‘బదిలీతో ఏమవుద్ది.. దీపం ఎక్కడున్నా వెలుగే’ | “Don’t worry my friends I am happy: Shreshtha Thakur | Sakshi
Sakshi News home page

‘బదిలీతో ఏమవుద్ది.. దీపం ఎక్కడున్నా వెలుగే’

Published Mon, Jul 3 2017 4:59 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

‘బదిలీతో ఏమవుద్ది.. దీపం ఎక్కడున్నా వెలుగే’ - Sakshi

‘బదిలీతో ఏమవుద్ది.. దీపం ఎక్కడున్నా వెలుగే’

లక్నో: మిత్రులారా బాధపడకండి.. నేను సంతోషంగా ఉన్నాను.. నేను చేసిన మంచి పనికి ఈ ట్రాన్స్‌ఫర్‌ నాకొచ్చిన రివార్డు అనుకుంటున్నాను’ అని ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నేతలకు గట్టి ఝలక్‌ ఇచ్చి ప్రస్తుతం బదిలీ వేటుకు గురైన పోలీస్‌ అధికారిణి శ్రేష్టా ఠాకూర్‌ సింగ్‌ తన ఫేస్‌బుక్‌ పేజీలో రాశారు. గత నెల 25న జిల్లా స్ధాయి బీజేపీ కార్యకర్తలతో  సరైన ధ్రువపత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని శ్రేష్టా సింగ్‌ అదుపులోకి తీసుకోవడమే కాకుండా వారికి జరిమాన విధించి జైలుకు పంపారు.

చుట్టుపదుల సంఖ్యలో వారంతా గుమిగూడి ఆమెను బెదిరించే ప్రయత్నం చేసినా ఏ మాత్రం భయపడకుండా మీ వాహనాలు తనిఖీ చేయకూడదని వెళ్లి ముఖ్యమంత్రితో లిఖిత పూర్వక అనుమతి లేఖను తీసుకొని రండి అని వారికి దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చారు. ఇది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆమె సాహసానికి ప్రశంసల జల్లు కురిసింది. దీంతో తమ మనోభావాలు దెబ్బదిన్నాయని ఓ పదకొండుమంది ఎమ్మెల్యేలు సీఎం యోగికి మొరపెట్టుకున్న నేపథ్యంలో ఆమెను ఏజెన్సీ ప్రాంతానికి బదిలీ చేసినట్లు చెప్పుకుంటున్నారు.

ఆమెపై వేటు వేయడంపై పలువురు ఆగ్రహం చేస్తున్న నేపథ్యంలో శ్రేష్టా సింగ్‌ తన ఫేస్‌బుక్‌ పేజీలో ఇలా రాసుకొచ్చారు.‘దీపం ఎక్కడికి వెళ్లినా వెళుతురునే ఇస్తుంది. దానికంటూ ఒక ప్రదేశం నిర్దేశించి ఉండదు. నేను బదిలీ అయినా బహ్రైచ్‌కు మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. నన్ను బదిలీ చేశారని నేను బాధపడట్లేదు. మీరు కూడా బాధపడకండి. ఇది నేను చేసిన మంచిపనికి నాకిచ్చిన రివార్డు అనుకుంటాను’  అని చెప్పారు. ఆమె చేసిన ఈ పోస్ట్‌ను అనంతరం తొలగించారు. 
 
మరిన్ని సంబంధిత వార్తలకోసం చదవండి

'సీఎంతో రాయించుకొని రా.. ఎప్పటికీ చెక్‌ చేయం'

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement