్న సమయంలో అతని కన్నీళ్లు ఆగడం లేదు... ఏడుస్తూనే అభినందనలు అందుకుంటున్నాడు... ఆ భావోద్వేగాలను నియంత్రించడం సాధ్యం కావడం లేదు. అతను చేతులు జోడించి పదే పదే బోర్డుకు మొక్కుతున్న తీరు చూస్తే గుకేశ్ దృష్టిలో అది అరవై నాలుగు గళ్ల ఆట వస్తువు మాత్రమే కాదనిపిస్తోంది... అదో దేవాలయంలా, తానో భక్తుడిలా కనిపిస్తున్నాడు. 11 ఏళ్ల చిన్నారిగా ఉన్న సమయంలో ఏదో ఒక రోజు ప్రపంచ చాంపియన్‌ను అవుతానని చెప్పుకున్న ఆ కుర్రాడు టీనేజర్‌గానే ఆ లక్ష్యాన్ని చేరుకున్న క్షణాన తన ఇన్నేళ్ల కష్టం, సాధన, త్యాగాలను గుర్తు చేసుకుంటున్నట్లుగా అనిపించింది... ఆటలో తొలి ఎత్తు వేసిన నాటి నుంచే అసాధారణ ప్రదర్శనలకు చిరునామాగా మారిన గుకేశ్ నలుపు తెలుపుల గళ్లలోనే తన రంగుల ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. అతి పిన్న వయసులో గ్రాండ్‌మాస్టర్‌గా రికార్డు సృష్టించే అవకాశాన్ని 17 రోజుల తేడాతో కోల్పోయిన ఈ చెన్నై చిన్నోడు ఇప్పుడు 18 ఏళ్ల వయసులో 18వ ప్రపంచ చాంపియన్‌గా తన జెండా పాతాడు. –సాక్షి క్రీడా విభాగంసింగపూర్ సిటీ: భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ కొత్త ప్రపంచ చెస్ చాంపియన్‌గా ఆవిర్భవించాడు. 18 ఏళ్ల వయసులోనే విశ్వ విజేతగా నిలిచి ఈ ఘనత సాధించిన అతి పిన్న వయసు్కడిగా నిలిచాడు. క్లాసికల్ ఫార్మాట్లో డిఫెండింగ్ చాంపియన్, చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌తో జరిగిన 14 గేమ్‌ల పోరులో గుకేశ్ 7.5–6.5 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. 13 గేమ్‌లు ముగిసేసరికి ఇద్దరూ 6.5–6.5 పాయింట్లతో సమంగా ఉండగా నిర్ణాయక చివరి పోరులో గుకేశ్ తన సత్తాను ప్రదర్శించాడు. 58 ఎత్తుల్లో లిరెన్ ఆట కట్టించి విజయనాదం చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో క్యాండిడేట్స్ టోర్నీ గెలుచుకొని వరల్డ్ చాంపియన్‌కు సవాల్ విసిరేందుకు సిద్ధమైన రోజు నుంచి గుకేశ్‌పై అంచనాలు పెరిగాయి. నవంబర్ 25 నుంచి మొదలైన ఈ సమరంలో 9 గేమ్‌లు ‘డ్రా’గానే ముగిశాయి. గురువారం చివరి గేమ్‌కు ముందు చెరో రెండు గేమ్‌లు గెలిచిన ఇద్దరూ సమంగా ఉన్నారు. ఈ గేమ్ కూడా ‘డ్రా’ అయితే ‘టైబ్రేక్’ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చేది. కానీ గుకేశ్ ఆ అవకాశం ఇవ్వలేదు. తన అత్యుత్తమ ఆటను ప్రదర్శించి లిరెన్‌ను పడగొట్టాడు. తద్వారా క్లాసికల్ విభాగంలో దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ (2012) తర్వాత వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన భారత ప్లేయర్‌గా గుకేశ్ నిలిచాడు. చివరి పోరు సాగిందిలా... తెల్లపావులతో ఆడిన 32 ఏళ్ల లిరెన్ కింగ్స్ ఇండియన్ అటాక్ ఓపెనింగ్‌తో ఆటను మొదలు పెట్టగా... గ్రన్ఫీల్డ్ వేరియేషన్‌తో గుకేశ్ బదులిచ్చాడు. ఈ గేమ్ కూడా ‘డ్రా’ అయితే తన బలమైన ర్యాపిడ్‌లో గుకేశ్ ఆట కట్టించవచ్చని భావించిన లిరెన్ ఈసారి కూడా దూకుడు ప్రదర్శించకుండా రక్షణాత్మకంగా నే ఆడాడు. ఇక మరో ‘డ్రా’ ఖాయం అనిపించింది. ఈ దశలో లిరెన్ చేసిన భారీ తప్పిదం తన టైటిల్ కోల్పోయేలా చేసింది. తన 55వ ఎత్తులో అతను రూక్‌ను ఎఫ్2 గడిలోకి పంపించాడు. ఆశ్చర్యంతో గుకేశ్ కళ్లు ఒక్కసారిగా మెరిశాయి! కాస్త మంచినీళ్లు తాగిన అనంతరం గుకేశ్ తన ప్రత్యర్థి ఆట కట్టించేందుకు ఎన్ని ఎత్తులు అవసరమో ప్రశాంతంగా ఆలోచించుకున్నాడు. ఆపై ఎంతో సమయం పట్టలేదు. తన 58వ ఎత్తులో కింగ్‌ను ఇ5 గడిలోకి పంపడంతో లిరెన్‌కు ఓటమిని అంగీకరించడం మినహా మరో మార్గం లేకపోయింది. 39 ఏళ్ల రికార్డు బద్దలు రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ పేరిట 39 ఏళ్లుగా ఉన్న రికార్డును భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ బద్దలు కొట్టాడు. క్లాసికల్ చెస్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన పిన్న వయసు్కడిగా ఇప్పటి వరకు కాస్పరోవ్ (22 ఏళ్ల 6 నెలల 27 రోజులు; 1985లో కార్పోవ్‌పై విజయం) పేరిట రికార్డు ఉంది. అయితే గురువారం ఈ రికార్డును గుకేశ్ (18 ఏళ్ల 8 నెలల 14 రోజులు) తిరగరాశాడు. విశ్వవిజేతగా నిలిచిన గుకేశ్‌కు 13 లక్షల 50 వేల డాలర్లు (రూ. 11 కోట్ల 45 లక్షలు), రన్నరప్ డింగ్ లిరెన్‌కు 11 లక్షల 50 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 75 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ‘డ్రా’లను దాటి... ‘గుకేశ్, లిరెన్ మధ్య గేమ్‌లు చూస్తుంటే వరల్డ్ చాంపియన్‌షిప్ పోరులాగా అస్సలు అనిపించడం లేదు. ఇద్దరిలో ఎవరూ పైచేయి సాధించేందుకు ఇష్టపడటం లేదు’... నార్వే చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ వ్యాఖ్య ఇది. ‘ఈ గేమ్‌లు ఇలాగే సాగితే చదరంగంపై ఇప్పటికి మిగిలిన ఉన్న ఆ కాస్త ఆసక్తి కూడా పోతుంది’... పలువురు మాజీలు, విశ్లేషకుల అభిప్రాయం ఇది. గుకేశ్, లిరెన్ మధ్య సాగిన పోరు చూస్తే ఇది వాస్తవమే అనిపిస్తుంది. మొదటి గేమ్‌లో లిరెన్ గెలుపుతో చాంపియన్‌షిప్ సమరం ఉత్సాహంగా మొదలైంది. రెండో గేమ్ ‘డ్రా’ కాగా... మూడో గేమ్‌లో గుకేశ్ విజయం సాధించి లెక్క సమం చేశాడు. ఆ తర్వాత వరుసగా ఏడు గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. దాంతో సగటు చెస్ అభిమానులు కూడా ఇదేం ఆట అన్నట్లుగా నిట్టూర్పు విడిచారు. ముఖ్యంగా ఇద్దరు ఆటగాళ్లు చెరో మూడుసార్లు గెలిచే అవకాశం వచ్చినా... వాటిని చేజార్చుకోవడం, దూకుడుగా ఆడి పైచేయి సాధించే ప్రయత్నం చేయకపోవడం కూడా ఆశ్చర్యం కలిగించింది. 10 గేమ్‌ల తర్వాత గుకేశ్ గెలుపుపై స్వయంగా కార్ల్సన్ కూడా సందేహం వ్యక్తం చేశాడు. లిరెన్ కూడా జాగ్రత్తగా ఆడి ర్యాపిడ్ పోరువైపు తీసుకెళ్లే ఆలోచనతో ఉన్నట్లే కనిపించింది. కానీ 11వ గేమ్‌లో గుకేశ్ గెలుపు ఒక్కసారిగా చలనం తీసుకొచ్చింది. ఆ వెంటనే లిరెన్ కూడా విజయంతో సమాధానమివ్వడంతో మరింత ఆసక్తి పెరిగింది. అయితే 13వ గేమ్ కూడా ‘డ్రా’ అయింది. దాంతో అందరి దృష్టి చివరి పోరుపై నిలిచింది. కానీ విశ్వనాథన్ ఆనంద్ కూడా ఫలితంపై సందేహంతోనే ఉన్నాడు. దాదాపు సగం ఆట ముగిశాక ఈ మ్యాచ్‌లో ఎవరైనా గెలిచే అవకాశాలు ఒక శాతం కూడా లేవని అతను అభిప్రాయపడ్డాడు. అయితే లిరెన్ చేసిన తప్పు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను అనూహ్యంగా ముగించింది. అంది వచ్చిన అవకాశాన్ని సమర్థంగా వాడుకున్న మన గుకేశ్ ఈ మెగా ఈవెంట్‌ను భారతీయుల దృష్టిలో చిరస్మరణీయం చేశాడు. చిత్తూరు జిల్లా మూలాలు... వరదయ్యపాళెం: గుకేశ్‌ది చెన్నైలో స్థిరపడిన తెలుగు కుటుంబం. వారిది తిరుపతి జిల్లాకు చెందిన గ్రామీణ నేపథ్యం. గుకేశ్ తండ్రి రజనీకాంత్ స్వస్థలం సత్యవేడు సమీపంలోని పిచ్చాటూరు మండలం చెంచురాజుకండ్ర. ఆయన తన వైద్యవృత్తి కోసం చెన్నైకి తరలి వెళ్లగా, అక్కడే అబ్బాయి పుట్టాడు. గుకేశ్ తాత శంకరరాజు సొంత ఊరు చెంచురాజుకండ్రలోనే ప్రస్తుతం స్థిరపడ్డారు. గుకేశ్‌కు వైఎస్ జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: పిన్న వయస్సులో ప్రపంచ చెస్ చాంపియన్‌గా అవతరించిన తెలుగు తేజంగుకేశ్ దొమ్మరాజు చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. గుకేశ్‌కు అభినందనలు తెలుపుతూ గురువారం ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. గుకేశ్ తెలుగు వాడైనందుకు గర్విస్తున్నామన్నారు. గుకేశ్ దేశంలోని యువతకు, విద్యార్థులకు ప్రేరణగా నిలవనున్నారని పేర్కొన్నారు. ఒక తెలుగు యువ కుడు ఈ రికార్డు సాధించడం అందరికీ ఆదర్శనీయమన్నారు. భవిష్యత్తులో గుకేశ్ మరిన్ని విజయాలు సాధించాలని జగన్ ఆకాంక్షించారు. -
ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్‌కు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్‌కు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గుకేష్‌కు ఎక్స్ వేదికగా విషెస్ చెప్పారు. ‘‘18 ఏళ్ల వయసులోనే గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా చరిత్రకెక్కారు. గుకేష్ తెలుగు రాష్ట్రానికి చెందినవాడు కావటం మనందరికీ గర్వకారణం. ఎంతోమంది యువకులకు ఆయన స్ఫుర్తిగా నిలిచారు. భవిష్యత్తులో కూడా గుకేష్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Gukesh Dommaraju carved his name into history as the youngest-ever World Chess Champion at the age of 18.We are proud of this 🇮🇳 boy from the Telugu state, a true inspiration to countless talented youngsters. I wish @DGukesh all the best in his continued journey of remarkable… pic.twitter.com/58JSdgNZeR— YS Jagan Mohan Reddy (@ysjagan) December 12, 2024వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించాడు. 14వ గేమ్‌లో గుకేశ్ ప్రస్తుత ఛాంపియన్, చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించాడు. గుకేశ్ 18 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. తద్వారా ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.విశ్వనాథన్ ఆనంద్ తర్వాత (2012) వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడిగా గుకేశ్ చరిత్ర సృష్టించాడు. గుకేశ్ అత్యంత చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం పోటీ పడిన అతి పిన్న వయస్కుడిగానూ గుకేశ్ రికార్డు నెలకొల్పాడు. -
గుకేశ్, లిరెన్ నాలుగో గేమ్ ‘డ్రా’
సింగపూర్ సిటీ: భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్... డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్‌కు ప్రతీ రౌండ్లోనూ గట్టి పోటీనే ఇస్తున్నాడు. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ సమరంలో భాగంగా శుక్రవారం భారత్, చైనా ప్రత్యర్థుల మధ్య పోటాపోటీగా సాగిన నాలుగో రౌండ్ గేమ్ ‘డ్రా’గా ముగిసింది. నల్లపావులతో బరిలోకి దిగిన భారత టీనేజ్ గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ ఎత్తులకు డిఫెండింగ్ చాంపియన్ తడబడ్డాడు. 32 ఏళ్ల లిరెన్ పైఎత్తులకు దీటైన సమాధానం ఇవ్వడంతో చివరకు 42 ఎత్తుల తర్వాత ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో ఇద్దరు ‘డ్రా’కు అంగీకరించారు. తొలి గేమ్‌లో ఓడిన గుకేశ్ రెండో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. తిరిగి మూడో రౌండ్లో సత్తా చాటుకున్న 18 ఏళ్ల ఈ భారత ఆటగాడు... చైనా గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించాడు. తాజాగా నాలుగో రౌండ్ గేమ్ ‘డ్రా’గా ముగియడంతో ఇద్దరు 2–2 పాయింట్లతో సమఉజ్జీలుగా నిలిచారు. ఇంకా 10 గేమ్‌లు మిగిలిఉన్న ఈ చాంపియన్‌షిప్‌లో ముందుగా ఎవరైతే 7.5 పాయింట్లు సాధిస్తారో వారే విజేతగా నిలుస్తారు. -
ప్రజ్ఞానందపై ఆనంద్ మహీంద్రా ట్వీట్.. నువ్వు 'రన్నరప్' కాదు..
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం.. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎన్నెన్నో ఆసక్తికరమైన అంశాలను ట్విటర్ వేదికగా పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే తాజాగా మరో ట్వీట్ చేసాడు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. చదరంగంలో (చెస్) అందరి ద్రుష్టి తనవైపు తిప్పుకున్న 'ప్రజ్ఞానంద' (Praggnanandhaa) ఫైనల్ స్టేజిలో రన్నర్‌గా నిలిచాడు. ఈ గేమ్‌లో కార్ల్సన్ అద్భుత విజయం సాధించి విన్నర్ టైటిల్ సొంతం చేసుకున్నారు. ఇదీ చదవండి: ఎవరీ 'మాయా టాటా'? లక్షల కోట్ల 'టాటా' సామ్రాజ్యానికి వారసురాలు ఈమేనా? దీనిపైన ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేస్తూ నువ్వు 'రన్నరప్' కాదు @rpragchess. ఇది మీ గొప్పతనానికి 'రన్-అప్' మాత్రమే. మరో సారి పోరాడటానికి అనేక యుద్దాలు నేర్చుకోవడం అవసరం అంటూ.. నువ్వు నేర్చుకున్నావు, మళ్ళీ పోరాడతావు మనమందరం మళ్ళీ అక్కడ ఉంటామని ట్వీట్ చేసాడు. దీనికి ఇప్పటికీ వేల సంఖ్యలో లైకులు వచ్చాయి, కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. You aren’t the ‘runner-up’ @rpragchess This is simply your ‘run-up’ to Gold and to greatness. Many battles require you to learn & live to fight another day. You’ve learned & you will fight again; and we will all be there again…cheering you on loudly. 🇮🇳👏🏽👏🏽👏🏽 #praggnanandha https://t.co/2L0U1cZD4E — anand mahindra (@anandmahindra) August 24, 2023 -
'చీటింగ్ చేసేవాడితో ఆడలేను.. అందుకే తప్పుకున్నా'
వరల్డ్ చెస్ ఛాంపియన్.. నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సన్ ప్రత్యర్థి చెస్ ఆటగాడు నీమ్యాన్పై సంచలన ఆరోపణలు చేశాడు. ప్రత్యర్థి హన్స్ నీమ్యాన్ పదే పదే చీటింగ్‌కు పాల్పడినట్లు కార్ల్సన్ ఆరోపించాడు. విషయంలోకి వెళితే.. శనివారం జూలియస్ బేర్ జనరేషన్ కప్ ఆన్లైన్ ర్యాపిడ్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో కార్లసన్ మరోసారి నీమ్యాన్తో తలపడ్డాడు. ఒక ఎత్తు వేసిన వెంటనే కార్ల్సన్ ఆట నుంచి తప్పుకున్నాడు. ఇది అక్కడున్న వారందరిని షాక్‌కు గురి చేసింది. అయితే తాను తప్పుకోవడంపై కార్ల్సన్ తన ట్విటర్లో స్పందించాడు. కార్ల్సన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పాటు ఇటీవలే ముగిసిన సిన్‌క్యూఫీల్డ్ కప్ నుంచి వైదొలడంపై కార్ల్సన్ వివరణ ఇచ్చాడు. ''సిన్‌క్యూఫీల్డ్ కప్ నుంచి పక్కకు తప్పుకోడానికి ఒక కారణం ఉంది. నీమ్యాన్ ఆ మ్యాచ్‌లో చీటింగ్‌కు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని అతనే ఇటీవలే ఒప్పుకున్నాడు. అలాంటి ప్లేయర్‌తో ఆడలేను.ఆన్లైన్లోనే కాదు.. బోర్డ్ ప్లేలో కూడా నీమ్యాన్ చీటింగ్ చేశాడు. జూలియస్ బేర్ జనరేషన్ కప్‌లో అతనితో మరోసారి ఎదురుపడాల్సి వచ్చింది. కానీ పదే పదే చీటింగ్ చేసే ఆటగాడితో నేను ఆడలేను అందుకే తప్పుకున్నా.'' అంటూ పేర్కొన్నాడు. ఇటీవల సెయింట్ లూయిస్‌లో జరిగిన ఓ టోర్నమెంట్లో నీమ్యాన్ చేతిలో కార్ల్సన్ ఓటమి పాలయ్యాడు. వరల్డ్ చాంపియన్ ఆ టోర్నీ నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. అయితే కేవలం తన కెరీర్‌ను దెబ్బ తీసేందుకు తనపై కార్ల్సన్ చీటింగ్ ఆరోపణలు చేస్తున్నట్లు నీమ్యాన్ ఆరోపించాడు. ఇక ఆదివారం జరిగిన జూలియస్ బేర్ జనరేషన్ కప్ ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో మాగ్నస్ కార్ల్సన్ విజేతగా అవతరించాడు. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిశేషి అర్జున్‌పై రెండు ఫైనల్స్‌లోనూ కార్ల్సన్ 2.5–0.5; 2–0 తేడాతో గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. My statement regarding the last few weeks. pic.twitter.com/KY34DbcjLo — Magnus Carlsen (@MagnusCarlsen) September 26, 2022 చదవండి: సిరీస్ క్లీన్‌స్వీప్.. పీపీఈ కిట్లతో క్రికెటర్ల క్యాట్‌వాక్ స్టార్ క్రికెటర్ కోసం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన పోలీసులు -
ప్రపంచ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ సంచలన నిర్ణయం
ప్రపంచ చెస్ ఛాంపియన్, వరల్డ్ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్ (31) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఏడాది (2023) తన ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్‌ను డిఫెండ్ చేసుకోబోనని ప్రకటించాడు. గత దశాబ్ద కాలంగా చెస్ ప్రపంచాన్ని మకుటం లేని మారాజులా ఏలుతున్న కార్ల్సన్.. గతేడాది (2021) ఛాంపియన్షిప్ సాధించిన అనంతరమే ఈ విషయమై క్లూ ఇచ్చాడు. తాజాగా తాను టైటిల్ డిఫెండ్ చేసుకోవట్లేదని ఇవాళ స్పష్టం చేశాడు. చెస్ ఛాంపియన్ హోదాపై తనకు ఆసక్తి లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తన ఫ్రెండ్‌కు ఇచ్చిన పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కార్ల్సన్ గతేడాది ఇయాన్ నెపోమ్నియాచిపై ఐదో టైటిల్ నెగ్గి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే, కార్ల్సన్ నిర్ణయంపై భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాధన్ ఆనంద్ స్పందించాడు. కార్ల్సన్ నిర్ణయం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. 1975లో బాబీ ఫిషర్ కూడా ఇలాగే ఆటను మధ్యలోనే వదిలేశాడని, ఇలా చేయడం వల్ల చదరంగం క్రీడకు నష్టం జరుగుతుందని అన్నాడు. చదవండి: బాంబుల మోత నుంచి తప్పించుకొని పతకం గెలిచి.. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేత కార్ల్సన్
సొచి(రష్యా): ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ పోటీలలో కార్ల్సన్ విజేతగా నిలిచారు. 11వ గేమ్‌లో భారత్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌పై కార్ల్సన్ విజయం సాధించారు. నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్సన్ వరుసగా రెండవసారి ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. **