యూపీ లేడీ సింగం పై బదీలీ వేటు.. | Mass Transfer In UP Includes Woman Cop Who Took On Angry BJP Workers | Sakshi
Sakshi News home page

యూపీ లేడీ సింగం పై బదీలీ వేటు..

Published Sun, Jul 2 2017 3:41 PM | Last Updated on Fri, Mar 29 2019 5:33 PM

యూపీ లేడీ సింగం పై బదీలీ వేటు.. - Sakshi

యూపీ లేడీ సింగం పై బదీలీ వేటు..

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ కార్యకర్తలకు గట్టి ఝలక్‌ ఇచ్చి లేడీ సింగం అనిపించుకున్న పోలీస్‌ అధికారిణీ శ్రేష్ట ఠాకూర్‌పై బదీలీ వేటు పడింది. ఆమె ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న స్యానా సర్కిల్‌ నుంచి బహ్రైచ్‌కి బదీలీ చేశారు. లోకల్‌ బీజేపీ కార్యకర్తల నుంచి ఒత్తిడే ఆమె బదీలీకి కారణమని ప్రచారం జరుగుతోంది.

గత నెల 25న జిల్లా స్ధాయి బీజేపీ కార్యకర్తలతో  సరైన ధ్రువపత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా వారికి జరిమాన విధించి జైలుకు పంపించింది. చుట్టుపదుల సంఖ్యలో వారంతా గుమిగూడి ఆమెను బెదిరించే ప్రయత్నం చేసినా ఏ మాత్రం భయపడకుండా మీ వాహనాలు తనిఖీ చేయకూడదని వెళ్లి ముఖ్యమంత్రితో లిఖిత పూర్వక అనుమతి లేఖను తీసుకొని రండి అని  వారికి దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చింది. ఇది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆమె సాహసానికి ప్రశంసల జల్లు కురిసింది. కానీ ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే ఆమె బదిలీ అవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement