డబ్బు పొదుపు చేసుకోవాలనుకుంటున్నవారికి, ముఖ్యంగా దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేసే వారికి పోస్ట్ ఆఫీస్‌లో అనేక పథకాలు ఉన్నాయి. ఇవి సొమ్ముకు భద్రతతోపాటు మంచి రాబడిని అందిస్తాయి. వీటిలో ప్రధానమైన పథకాలలో ఒకటి పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్. ఇది 5 సంవత్సరాల కాలానికి పెట్టుబడిపై 7.5 శాతం వడ్డీని అందిస్తుంది.
పోస్ట్ ఆఫీస్‌ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఈ పొదుపు పథకం ప్రయోజనాలను ఎవరైనా పొందవచ్చు. ప్రత్యేక విషయం ఏమిటంటే ఇందులో వచ్చే రాబడిపై ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును కూడా పొందుతారు. ఈ పథకాన్ని పోస్ట్ ఆఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్ అని కూడా అంటారు. ఇక్కడ వడ్డీ ఎప్పటికప్పుడు జమ అవుతూ ఉంటుంది.
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ప్రయోజనాలు
ఇందులో కనిష్ట పెట్టుబడి రూ.1000. దీనిపైనా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు.
ఒక సంవత్సరానికి 6.9%, రెండేళ్లకు 7.0%, 3 సంవత్సరాలకు 7.1%, ఐదేళ్లకు 7.5% వడ్డీ రేటు ఉంటుంది.
ఈ పథకం కింద వ్యక్తిగతంగా ఒక్కరు లేదా ఇద్దరు నుంచి ముగ్గురు వ్యక్తులు కలిసి జాయింట్ అకౌంట్ అయినా తెరవవచ్చు.
5 సంవత్సరాల వ్యవధిలో సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం.
ఈ పథకం ఎందుకు ఆకర్షణీయం?
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ అనేది వారి పెట్టుబడిపై హామీతో కూడిన రాబడిని కోరుకునే వారికి సురక్షితమైన, లాభదాయకమైన ఎంపిక. అధిక వడ్డీ రేటు, పన్ను మినహాయింపు ప్రయోజనాలు దీనిని ఆకర్షణీయమైన ఎంపికగా చేస్తాయి. ఈ పథకం ద్వారా మీరు మీ సొమ్ముకు భద్రతతోపాటు ఐదేళ్లలో మంచి వడ్డీని కూడా పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment