ఆర్డీపై పన్ను ఉంటుందా ? | deerendra kumar advices for finacial doughts | Sakshi
Sakshi News home page

ఆర్డీపై పన్ను ఉంటుందా ?

Published Mon, Nov 28 2016 1:42 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM

ఆర్డీపై పన్ను ఉంటుందా ?

ఆర్డీపై పన్ను ఉంటుందా ?

నాలుగేళ్ల నుంచి కొంత మొత్తాన్ని పోస్ట్  ఆఫీస్ రికరింగ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చే ఏడాది మార్చిలో మెచ్యూర్  అవుతుంది. వీటిపై నేను ఏమైనా పన్నులు చెల్లించాలా? - అవినాశ్, గుంటూరు

 పోస్ట్  ఆఫీస్ రికరింగ్  డిపాజిట్లపై మీరు ఆర్జించిన వడ్డీని ఇతర ఆదాయంగా పరిగణిస్తారు. మీకు ఏమైనా ఇతర ఆదాయం ఉంటే, ఈ వడ్డీ మొత్తాన్ని ఆ ఇతర ఆదాయానికి  కలుపుతారు. దీనికి మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10వేల వడ్డీ ఆదాయం వరకూ ఎలాంటి టీడీఎస్(మూలం వద్ద పన్నుకోత) ఉండదు. ఒకవేళ ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ఆదాయం ఈ పరిమితిని(రూ.10,000) మించితే, మీ వడ్డీ ఆదాయంలో పది శాతం టీడీఎస్ ఉంటుంది.

గత పదేళ్లుగా మ్యూచువల్ ఫండ్‌‌సలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ రెగ్యులర్  ప్లాన్‌లే.  నేను ఇన్వెస్ట్ చేసే దాంట్లోంచి డిస్ట్రిబ్యూటర్‌కు ఒక శాతం కమీషన్ లభిస్తోందని నాకు ఇటీవలే తెలిసింది. నా ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నింటిని  రెగ్యులర్  ప్లాన్‌నుంచి డెరైక్ట్ ప్లాన్‌లకు బదిలీ చేస్తే నాకేమైనా  ప్రయోజనం ఉంటుందా?      - భవానీ, హైదరాబాద్

డెరైక్ట్ ప్లాన్‌ల కంటే రెగ్యులర్ ప్లాన్‌ల్లో వార్షిక వ్యయాలు అధికంగా ఉంటారుు. డిస్ట్రిబ్యూటర్ కమిషన్ తదితర వ్యయాలు రెగ్యులర్ ప్లాన్‌ల్లో ఉంటారుు. ఈక్విటీ ఫండ్‌‌సలో డెరైక్ట్, రెగ్యులర్ ప్లాన్‌ల వ్యయాల్లో తేడా 1 శాతం వరకూ ఉంటుంది. శాతం పరంగా చూస్తే ఇది స్వల్పమైనప్పటికీ,  దీర్ఘకాలంగా చూస్తే గణనీయమైనదేనని చెప్పవచ్చు. అరుుతే డెరైక్ట్ ప్లాన్‌ల్లో డిస్ట్రిబ్యూటర్ ఉండరు కాబట్టి, మీకు పనిభారం అధికంగా ఉంటుంది.మీ పెట్టుబడుల నిర్వహణ, పేపర్ వర్క్ చూడడం, మ్యూచువల్ ఫండ్ సంస్థతో మీరే సొంతంగా డీల్ చేయాల్సి రావడం వంటి పనులన్నింటిని చక్కబెట్టుకోవలసి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్‌‌స పట్ల తగిన అవగాహన ఉండి, ఈ పనులన్నింటినీ చూసుకోగలిగితే మీరు రెగ్యులర్  ప్లాన్ నుంచి డెరైక్ట్ ప్లాన్‌లకు మారిపోవచ్చు. డెరైక్ట్ ప్లాన్‌ల్లో వ్యయాలు తక్కువగా ఉంటారుు. కాబట్టి  ఆ మేరకు మీకు దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలే లభిస్తారుు. సూపర్ టాప్-అప్ పాలసీలు తీసుకోవడం మంచిదేనా? ఈ సూపర్ టాప్-అప్ పాలసీలు ఆన్‌లైన్‌లో లభ్యమవుతాయా? -రవీందర్, విజయవాడ

మీ వైద్య బీమా కవరేజ్‌ను పెంచుకోవడానికి సూపర్  టాప్-అప్ పాలసీ మంచి అవకాశం. ప్రీమియంలో కొంచెం పెరుగుదలతోనే మరింత బీమా కవరేజ్ పొందవచ్చు.సూపర్ టాప్-అప్ పాలసీలను ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు. యునెటైట్ ఇండియా సూపర్ టాప్ అప్ పాలసీ, రెలిగేర్ ఎన్‌హాన్‌‌స సూపర్ టాప్ అప్, అపోలో మ్యూనిక్ ఆప్టిమా... వీటిని పరిశీలించవచ్చు.  పాలసీ కొనుగోలు చేసే ముందు పాలసీ డాక్యుమెంట్‌ను, బ్రోచర్‌ను క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉంటుంది. వెరుుటింగ్ పిరియడ్, మినహారుుంపులను పరిశీలించడం మరచిపోవద్దు.

నాకు ఒక్కతే కూతురు. తనకు మంచి చదువు. చెప్పించాలనేది నా కోరిక, నేను నెలకు రూ.8,000 వరకూ పొదుపు చేయగలను.దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్  ఫండ్‌‌సలో మంచి రాబడులు పొందవచ్చని మిత్రులంటున్నారు. తగిన సలహా ఇవ్వండి.     - రుక్మిణి, హైదరాబాద్

మ్యూచువల్ ఫండ్‌‌సలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. పిల్లల ఉన్నత చదువు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం, రిటైర్మెంట్ నిధి ఏర్పాటు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యం సాకారం కోసం మ్యూచువల్  ఫండ్‌‌సలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈక్విటీ ఫండ్‌‌స అరుుతే ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులనిస్తారుు. దీర్ఘకాలం అంటే కనీసం ఐదేళ్లకు మించి ఇన్వెస్ట్ చేస్తేనే ఈక్విటీ మ్యూచువల్  ఫండ్‌‌స నుంచి మంచి రాబడులు వస్తారుు. వీటికి మూడేళ్ల పాటు లాకిన్  పీరియడ్ ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్  ఫండ్‌‌సలో ఇన్వెస్ట్ చేడయం ద్వారా పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఏదైని మంచి ఒకటి, లేదా రెండు మంచి మ్యూచువల్ ఫండ్‌‌సను ఎంచుకోండి. వీటిల్లో క్రమం తప్పకుండా నెలకు కొంత మొత్తం సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. ఇలా చేస్తే మీ కూతురికి మంచి చదువు చెప్పించాలనే మీ ఆర్థిక లక్ష్యం సాకారమవుతుంది.

నేను మ్యూచువల్ ఫండ్‌‌సలో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నేను మ్యూచువల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కొత్త. మ్యూచువల్ ఫండ్‌‌స రెగ్యులర్, ప్లాన్‌ల కటే కూడా  డెరైక్ట్ ప్లాన్‌ల్లో వ్యయాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు? ఎందుకలా?     - రామారావు, నెల్లూరు

మ్యూచువల్  ఫండ్‌‌సకు సంబంధించి డెరైక్ట్, రెగ్యులర్ ప్లాన్‌లు దాదాపు ఒకేలాగా ఉంటారుు. వ్యయాల విషయంలో తేడాలుంటారుు. డెరైక్ట్ ప్లాన్‌ల్లో వ్యయాలు తక్కువగా ఉంటారుు. రెగ్యులర్ ప్లాన్‌ల్లో అరుుతే డిస్ట్రిబ్యూటర్లకు కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ కమిషన్ కారణంగా రెగ్యులర్  ప్లాన్‌ల్లో వార్షిక వ్యయాలు అధికంగా ఉంటారుు. ఇక డెరైక్ట్ ప్లాన్‌ల్లో ఇలాంటి వ్యయాలు ఉండవు. మీరు నేరుగా మ్యూచువల్ ఫండ్ కంపెనీ ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. బ్రోకర్లు, ఏజెంట్ల అవసరం ఉండదు.

ఈ కమిషన్ ఉండకపోవడం వల్ల ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌‌సకు సంబంధించి ఈ వ్యయాల తేడా ఒక శాతంగా ఉంటుంది. డెరైక్ట్ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం కొంచెం శ్రమతో కూడుకున్న పని. మీకు మ్యూచువల్  ఫండ్‌‌సలో ఇన్వెస్ట్ చేయడం కొత్త కాబట్టి డిస్ట్రిబ్యూటర్ల/ఏజెంట్ల సలహా, సహాయం తీసుకోవడం తప్పుకాదు. అందుకని ముందుగా రెగ్యులర్ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్  చేయండి. మ్యూచువల్ ఫండ్‌‌స  గురించి కొంత అవగాహన వచ్చిన తర్వాత, మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మీరు సొంతంగా నిర్వహించుకోలగమన్న విశ్వాసం కలిగిన తర్వాత అప్పుడు డెరైక్ట్ ప్లాన్‌లకు మారిపోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement