ఇక పోస్టాఫీసుల్లో ‘ఆధార్‌’ | 'Aadhaar' in Post Offices | Sakshi
Sakshi News home page

ఇక పోస్టాఫీసుల్లో ‘ఆధార్‌’

Published Mon, Apr 24 2017 1:00 AM | Last Updated on Fri, May 25 2018 6:12 PM

ఇక పోస్టాఫీసుల్లో ‘ఆధార్‌’ - Sakshi

ఇక పోస్టాఫీసుల్లో ‘ఆధార్‌’

సాక్షి, హైదరాబాద్‌: ఆధార్‌కార్డు... అన్ని సేవలకు ఇప్పుడు ఇదే ఆధారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుసహా ప్రైవేటు సంస్థలు కూడా తమ సేవలను దానితో అనుసంధానిస్తున్నాయి. ఆధార్‌కార్డులో అచ్చుతప్పులు దొర్లుతున్నాయి. ఈ–సేవ, మీ సేవ కేంద్రాల్లో ఆధార్‌కార్డులిస్తున్నా సర్వర్‌ సమస్యలతో సేవలకు ఆటంకం ఏర్పడుతోంది.  దేశవ్యాప్తంగా ఆధార్‌ సమస్యలపై ఫిర్యాదులు వస్తుండటంతో వాటిని తపాలా కార్యాలయాల్లో అందుబాటులోకి తేవాలని భారత తపాలా శాఖ కార్యదర్శి సుధాకర్‌ ఇటీవల కేంద్రానికి ప్రతిపాదించారు. పోస్టాఫీసులకు సంబంధం లేని పలు సేవలను అందిస్తుండడంతో వాటికి క్రమంగా ఆదరణ పెరుగుతోంది.

ఇది తీవ్ర నష్టాల్లో ఉన్న పోస్టాఫీసులకు ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో ఇటీవలే యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యూడీఐఏ)తో తపాలా అధికారులు సంప్రదింపులు జరిపారు. ఆధార్‌ యంత్రాలను సమకూర్చి మే నెలలో ఆ ప్రక్రియ ప్రారంభిస్తామని హామీ ఇచ్చి యంత్రాల సరఫరాకు టెండర్లు కూడా పిలిచారు. రెండు, మూడు నెలల్లో ఆ ప్రక్రియ పూర్తి చేసి ఆధార్‌ కార్డుల జారీ ప్రారంభించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement