కార్మికులను ఆదుకోవాలి
వస్త్రపరిశ్రమకు కొత్త ఆర్డర్లు ఇవ్వాలి
సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్/సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభు త్వం వెంటనే జోక్యం చేసుకుని సిరిసిల్ల నేత న్న ల సమ్మెను విరమింపజేయాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్, సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవా లని, గత 27 రోజులుగా అక్కడి వస్త్ర పరిశ్రమ ఆసా ములు, కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి ప్రభుత్వమే కారణ మని, వెంటనే వారికి రూ.270 కోట్ల బకాయిలను విడు దల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు.
ప్రభుత్వం వెంటనే కొత్త ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవా లని కోరారు. గత 4 నెలలుగా యజమానులు, నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పాత బకాయిలు రాక, కొత్త ఆర్డర్లు లేక దాదాపు 20 వేల మంది పవర్‌లూమ్, అనుబంధ రంగాల కార్మికులు పనుల్లేక పస్తులుండే పరిస్థి తులు ఏర్పడ్డాయ న్నారు. నేత కార్మి కులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నా రు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పథ కాన్ని ప్రవేశపెట్టి కచ్చితంగా అవే చీరలను నేయాలంటూ.. ఆసాము లను, యజమాను లను ఒత్తిడి చేసి పాత వ్యాపారాలను బలవంతంగా బంద్ చేయించిందన్నారు.
మాస్టర్ వీవర్స్ పేరుతో బడా వ్యాపారులకు బతుకమ్మ ఆర్డర్లను ఇచ్చిన నేపథ్యంలో చిన్న ఖార్ఖానాల ఆసాములు, యజమానులు కూలీలుగా మారాల్సి వచ్చిందన్నారు. పవర్‌లూమ్ కార్ఖానాల విద్యుత్ బకాయిల మాఫీతో పాటు గతంలో ఇచ్చిన విద్యుత్ సబ్సిడీని కొన సాగించాలని కోరారు. ఈ కార్ఖానాలకు గత 24 ఏళ్లుగా 50% సబ్సిడీతో అందిస్తున్న విద్యుత్‌ను నిలిపివేయడంతో రెట్టింపు విద్యుత్ బిల్లులు వస్తున్నాయని తెలిపారు. నేత కార్మికుడిని ఆసామి చేయాలనే సంకల్పంతో గత ప్రభుత్వం రూ.370 కోట్ల వ్యయంతో ప్రవేశపెట్టిన ‘వర్కర్ టు ఓనర్’పథకాన్ని పునః ప్రారంభించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment