heavy rains in tamilnadu
-
వచ్చే వారం ఈ నాలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
సాక్షి, చెన్నై : రోజులు గడుస్తున్న కొద్దీ తమిళనాడులో వర్షాల బీభత్సం పెరుగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలు కుండపోత వర్షాలతో అల్లాడిపోతున్నాయి. అనేక ఊర్లు, పట్టణాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. చెన్నై నగరాన్ని కూడా ఇంకా వరద ముప్పు వీడలేదు. చెన్నై వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని కన్యాకుమారి, వెల్లూరు, రాణిపేట్, తిరుపత్తూరు, ధర్మపురి, తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, నామక్కల్, కరూర్, దిండిగల్, సేలం, నీలగిరి, కోయంబత్తూర్, తేని, పెరంబలూర్, తిరుచిరాపల్లి , మధురై, విరుదునగర్, తెంకాసిలో శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. చదవండి: ఢిల్లీ కాలుష్యంపై సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం: వారం రోజులపాటు.. కేరళకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ భారత వాతావరణ శాఖ కేరళలో ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు, వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో అత్యవసర సహాయ శిబిరాలను ఏర్పాటు చేస్తామని కేరళ సీఎం పినరయి విజయన్ ఫేస్బుక్లో ప్రకటించారు. చదవండి: ప్రపంచవ్యాప్తంగా మన నగరమే మొదటి స్థానం.. కానీ అదో చెత్త రికార్డ్ వచ్చే వారం కొనసాగనున్న వర్షాలు మరికొన్ని రోజులు ఈ వర్షాలు కొనసాగనున్నాయి. వచ్చేవారం కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం నాడు దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న థాయ్‌లాండ్ తీరంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. భారత వాతావరణ శాఖ ప్రకారం ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కొనసాగి, మరింత బలపడి, నవంబర్ 18 నాటికి ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరుకునే అవకాశం ఉంది. అండమాన్ నికోబార్ దీవులలో సోమవారం వరకు.. కోస్తా ఆంధ్రాలో నవంబర్ 17న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. చదవండి: వైరల్: సరదా తీర్చిన యువతి ఫోట్‌షూట్.. కొంచెం బొద్దుగా ఉండటంతో.. నవంబర్ 16 వరకు దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో 17 న ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వెల్లడించింది. నవంబర్ 17 నుంచి ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల వెంబడి గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. సోమవారం వరకు అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులకు వాతావరణ శాఖ సూచించింది. బుధ, గురువారాల్లో ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు దూరంగా ఉండాలని వారికి సూచించారు. -
హ్యాట్సాఫ్ మేడమ్!.. యువకుడిని భుజాలపై మోసుకెళ్లిన మహిళా పోలీస్
చెన్నై: తమిళనాడులో వరుణుడి బీభత్సం గత నాలుగు రోజులుగా కొనసాగుతోంది. ఎడతెరపి లేని వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు ఏరులై పారుతోంది. