Shreshtha Thakur
-
‘బదిలీతో ఏమవుద్ది.. దీపం ఎక్కడున్నా వెలుగే’
లక్నో: మిత్రులారా బాధపడకండి.. నేను సంతోషంగా ఉన్నాను.. నేను చేసిన మంచి పనికి ఈ ట్రాన్స్ఫర్ నాకొచ్చిన రివార్డు అనుకుంటున్నాను’ అని ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నేతలకు గట్టి ఝలక్ ఇచ్చి ప్రస్తుతం బదిలీ వేటుకు గురైన పోలీస్ అధికారిణి శ్రేష్టా ఠాకూర్ సింగ్ తన ఫేస్బుక్ పేజీలో రాశారు. గత నెల 25న జిల్లా స్ధాయి బీజేపీ కార్యకర్తలతో సరైన ధ్రువపత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని శ్రేష్టా సింగ్ అదుపులోకి తీసుకోవడమే కాకుండా వారికి జరిమాన విధించి జైలుకు పంపారు. చుట్టుపదుల సంఖ్యలో వారంతా గుమిగూడి ఆమెను బెదిరించే ప్రయత్నం చేసినా ఏ మాత్రం భయపడకుండా మీ వాహనాలు తనిఖీ చేయకూడదని వెళ్లి ముఖ్యమంత్రితో లిఖిత పూర్వక అనుమతి లేఖను తీసుకొని రండి అని వారికి దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె సాహసానికి ప్రశంసల జల్లు కురిసింది. దీంతో తమ మనోభావాలు దెబ్బదిన్నాయని ఓ పదకొండుమంది ఎమ్మెల్యేలు సీఎం యోగికి మొరపెట్టుకున్న నేపథ్యంలో ఆమెను ఏజెన్సీ ప్రాంతానికి బదిలీ చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఆమెపై వేటు వేయడంపై పలువురు ఆగ్రహం చేస్తున్న నేపథ్యంలో శ్రేష్టా సింగ్ తన ఫేస్బుక్ పేజీలో ఇలా రాసుకొచ్చారు.‘దీపం ఎక్కడికి వెళ్లినా వెళుతురునే ఇస్తుంది. దానికంటూ ఒక ప్రదేశం నిర్దేశించి ఉండదు. నేను బదిలీ అయినా బహ్రైచ్కు మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. నన్ను బదిలీ చేశారని నేను బాధపడట్లేదు. మీరు కూడా బాధపడకండి. ఇది నేను చేసిన మంచిపనికి నాకిచ్చిన రివార్డు అనుకుంటాను’ అని చెప్పారు. ఆమె చేసిన ఈ పోస్ట్‌ను అనంతరం తొలగించారు. మరిన్ని సంబంధిత వార్తలకోసం చదవండి 'సీఎంతో రాయించుకొని రా.. ఎప్పటికీ చెక్ చేయం' యూపీ లేడీ సింగం పై బదీలీ వేటు.. -
యూపీ లేడీ సింగం పై బదీలీ వేటు..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ కార్యకర్తలకు గట్టి ఝలక్ ఇచ్చి లేడీ సింగం అనిపించుకున్న పోలీస్ అధికారిణీ శ్రేష్ట ఠాకూర్‌పై బదీలీ వేటు పడింది. ఆమె ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న స్యానా సర్కిల్ నుంచి బహ్రైచ్‌కి బదీలీ చేశారు. లోకల్ బీజేపీ కార్యకర్తల నుంచి ఒత్తిడే ఆమె బదీలీకి కారణమని ప్రచారం జరుగుతోంది. గత నెల 25న జిల్లా స్ధాయి బీజేపీ కార్యకర్తలతో సరైన ధ్రువపత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా వారికి జరిమాన విధించి జైలుకు పంపించింది. చుట్టుపదుల సంఖ్యలో వారంతా గుమిగూడి ఆమెను బెదిరించే ప్రయత్నం చేసినా ఏ మాత్రం భయపడకుండా మీ వాహనాలు తనిఖీ చేయకూడదని వెళ్లి ముఖ్యమంత్రితో లిఖిత పూర్వక అనుమతి లేఖను తీసుకొని రండి అని వారికి దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చింది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె సాహసానికి ప్రశంసల జల్లు కురిసింది. కానీ ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే ఆమె బదిలీ అవడం గమనార్హం. -
'సీఎంతో రాయించుకొని రా.. ఎప్పటికీ చెక్ చేయం'
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ సీనియర్ మహిళా పోలీసు అధికారి కొంతమంది బీజేపీ కార్యకర్తలకు గట్టి ఝలక్ ఇచ్చింది. సరైన ధ్రువపత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా వారికి జరిమాన విధించి, అరెస్టు చేయడంపై ఆందోళన చేయబోయిన వారికి ధైర్యంగా సమాధానం చెప్పింది. చుట్టుపదుల సంఖ్యలో వారంతా గుమిగూడి ఆమెను బెదిరించే ప్రయత్నం చేసినా ఏ మాత్రం భయపడకుండా వారికి దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చింది. 'మీ వాహనాలు తనిఖీ చేయకూడదని వెళ్లి ముఖ్యమంత్రితో లిఖిత పూర్వక అనుమతి లేఖను తీసుకొని రండి.. అలా అయితే మేం ఏం చెయ్యం. ఇంత రాత్రిళ్లుపూట మా కుటుంబాలను వదలేసి సరదా కోసం ఇక్కడకు రాలేదు.. మా విధులు మేం నిర్వర్తిస్తున్నాం' అంటూ వారికి ఘాటు సమాధానం ఇచ్చింది. అంతేకాదు.. 'మీరు మీ పార్టీకి(బీజేపీకి) చెడ్డపేరు తెస్తున్నారు. ప్రజలు త్వరలోనే మిమ్మల్ని బీజేపీ గుండాలని అంటారు' అని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రమోద్‌లోదీ అనే జిల్లాస్థాయి బీజేపీ నేత సరైన పత్రాలు లేకుండానే వాహనాలు నడుపుతున్నాడని గుర్తించిన పోలీసులు అతడికి జరిమానా విధించారు. దీంతో అతడు పోలీసులతో దురుసుగా ప్రవర్తింగా అరెస్టు చేశారు. దీనిపై రచ్చ చేసే ప్రయత్నం చేయగా శ్రేష్ట ఠాకూర్ అనే సర్కిల్ అధికారి తగిన విధంగా బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.