retired judges
-
న్యాయవ్యవస్థను తక్కువ చేసేందుకు ప్రయత్నాలు
న్యూఢిల్లీ: పథకం ప్రకారం ఒత్తిళ్లు తేవడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, బహిరంగ విమర్శల ద్వారా న్యాయ వ్యవస్థను చులకన చేసేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని రిటైర్డు జడ్జీల బృందం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగత లబ్ధి, రాజకీయ స్వార్థం కోసం జరిగే ఇటువంటి ప్రయత్నాల కారణంగా న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం తగ్గిపోయే ప్రమాదముందని వారు పేర్కొన్నారు. అయితే, ఏ పరిణామాలు తమను ఈ లేఖ రాసేందుకు ప్రేరేపించాయనే విషయాన్ని అందులో వారు ప్రస్తావించలేదు. అవినీతి కేసుల్లో కొందరు ప్రతిపక్ష నేతల అరెస్టుపై అధికార బీజేపీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్న సమయంలో ఈ లేఖ రాయడం గమనార్హం. ఆరోపణలెదుర్కొంటున్న నేతలు, వారి పార్టీలు కోర్టులను ఆశ్రయించడం, న్యాయవ్యవస్థ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను చూపుతూ బీజేపీ వారిపై ప్రత్యారోపణలు చేస్తుండటాన్ని లేఖలో వారు ప్రస్తావించారు. ‘ఇటువంటి చర్యలతో న్యాయవ్యవస్థ పవిత్రత దెబ్బతింటోంది. జడ్జీల నిష్పాక్షికత, సచ్ఛీలత అనే సూత్రాలకు ఇవి సవాల్‌గా మారాయి. ఇటువంటి అవాంఛిత ఒత్తిడుల నుంచి న్యాయవ్యవస్థను కాపాడు కోవాల్సిన అవసరం ఉంది’అని లేఖలో పేర్కొన్నారు. నిరాధార సిద్ధాంతాలను ప్రచారం చేయడం వంటి చర్యల ద్వారా న్యాయపరమైన ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొన్ని సమూహాలు అనుసరిస్తున్న వ్యూహం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. సుప్రీంకోర్టు నేతృత్వంలోని న్యాయవ్యవస్థను ఇటువంటి ఒత్తిళ్లకు వ్యతిరేకంగా బలోపేతం చేయాలని, న్యాయ వ్యవస్థ పవిత్రతను, స్వయంప్రతిపత్తిని పరిరక్షించాలని వారు కోరారు. న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా, అస్థిర రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. లేఖ రాసిన వారిలో సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జీలు జస్టిస్ దీపక్ వర్మ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ ఎంఆర్ షా సహా వివిధ హైకోర్టులకు చెందిన 21 మంది న్యాయమూర్తులు ఉన్నారు. -
సీజేఐ చంద్రచూడ్‌కు రిటైర్డ్ జడ్జిల లేఖ..
ఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు మొత్తం 21 మంది కలిసి భారత ప్రధాన న్యాయమూర్తి 'డీవై చంద్రచూడ్'కు లేఖ రాశారు. కొన్ని వర్గాలు న్యాయవ్యవస్థ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, బహిరంగంగా కించపరచడం ద్వారా న్యాయవ్యవస్థను అస్థిరపరిచేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఈ లేఖలో ఎత్తిచూపారు. మన న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని వమ్ముచేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారని 21 మంది రిటైర్డ్ జడ్జీలు రాసిన లేఖలో పేర్కొన్నారు. జరుగుతున్న పరిణామాలు కేవలం అనైతికంగా మాత్రమే కాదు, మన ప్రజాస్వామ్యం పునాది సూత్రాలకు అత్యంత హానికరమని కూడా వారు పేర్కొన్నారు. 21 Retired Judges write to Chief Justice of India (CJI) Dy Chandrachud "We write to express our shared concern regarding the escalating attempts by certain factions to undermine the judiciary through calculated pressure, misinformation, and public disparagement. It has come to… pic.twitter.com/bPZ0deczI2 — ANI (@ANI) April 15, 2024 -
నూపుర్ శర్మపై తీవ్ర వ్యాఖ్యలు దురదృష్టకరం
ఢిల్లీ: అధికారం ఉందన్న పొగరుతో ఇష్టానుసారం మాట్లాడారంటూ.. బీజేపీ సస్పెండెడ్ నేత నూపుర్ శర్మపై సుప్రీం కోర్టు ఆగ్రహం వెల్లగక్కింది. అయితే ఆమెకు మద్దతుగా.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్‌పైనా సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా సుప్రీం కోర్టు వ్యాఖ్యలను తప్పుబడుతూ మాజీలంతా కలిసి బహిరంగ ప్రకటన విడుదల చేయడం, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. పదిహేను మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 77 మంది రిటైర్డ్ బ్యూరోక్రాట్స్, 25 మంది ఆర్మీ మాజీ అధికారులు ఈ బహిరంగ ప్రకటనలో సంతకం చేశారు. నూపుర్ శర్మ పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పర్దీవాలా చేసిన వ్యాఖ్యలు సరికాదని, ఆ వ్యాఖ్యలు దురదృష్టకరమని, మునుపెన్నడూ వినలేదని పేర్కొన్నారు. తన భద్రత దృష్ట్యా.. దేశంలో తనకు వ్యతిరేకంగా నమోదు అయిన ఎఫ్ఐఆర్లను ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై వాదనల సందర్భంగా.. నూపుర్ శర్మ భద్రతకు ముప్పు కాదని.. ఆమె తన వ్యాఖ్యలతో దేశ భద్రతకు ముప్పుగా పరిణమించారంటూ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రవక్తకు సంబంధించి కామెంట్లు చేయాల్సిన అవసరం ఏముందని, ఆమె వ్యాఖ్యలే దేశంలో కొన్ని దురదృష్టకర ఘటనలకు కారణమైందని(ఉదయ్‌పూర్ ఘటనను ఉద్దేశించి) బెంచ్ వ్యాఖ్యానించింది. ఇటువంటి వ్యక్తులు మతం కోసం మాట్లాడినట్లు కాదు. అసలు వీళ్లు ఇతర మతాలను గౌరవించే రకం కూడా కాదు. నోటి దురుసుతో దేశం మొత్తాన్ని రావణ కాష్టం చేశారని, యావత్ జాతికి ఆమె మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని సుప్రీం కోర్టు మండిపడింది. అయితే సుప్రీం కోర్టు బెంచ్‌లో జస్టిస్ సూర్యకాంత్.. నూపుర్‌ను ఉద్దేశించి చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారని, తక్షణమే వాటిని వెనక్కి తీసుకోవాలంటూ ఫోరమ్ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్, జమ్ము అండ్ లడఖ్ అనే సంస్థ లెటర్‌ను రిలీజ్ చేసింది. నూపుర్‌పై తీవ్రవ్యాఖ్యలతో న్యాయమూర్తులు లక్ష్మణరేఖ దాటారు.. తక్షణ దిద్దుబాటు అవసరం అంటూ ఈ మేరకు లేఖను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు పంపింది. An open letter has been sent to CJI NV Ramana, signed by 15 retired judges, 77 retd bureaucrats & 25 retd armed forces officers, against the observation made by Justices Surya Kant & JB Pardiwala while hearing Nupur Sharma's case in the Supreme Court. pic.twitter.com/ul5c5PedWU — ANI (@ANI) July 5, 2022 చదవండి: న్యాయవాది అని నూపుర్ చెప్పుకోవడం సిగ్గుచేటు- నూపుర్ -
హైకోర్టును రాయలసీమలోనే ఏర్పాటు చేయాలి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు దిశగా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలను హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కోరారు. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం రాయలసీమలో హైకోర్టును నోటిఫై చేయాలని వారు రాష్ట్రపతిని అభ్యర్థించారు. ఈ మేరకు రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి, జస్టిస్ బి.శేషశయనారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లాం, జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి ప్రధాన మంత్రి, రాష్ట్రపతిలకు ఓ లేఖ రాశారు. హైకోర్టు రాజధానిలోనే ఉండాలన్న నిబంధన ఏదీ లేదని, దేశంలో 12 రాష్ట్రాల్లో హైకోర్టులు ఆ రాష్ట్ర రాజధానులకు వెలుపల ఉన్నాయని వారు తమ లేఖలో వివరించారు. అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారని, వాస్తవానికి హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిని చట్ట ప్రకారం రాష్ట్రపతి నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు, హైకోర్టులను సంప్రదించి వారి అభిప్రాయాలను తెలుసుకున్న తరువాత హైకోర్టు ఏర్పాటు విషయంలో రాష్ట్రపతి నిర్ణయం ఉంటుందన్నారు. చట్ట ప్రకారం హైకోర్టు ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ప్రత్యేకాధికారం లేదని వారు వివరించారు. ఈ నేపథ్యంలో అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని పునఃపరిశీలించి, పరిస్థితిని సుప్రీంకోర్టుకు వివరించి, రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటయ్యేలా చూడాలని వారు ప్రధాని, రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. 1953లో ఆంధ్రా రాష్ట్రం ఏర్పాటైనప్పుడు కర్నూలు రాజధాని అయిందని, గుంటూరులో హైకోర్టును ఏర్పాటైందని తెలిపారు. అయినా చంద్రబాబు ఈ వాస్తవాలను పట్టించుకోకుండా అమరావతిలోనే హైకోర్టు ఏర్పాటయ్యేలా సీఎం చంద్రబాబు వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నారని వారు రాష్ట్రపతి, ప్రధానికి వివరించారు. -
ప్రధాన న్యాయమూర్తికి బహిరంగ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు నలుగురు మాజీ న్యాయమూర్తులు బహిరంగ లేఖ రాశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలతో తాము ఏకీభవిస్తున్నామని ఈ లేఖలో వారు పేర్కొన్నారు. కేసుల కేటాయింపులో సుప్రీం జడ్జీల అభ్యంతరాలు సరైనవేనని, న్యాయవ్యవస్థలో సంక్షోభాన్ని జ్యుడిషియరీ పరిధిలోనే పరిష్కరించుకోవాలని లేఖలో సూచించారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి పీబీ సావంత్, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఏపీ షా, మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి కే చంద్రు, బొంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి హెచ్ సురేష్.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను మీడియాకు అందచేశారు. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాజీ న్యాయమూర్తులతో కలిసి భారత ప్రధాన న్యాయమూర్తికి బహిరంగ లేఖ రాశామని జస్టిస్ షా ధ్రువీకరించారు. లేఖలో తాము పేర్కొన్న అంశాలు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అభిప్రాయాలకు అనుగుణంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ సంక్షోభం సమసిపోయేంత వరకూ కీలక కేసులను సీనియర్ జడ్జీలతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని కోరామన్నారు. ఇక నలుగురు సీనియర్ న్యాయమూర్తులు సుప్రీంకోర్టు పనితీరు సవ్యంగా లేదంటూ ముందుకు తెచ్చిన అంశాలను ఈ లేఖలో ప్రస్తావించారు. ‘కేసుల కేటాయింపు ముఖ్యంగా సున్నితమైన కేసులను వివిధ సుప్రీం బెంచ్‌లకు కేటాయించడంలో సరైన ప్రామాణికాలు పాటించలేదనే అంశం తీవ్రమైంది.. పద్ధతి ప్రకారం ఆయా బెంచ్‌లకు కేసుల కేటాయింపు జరగడం లేదని, జూనియర్ న్యాయమూర్తులున్న బెంచ్లకూ కీలక కేసుల కేటాయింపు పట్ల నలుగురు న్యాయమూర్తులు ఆందోళన సమంజసమే. కేసుల కేటాయింపు సరిగ్గా లేకపోవడం న్యాయ నిర్వహణ, చట్ట నిబంధనలపై ప్రతికూల ప్రభావం చూపుతుంద’ని లేఖలో రిటైర్డ్ న్యాయమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బెంచ్‌ల మధ్య కేసుల కేటాయింపు, కేసుల పంపిణీ వంటి అంశాల్లో విస్పష్ట నియమ నిబంధలను రూపొందిచడం ద్వారా ఈ సమస్యను అధిగమించాల్సి ఉందని ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో వారు సూచించారు. ఇప్పటివరకూ ఏం జరిగినా.. ఇక నుంచీ అన్ని కీలక, సున్నితమైన కేసులను అయిదుగురు సీనియర్ జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనమే పర్యవేక్షించాలని పేర్కొంది. ఇలాంటి చర్యలు తీసుకుంటేనే సుప్రీం కోర్టు స్వేచ్ఛగా, సజావుగా పనిచేస్తోందని, కీలక కేసుల్లో ప్రధాన న్యాయమూర్తి తన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా వ్యవహరిస్తున్నారని ప్రజలకు భరోసా ఉండగలదని స్పష్టం చేసింది. ఈ దిశగా తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని నలుగురు రిటైర్డ్ జడ్జీలు సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. -
హైకోర్టులకు ‘రిటైర్డు జడ్జీలు’
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా రిటైర్డు జడ్జీల సేవలను హైకోర్టుల్లో వినియోగించుకునేందుకు కేంద్రం, న్యాయవ్యవస్థ అంగీకరించాయి. ఇందుకోసం రాజ్యాంగంలోని ఓ విశిష్ట నిబంధనను అమల్లోకి తీసుకురానున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 224 (ఏ) ప్రకారం.. కోర్టుల్లో పెద్ద సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నప్పుడు వీటిని త్వరిత గతిన పరిష్కరించేందుకు గతంలో హైకోర్టుల్లో జడ్జీలుగా పనిచేసి రిటైరైన వారిని తిరిగి జడ్జీలుగా నియమించుకునే అవకాశం ఉంది. ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గతంలో జడ్జీగా పనిచేసిన వారిని మళ్లీ బాధ్యతలు తీసుకొమ్మని కోరవచ్చు. ఈ అంశంపై ఏప్రిల్‌లో జరిగిన సీఎంల, హైకోర్టు చీఫ్ జస్టిస్‌ల భేటీలో చర్చ జరిగింది. దీనిపై సుప్రీంకోర్టు మినిట్స్ సిద్ధం చేసినప్పటికీ.. ఇందులో కొన్ని స్పష్టమైన నిర్ణయాలపై కేంద్ర న్యాయ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.కొత్తగా న్యాయశాఖ బాధ్యతలు స్వీకరించిన రవిశంకర్ ప్రసాద్ ఈ మినిట్స్‌ను కొద్ది రోజుల క్రితమే ఆమోదించి పంపించారు. జడ్జీల ఎంపికపై ఉమ్మడి నిర్ణయానికి వచ్చేందుకు శాసన, న్యాయవ్యవస్థల మధ్య చర్చలు జరుగుతున్న ఈ సమయంలో మినిట్స్‌కు ఆమోదం తెలపటంతో.. కొలీజియంపై ప్రతిష్టంభన తొలగే అవకాశముంది.