
వీడని కరెన్సీ కష్టాలు
మనీ ట్రబుల్స్..
బ్యాంకులు, పోస్టాఫీసులకు పోటెత్తిన జనం
పనిచేయని ఏటీఎంలు
స్తంభించిన వ్యాపారాలు
నిత్యావసరాలూ కొనలేక అల్లాడిన సామాన్యులు
సిటీబ్యూరో: మూడో రోజూ అదే సీన్... బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద యథావిధిగా జనం బారులు....పనిచేయని ఏటీఎంలు..అక్కడక్కడా అరకొరగా పనిచేసినా..అందరికీ అందని డబ్బులు. బ్యాంకుల్లో నోట్ల జారీ పరిమితి 4 వేలకు కుదించడం..బహిరంగ మార్కెట్‌లో చెల్లని రూ.500, .వెరుు్య నోట్లతో షరా మామూలుగా గ్రేటర్ సిటీజనులు శుక్రవారం నానా పాట్లుపడ్డారు. పలు మెడికల్ షాపులు, ఆస్పత్రుల్లోనూ పాత నోట్ల స్వీకరణకు ససేమిరా అనడంతో రోగులు ససేమిరా అనడంతో రోగులు విలవిల్లాడారు. పెట్రోలు బంకుల వద్ద కూడా భారీ క్యూలైన్లలో నిల్చుని వాహనదారులకు సొమ్మసిల్లినంత పనైంది. పాలు, కూరగాయలు, బియ్యం, పండ్లు తదితర నిత్యావసరాల కొనుగోలుకు సరిపడినంత చిల్లర లేక నిరుపేదలు, అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు, గృహిణులు విలవిల్లాడారు.
గంటల తరబడి క్యూలైన్‌లో నిల్చుని సాధించిన నగదులోనూ రూ.2 వేల నోటు రావడంతో ఈ నోటును మార్పించడానికి నానా ఇక్కట్లు తప్పలేదు. ఎవరి వద్దకు వెళ్లినా చిల్లర లేదంటూ చీత్కరించడంతో జనం పాట్లు వర్ణనాతీతంగా మారారుు. చిల్లర కష్టాలతో బార్లు, మద్యం దుకాణాలు కూడా కళ తప్పారుు. రూ.500 నోట్లు ఎలా ఉందో చూద్దామంటే దొరకని దుస్థితి. పరిస్థితి ఇలా ఉంటే...జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్ విభాగాలకు మాత్రం కాసుల వర్షం కురిసింది. పాత నోట్ల స్వీకరణకు అనుమతించడంతో ఒకే రోజు ఆయా విభాగాలకు రూ.కోట్లు ఆదాయం లభించడం విశేషం. ఇక శనివారం నుంచి పలు బహిరంగ మార్కెట్లలో పాత నోట్ల స్వీకరణ నిలిచిపోనుండడంతో కొత్తచిక్కులు తప్పేలా లేవని జనం నిట్టూరుస్తున్నారు. బ్యాంకుల్లో నగదు మార్పిడి, నగదు ఉపసంహరణ పరిమితిని పెంచాలని, ఏటీఎంలోనూ పరిమితి పెంచాలని వినియోగదారులు కోరుతున్నారు.
వినియోగదారుల అవస్థలు తీర్చేందుకు ప్రతి బ్యాంకులో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సందట్లో సడేమియాగా నల్లకుబేరుల ఇళ్లలో పోగుపడిన డబ్బును పలువురు బంగారం వ్యాపారులు భారీగా సొమ్ము చేసుకున్నారు. పాత నోట్లను స్వీకరించి తులం బంగారం రూ.50 వేలకు కట్టబెట్టినట్లు సమాచారం. శుక్రవారం ఒకే రోజు నగరంలో రూ.500 కోట్ల విలువైన బంగారం అమ్ముడరుునట్లు అంచనా. ఇక నల్ల కుబేరులు తమ వద్ద ఉన్న నగదును వైట్‌మనీగా మార్చేందుకు పలువురికి కమీషన్ల ఆశ చూపడం గమనార్హం.