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద నీరు ముంచెత్తుతుంది. వర్షాలు, వరదలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో మహిళా పోలీస్ అధికారి ఓ వ్యక్తిని కాపాడిన వీడియో తాజాగా వైరలవుతోంది. చదవండి: అద్భుతమైన ఫోటో.. రాష్ట్రపతిని ఆశీర్వదించిన 102 ఏళ్ల టీచర్ పోలీస్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరి చెన్నైలోని టీపీ ఛత్రం ప్రాంతంలోని స్మశానవాటికలో భారీ వర్షం కారణంగా చెట్టు విరిగిపడి 8 ఏళ్ల యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లగా.. మహిళా పోలీస్ అధికారి ఆమె భుజాలపై యువకుడిని మోసుకెళ్లి ఆటోలో ఆసుపత్రికి తరలించారు. దీనిపై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. మహిళా పోలీస్ ధైర్యసాహసాలను మెచ్చుకుంటున్నారు. ‘మీ సేవతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. హ్యాట్సాఫ్ మేడమ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా భారీ వర్షాలతో శనివారం నుంచి ఇప్పటివరకు 12 మంది మరణించినట్లు తమిళనాడు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ జయంత్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం సాయంత్రం ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం దాటుతుందని, చెన్నై, దాని శివారు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆయన పేర్కొన్నారు. -
కోయంబత్తూరు మెట్టుపాళ్యంలో ఘోర విషాదం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా మెట్టుపాళ్యంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మూడు భవనాలు కూలి 15 మంది మృతి చెందారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు సమాచారం. స్థానికులు, అగ్నిమాపక సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భారీ వర్షాల కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా మృతుల్లో ముగ్గురు పురుషులు, 10మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతుల వివరాలు గురు (45), రాంనాథ్ (20), ఆనంద్ కుమార్ (40), హరిసుధ (16), శివగామి (45), ఒవియమ్మా (50), నిత్యా (30), వైదేహి (20), తిలగవతి(50), అరుకాని (55), రుక్మణి (40), చిన్నమ్మాల్ (70), అక్షయ (7), లోగురాం (7). ఈ ప్రమాదంలో ఒక కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షం బీభత్సంగా కురుస్తోంది. నిన్న 14 జిల్లాల్లో 53 చోట్ల 10 సె.మీకి పైగానే వర్షం కురిసింది. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు, చెరువులు పూర్తిగా నిండాయి. లోతట్టు ప్రాంతాలు, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కాయి. మరో రెండు రోజులు వర్షం కొనసాగనుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంత్రులందరూ వారి వారి జిల్లాలకు పరుగులు తీశారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. ఇక, ఈశాన్య రుతుపవనాలతో ఈ ఏడాది పడాల్సిన వర్షం పూర్తి స్థాయిలో పడింది. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో అధికార యంత్రాంగం ఆరంజ్ అలర్ట్ ప్రకటించింది. వీడని వాన.. ఆదివారం ఒక్క రోజు 14 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీగానే వర్షం పడింది. తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాథపురం, కడలూరులలో అతి భారీ వర్షాలు పడ్డాయి. తిరువళ్లూరు, కాంచీపురం, వేలూరు, తిరువణ్ణామలై, విల్లుపురం, ఈరోడ్, నీలగిరి, కోయంబత్తూరు, దిండుగల్, తేని జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. మదురై, పెరంబలూరు, అరియలూరు, తిరుచ్చి, తంజావూరు, పుదుకోట్టై , నాగపట్నం , శివగంగై జిల్లాల్లో మోస్తరుగా వర్షం పడుతోంది. తూత్తుకుడి జిల్లాలో వర్ష విళయానికి లోట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కి ఉన్నాయి. వేలాది ఇళ్లల్లోకి నీళ్లు చొరబడడంతో అధికార యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరంచేసింది. తూత్తుకుడి ప్రధాన రైల్వే స్టేషన్‌ను మూసివేయాల్సినంతగా పరిస్థితి మారింది. ప్లాట్‌ఫామ్‌లు సైతం కనిపించని రీతిలో నీళ్లు ఇక్కడ చుట్టుముట్టాయి. జాతీయ రహదారిలోనూ వరద ఉధృతి హోరెత్తడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం తప్పలేదు. తిరునల్వేలి జిల్లాల్లో అన్ని జలాశయాలు పూర్తిగా నిండాయి. కుట్రాలం మరీ కుండపోతగా మారడంతో ఆ దరిదాపుల్లో ఎవ్వర్నీ అనుమతించడం లేదు. తామర భరణి నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఆ తీరం వెంబడి గ్రామాలమధ్య సంబంధాలు తెగాయి. అనేక ఆలయాలు నీట మునిగి ఉన్నాయి. రామనాథపురం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. రామేశ్వరంలో గాలి ప్రభావానికి 30 పడవలు దెబ్బతిన్నాయి. కడలూరు జిల్లాలో అయితే, అతి పెద్ద చెరువుగా ఉన్న వీరానం నిండింది. ఉబరి నీటి విడుదలతో అనేక గ్రామాల్లోని పంట పొల్లాలు మునిగాయి. డెల్టాలోని తిరువారూర్, తంజావూరు, నాగపట్నం, అరియలూరు, పెరంబలూరు, పుదుకోట్టై జిల్లాల్లో అయితే, అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. వరి సాగులో అన్నదాత నిమగ్నమై ఉన్న దృష్ట్యా, వర్షం కారణంగా పొలాలన్నీ చెరువుల్ని తలపించే పరిస్థితి. భారీ వర్షాలు, పలువురు మృతి మరోవై ఈ వర్షాలతో నిన్నటి పది మంది ఇప్పటి వరకు మరణించారు. శుక్రవారం ఇళ్లు కూలడంతో కడలూరులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. శని, ఆదివారాల్లో కురిసిన వర్షాలకు మరో ఏడుగురు బలి అయ్యారు. తంజావూరులో ఇంటి గోడ కూలడంతో దురై కన్ను(70), పుదుకోట్టైలో మోటార్ సైకిల్‌తో పాటు వరదల్లో కొట్టుకెళ్లి ఓ యువకుడు గల్లంతయ్యాడు. చెన్నై అంబత్తూరులో రోడ్డుపై తవ్విన గోతిలో వర్షంపు నీరు చేరడంతో అది తెలియక అటు వైపుగా వచ్చిన షేక్ అలీ అందులోపడి విగతజీవి అయ్యాడు. తిరునల్వేలిలో తామరభరణిలో 81 ఏళ్ల వృద్ధుడు కొట్టుకెళ్లాడు. ఇక, కడలూరు, నాగపట్నంలలో కల్వర్టులను దాటుతూ వరద ఉదృతిలో మరో ముగ్గురు కొట్టుకెళ్లారు. వీరి జాడ కాన రాలేదు. మరణించి ఉంటారని నిర్ధారించిన పోలీసులు, మృతదేహాల కోసం గాలిస్తున్నారు. మంత్రుల పరుగు.. వర్షం మరో రెండు రోజులు కొనసాగనున్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించడంతో అధికార వర్గాలు మరింత అప్రమత్తం అయ్యాయి. వర్షం బీభత్సంగా పడుతుండడంతో మంత్రులు అందరూ తమ తమ జిల్లాలకు చెన్నై నుంచి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. అధికార వర్గాలతో కలిసి సహాయక చర్యల్లో మునిగి ఉన్నారు. ఇక, ఈ వర్షం రూపంలో పెను విపత్తు అన్నది చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యల్ని మరింత విస్తృతం చేయాలని జిల్లాల కలెక్టర్లకు సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. అలాగే, సోమవారం సచివాలయంలో సీఎం పళనిస్వామి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. ఇక, వర్షాల ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో సోమవారం స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్టు ఆదేశాలు జారీ చేశారు. కాగా, వర్షం ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ వర్గాలు సహాయక చర్యల్లో నిమగ్నం కావాలని, బాధితులకు అండగా నిలవాలని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. విమాన సేవలకు ఆటంకం వర్షం కారణంగా చెన్నైలో విమాన సేవలకు ఆటంకాలు నెలకొన్నాయి. కుండపోతగా విమానాశ్రయ పరిసరాల్లో ఉదయాన్నే వర్షం పడింది. దీంతో ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, బెంగళూరు వైపుగా వెళ్లాల్సిన అనేక విమానాలు టేకాఫ్ చేసుకునేందుకు ఇబ్బందులు నెలకొన్నాయి. దీంతో కాస్త ఆలస్యంగా ఈ విమానాలు బయలుదేరాయి. అలాగే, సింగపూర్, దోహా, దుబాయ్, బక్రెయిన్‌లకు బయలుదేరాల్సిన విమానాలు గంటన్నర ఆలస్యంగా టేకాఫ్ చేసుకున్నాయి. చెన్నై నుంచి కోలాలంపూర్ బయలుదేరిన విమానం టేకాఫ్ చేసుకున్న కాసేపటికి సాంకేతిక లోపం కారణంగా ల్యాండింగ్‌ను అనుమతించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ విమానాన్ని బెంగళూరుకు దారిమళ్లించారు. అలాగే, కొలంబోకు బయలుదేరాల్సిన విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపానికి గురైంది. దీంతో ఆ విమానం మూడు గంటల సేపు ఆలస్యంగా బయలుదేరింది. ఈ కారణాలతో ఆదివారం చెన్నైలో విమాన సేవలకు ఆటంకాలు నెలకొన్నాయి. అలాగే, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. -
తమిళనాడుపై పగబట్టిన వరుణుడు
చెన్నై: తమిళనాడుపై వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపిస్తున్నాడు. తుఫాను ప్రభావంతో ప్రసిద్ధి పర్యాటకకేంద్రం కన్యాకుమారి అతలాకుతలం అయ్యింది. జిల్లాలో భారీ వర్షాల కారణంగా అయిదుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఇవాళ మధ్యాహ్నం కురిసిన భారీ వర్షాలకు తోడు, ఈదురు గాలులతో పెద్ద ఎత్తున చెట్లు కూలిపోయాయి. ఒక్కసారిగా చెట్లు కూలడంతో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాలతో పాటు ఈదురు గాలులు బలంగా వీడయంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అలాగే కన్యాకుమారిలో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు, సముద్రంలో వేటకు వెళ్లడాన్ని నిషేధించడమే కాకుండా, పర్యాటకులు సముద్రంలో ఈత కొట్టడంతో పాటు, బీచ్‌కి వెళ్లడంపై ఆంక్షలు విధించారు. అలాగే తిరునల్వేలి, కన్యాకుమారి, రామేశ్వరం, కొలాచల్ ఓడరేవుల్లో మూడోనెంబర్ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ఇక వర్షాల కారణంగా కన్యాకుమారి నుంచి నాగర్ కోవిల్, త్రివేండ్రం వెళ్లే రైళ్లను నిలిపివేశారు. మరోవైపు తుఫాను ప్రభావంతో ఏడు జిల్లాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. కాగా ఈ నెల మొదట వారంలో తమిళనాడులో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. -
137 ఏళ్లలో తొలిసారి...
-
137 ఏళ్లలో తొలిసారి...
చెన్నై : తమిళనాడును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ ప్రభావం తొలితరం దిన పత్రిక 'ది హిందు'పై కూడా పడింది. భారీ వర్షాల కారణంగా 'ది హిందు' ప్రింటింగ్ నిలిపివేసింది. 137 ఏళ్లలో 'ది హిందు' ప్రింటింగ్ నిలిపివేయడం ఇదే తొలిసారి. దీంతో తమిళనాడులో బుధవారం ది హిందు దిన పత్రిక వెలువడలేదు. ప్రింటింగ్ ప్రెస్ కు వర్కర్స్ రాలేకపోవడంతో పత్రికను నిలిపివేసినట్లు పబ్లిషర్ ఎన్ మురళి తెలిపారు. తమ ప్రింటింగ్ ప్రెస్ చెన్నైసిటీకి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో మరైమలై నగర్లో ఉందని, వర్షాల కారణంగా వర్కర్స్ అక్కడకు ఎవరూ చేరుకునే పరిస్థితి లేదన్నారు. ప్రింటింగ్ ప్రెస్ చాలా పెద్దది అయినందున తాము నగర శివారులో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాగా ది హిందు 1878లో ప్రారంభమైన విషయం తెలిసిందే. మరోవైపు టైమ్స్ ఆఫ్ ఇండియా, దక్కన్ క్రానికల్, న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రికలు యథావిధిగానే ప్రచురితం అయ్యాయి. ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా చెన్నై విమానాశ్రయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. రన్ వే పైకి నీరు చేరటంతో ఎక్కడ విమానాలు అక్కడ నిలిచిపోయాయి.