కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తులకు తపాలా శాఖ పవిత్ర కృష్ణానది జలం అందించేందుకు రంగం సిద్ధం చేసినట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కేవీ సుబ్బారావు తెలిపారు.
- పోస్టల్ సూపరింటెండెంట్ కేవీ సుబ్బారావు వెల్లడి
కర్నూలు (ఓల్డ్ సిటీ): కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తులకు తపాలా శాఖ పవిత్ర కృష్ణానది జలం అందించేందుకు రంగం సిద్ధం చేసినట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కేవీ సుబ్బారావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఒక్కో బాటిల్ ఖరీదు రూ. 30 ఉంటుందని, కావాల్సిన వారు ముందుగానే బుక్ చేసుకుని రశీదు పొందాలని సూచించారు. డివిజన్ పరిధిలోని అన్ని పోస్టాఫీసుల్లో ఈ సదుపాయం కల్పించామని, ఆగస్టు 5వ తేదీ లోపు రశీదులు పొందాలని తెలిపారు.