సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి రైల్వే టరి్మనల్‌కు వెళ్లే రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎంకు సోమవారం లేఖ రాశారు. తెలంగాణలో మౌలికవసతుల అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించి పదేళ్లుగా ఈ దిశగా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి శరవేగంగా సాగుతోందని.. కొత్త లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్‌తోపాటు లైన్ల విద్యుదీకరణ పనులు, 40కిపైగా స్టేషన్ల అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇందులో భాగంగా సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు పెరుగుతున్న రద్దీ దృష్ట్యా హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లిలో రూ. 415 కోట్లతో కొత్త రైల్వే టరి్మనల్ నిర్మాణం కూడా వేగంగా పూర్తవుతోందన్నారు. చర్లపల్లి రైల్వే టరి్మనల్ ప్రారంభోత్సవానికి ప్రత్యక్షంగా హాజరై ప్రజలకు అంకితం చేసేందుకు ప్రధాని మోదీ అంగీకరించారని కిషన్‌రెడ్డి తెలియజేశారు.
100 అడుగుల దాకా రోడ్లు..: ‘చర్లపల్లి రైల్వే టరి్మనల్‌కు చేరుకోవడానికి ఎఫ్‌సీఐ గోడౌన్ వైపు నుంచి ప్రయాణికుల రాకపోకల కోసం 100 అడుగుల రోడ్డు నిర్మాణం అవసరముంది. దీనిపై మీరు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయించేలా అధికారులను ఆదేశించాలని కోరుతున్నా’అని సీఎం రేవంత్‌ను కిషన్‌రెడ్డి కోరారు.
సికింద్రాబాద్ స్టేషన్ మార్గంలోనూ..: దక్షిణ మధ్య రైల్వే కేంద్ర స్థానమైన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను రూ. 715 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఏడాది చివరి నాటికల్లా అత్యాధునిక వసతులతో ప్రజలకు ఈ స్టేషన్‌ను అంకితం చేసేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయని వివరించారు. అయితే రైల్వేస్టేషన్‌కు ప్రయాణికులు వచి్చ, వెళ్లే మార్గాలు చాలా ఇరుకుగా ఉన్నాయన్నారు. రేతిఫైల్ బస్ స్టేషన్, ఆల్ఫా హోటల్ మధ్యనున్న రోడ్డు ఇరుకుగా ఉండటంతో రద్దీ వేళల్లో ప్రయాణికులకు తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. రోడ్డు విస్తరణ పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గే వీలు ఉంటుందని.. ఈ విషయంలోనూ చొరవ తీసుకోవాలని సీఎంను కిషన్‌రెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment