సీజేఐ చంద్రచూడ్‌కు రిటైర్డ్ జడ్జిల లేఖ.. | 21 Retired Judges Write Letter to CJI DY Chandrachud | Sakshi
Sakshi News home page

సీజేఐకు రిటైర్డ్ జడ్జిల లేఖ.. ఏం రాశారో తెలుసా?

Published Mon, Apr 15 2024 3:21 PM | Last Updated on Mon, Apr 15 2024 4:45 PM

21 Retired Judges Write Letter to CJI DY Chandrachud - Sakshi

ఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు మొత్తం 21 మంది కలిసి భారత ప్రధాన న్యాయమూర్తి 'డీవై చంద్ర‌చూడ్‌'కు లేఖ రాశారు. కొన్ని వర్గాలు న్యాయవ్యవస్థ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, బహిరంగంగా కించపరచడం ద్వారా న్యాయవ్యవస్థను అస్థిరపరిచేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఈ లేఖలో ఎత్తిచూపారు.

మన న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని వమ్ముచేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారని 21 మంది రిటైర్డ్ జడ్జీలు రాసిన లేఖలో పేర్కొన్నారు. జరుగుతున్న పరిణామాలు కేవలం అనైతికంగా మాత్రమే కాదు, మన ప్రజాస్వామ్యం పునాది సూత్రాలకు అత్యంత హానికరమని కూడా వారు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement