రాష్ట్రంలో 5 పోస్టాఫీస్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు | Post offices to become passport seva kendras in Telanagana | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో 5 పోస్టాఫీస్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు

Published Sun, Jun 18 2017 1:39 AM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM

రాష్ట్రంలో 5 పోస్టాఫీస్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు

రాష్ట్రంలో 5 పోస్టాఫీస్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఐదు పోస్టాఫీస్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ప్రారంభించాలని విదేశాంగ శాఖ నిర్ణయించింది. ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, సిద్దిపేట, నల్లగొండలలో ఈ కేంద్రాలను ప్రారంభించనుంది. దేశంలోని హెడ్‌ పోస్టాఫీసుల్లో పాస్‌పోర్టు సంబంధిత సేవలను అందించడానికి అనువుగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్‌ భాగస్వామ్యంతో 149 కొత్త కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించింది. తాజాగా ప్రారంభించే వాటితో కలిపి దేశవ్యాప్తంగా ఆ సంఖ్య 235కు చేరుతుంది. ఇక ఏపీలో అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళంలలో ఈ కేంద్రాలను ప్రారంభించాలని విదేశాంగ శాఖ నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement