న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో ఒంటరి పోరుకు సిద్ధమని టీఎంసీ చీఫ్, రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించడంతో విపక్ష ఇండియా కూటమిపై బీజేపీ విరుచుకుపడింది. మమత ప్రకటనను విపక్ష ఇండియా కూటమికి చావుదెబ్బగా అభివర్ణించింది. ‘‘విపక్షాలది కేవలం కాగితపు కూట మేనని మరోసారి రుజువైంది. వాటి రాజకీయ వివాహం పూర్తిగా జరగక ముందే విడాకుల దాకా వెళ్లింది’’ అంటూ ఎద్దేవా చేసింది. మమత ప్రకటన ఆమెలో నిరాశా నిస్పృహలకు కూడా అద్దం పట్టిందని పేర్కొంది.
విపక్ష కూటమి రాజకీయంగా మనగలిగే పరిస్ధితి లేదని, కాంగ్రెస్, వామపక్షాలు, టీఎంసీ మధ్య విభేదాలతో కూటమి అతుకుల బొంతగా తయారైందని ఎద్దేవా చేసింది.ఇది అసహజ కూటమిగా మారింది..బెంగాల్‌లో కాంగ్రెస్, సీపీఎం మమతా బెనర్జీతో విభేదిస్తున్నాయని బెంగాల్ బీజేపీ చీఫ్ సుంకత మజుందార్ ఎద్దేవా చేశారు. ఈ మూడు పార్టీల అగ్రనేతల మధ్య సామరస్య వాతావరణం ఉన్నా క్షేత్రస్దాయిలో పరిస్ధితి వేరేగా ఉందని అన్నారు.
కాగా పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని మమతా బెనర్జీ ప్రకటించించిన విషయం తెలిసిందేజ పంజాబ్‌లోనూ తమది ఒంటరి పోరేనని ఆప్ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బెంగాల్లోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందు జరిగిన ఈ పరిణామంతో ఆ పార్టీ ఒక్కసారిగా కంగుతిన్నది. 28 విపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమికి కీలక సమయంలో బీటలు పడుతుండటం కాంగ్రెస్‌ను కుంగదీసే పరిణామమేనని అంటున్నారు.
చదవండి: Lok Sabha polls 2024: ఇండియా కూటమికి బీటలు
Comments
Please login to add a commentAdd a comment