
అవనిగడ్డ: సీఎం వైఎస్ జగన్‌కి రూ.10తో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసే అవకాశం పోస్టల్ శాఖ కల్పిస్తోంది. ఈ నెల 21న సీఎం జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయాలనుకునే వారు పోస్టాఫీస్‌లో రూ.10 చెల్లిస్తే వారి అడ్రస్‌తో సందేశం చేరుతుంది. రాష్ట్రంలోని అన్ని పోస్టాఫీస్‌ల నుంచి వచ్చే సందేశాలను మంగళగిరి ప్రధాన పోస్టాఫీస్ ద్వారా ముఖ్యమంత్రికి చేరవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 20 లోపు ప్రధాన పోస్టాఫీస్‌కు వచ్చి రూ.10 చెల్లించి సీఎంకు జన్మదిన శుభాకాంక్షల సందేశం పంపవచ్చని కృష్ణా జిల్లా అవనిగడ్డ పోస్టుమాస్టర్ సింహాద్రి రామలింగేశ్వరరావు తెలిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు స్థానిక హెడ్‌పోస్టాఫీస్ ద్వారా సీఎంకు శుక్రవారం జన్మదిన శుభాకాంక్షల సందేశం పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment