Time Deposit
-
ఈ సూపర్‌హిట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ గురించి తెలుసా?
డబ్బు పొదుపు చేసుకోవాలనుకుంటున్నవారికి, ముఖ్యంగా దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేసే వారికి పోస్ట్ ఆఫీస్‌లో అనేక పథకాలు ఉన్నాయి. ఇవి సొమ్ముకు భద్రతతోపాటు మంచి రాబడిని అందిస్తాయి. వీటిలో ప్రధానమైన పథకాలలో ఒకటి పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్. ఇది 5 సంవత్సరాల కాలానికి పెట్టుబడిపై 7.5 శాతం వడ్డీని అందిస్తుంది.పోస్ట్ ఆఫీస్‌ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఈ పొదుపు పథకం ప్రయోజనాలను ఎవరైనా పొందవచ్చు. ప్రత్యేక విషయం ఏమిటంటే ఇందులో వచ్చే రాబడిపై ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును కూడా పొందుతారు. ఈ పథకాన్ని పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ అని కూడా అంటారు. ఇక్కడ వడ్డీ ఎప్పటికప్పుడు జమ అవుతూ ఉంటుంది.పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ప్రయోజనాలుఇందులో కనిష్ట పెట్టుబడి రూ.1000. దీనిపైనా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు.ఒక సంవత్సరానికి 6.9%, రెండేళ్లకు 7.0%, 3 సంవత్సరాలకు 7.1%, ఐదేళ్లకు 7.5% వడ్డీ రేటు ఉంటుంది.ఈ పథకం కింద వ్యక్తిగతంగా ఒక్కరు లేదా ఇద్దరు నుంచి ముగ్గురు వ్యక్తులు కలిసి జాయింట్ అకౌంట్ అయినా తెరవవచ్చు.5 సంవత్సరాల వ్యవధిలో సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం.ఈ పథకం ఎందుకు ఆకర్షణీయం?పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ అనేది వారి పెట్టుబడిపై హామీతో కూడిన రాబడిని కోరుకునే వారికి సురక్షితమైన, లాభదాయకమైన ఎంపిక. అధిక వడ్డీ రేటు, పన్ను మినహాయింపు ప్రయోజనాలు దీనిని ఆకర్షణీయమైన ఎంపికగా చేస్తాయి. ఈ పథకం ద్వారా మీరు మీ సొమ్ముకు భద్రతతోపాటు ఐదేళ్లలో మంచి వడ్డీని కూడా పొందవచ్చు. -
పోస్టల్ ఖాతాదారులకు అలర్ట్.. ఆ పథకాలను ఖాతాతో లింకు చేశారా?
చిన్న మొత్తాల్లో పొదుపు చేసే వారికి పోస్ట్ ఆఫీస్ తీసుకొచ్చే పొదుపు పథకాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా మంత్లీ ఇన్కమ్ స్కీమ్, ఎస్సిఎస్ఎస్, టైమ్ డిపాజిట్ వంటి పొదుపు ఖాతాలలో చాలా మంది పొదుపు చేశారు. ఈ పథకాల ద్వారా చాలా మందికి నెలవారీ, త్రైమాసిక, వార్షికానికి ఒకసారి వడ్డీ లభిస్తుంది. అయితే, వడ్డీని నగదు రూపంలో విత్ డ్రా చేసుకుంటున్నారని గుర్తించిన పోస్టల్ శాఖ ఇటీవల ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం.. 01.04.2022 నుంచి అలా నగదు రూపంలో పొదుపు పథకాల వడ్డీని నగదు రూపంలో విత్ డ్రా చేయలేరు అని పేర్కొంది. పోస్టల్ డిపార్ట్ మెంట్ జారీచేసిన తాజా సర్క్యులర్ ప్రకారం.." ఎమ్ఐఎస్/ఎస్సిఎస్ఎస్/టీడీ ఖాతాల ద్వారా లభించే వడ్డీని 01.04.2022 నుంచి అకౌంట్ హోల్డర్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లేదా బ్యాంక్ ఖాతాలో మాత్రమే క్రెడిట్ చేయనున్నారు. ఒకవేళ ఖాతాదారుడు తన పొదువు ఖాతాను ఎమ్ఐఎస్/ఎస్సిఎస్ఎస్/టీడీ ఖాతాలతో 31.03.2022 వరకు లింక్ చేయకపోతే ఎమ్ఐఎస్/ఎస్సిఎస్ఎస్/టీడీ సండ్రీ ఆఫీసు ఖాతాల్లో వడ్డీ క్రెడిట్ చేయనున్నట్లు తెలిపింది. అలా బకాయి వడ్డీని పోస్ట్ఆఫీస్ సేవింగ్స్ ఖాతా లేదా చెక్ ద్వారా మాత్రమే చెల్లించనున్నారు. 01.04.2022 నుంచి ఎమ్ఐఎస్/ఎస్సిఎస్ఎస్/టీడీ సండ్రీ ఆఫీసు అకౌంట్ నుంచి వడ్డీని క్యాష్ రూపంలో చెల్లించరు" అని తెలిపింది. సేవింగ్స్ ఖాతాకు లింక్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు: ఎమ్ఐఎస్/ఎస్సిఎస్ఎస్/టీడీ నుంచి లభించే వడ్డీ పొదుపు ఖాతాలో జమ అయినట్లు అయితే, మీకు అదనంగా వడ్డీ లభిస్తుంది. డిపాజిటర్లు పోస్టాఫీసును సందర్శించాల్సిన పని లేకుండా ఆన్లైన్ ద్వారా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఎమ్ఐఎస్/ఎస్సిఎస్ఎస్/టీడీ వడ్డీ కోసం ప్రతిసారీ విత్ డ్రా ఫారాలను నింపాల్సిన అవసరం లేదు. డిపాజిటర్లు ఎమ్ఐఎస్/ఎస్సిఎస్ఎస్/టీడీ ఖాతాల లభించే వడ్డీని పివో సేవింగ్స్ అకౌంట్ నుంచి రికరింగ్ డిపాజీట్ ఖాతాలకు ఆటోమేటిక్ క్రెడిట్ అయ్యే సౌకర్యాన్ని పొందవచ్చు. (చదవండి: యాపిల్ తిక్క కుదిరింది.. ఐఫోన్‌కు దీటుగా రష్యా కొత్త ఫోన్..!) -
నేటి నుంచి ఆర్డీలపైనా టీడీఎస్
సేవా పన్ను పెరుగుతోంది పలు కొత్త సేవలు సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి రావటంతో పాటు సోమవారం నుంచి సేవా పన్ను 14 శాతానికి చేరుతోంది. ప్రస్తుతం 12 శాతంగా ఉన్న ఈ పన్నును సోమవాంర నుంచి 14 శాతానికి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్లోనే ప్రకటించారు. జూన్ 1 నుంచి రికరింగ్ డిపాజిట్ల(ఆర్డీ)పైనా ‘మూలం వద్ద పన్ను’ (టీడీఎస్) భారం పడనుంది. ఇప్పటి వరకూ ‘టైమ్ డిపాజిట్’లు మినహా ‘రికరింగ్ డిపాజిట్ల’పై టీడీఎస్ లేదు. అయితే ఇకపై రికరింగ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీపై సైతం టీడీఎస్ పడనుంది. వడ్డీ రూ.10,000 దాటి తే టీడీఎస్ అమలవుతుంది. ఇంతేకాదు ఇప్పటివరకూ నిర్దిష్ట బ్యాంక్ బ్రాంచీలో డిపాజిట్‌పై వడ్డీ రూ.10,000 దాటితేనే టీడీఎస్ భారం పడేది. జూన్ 1 నుంచి బ్రాంచ్‌తో సంబంధం లేకుండా ఒక బ్యాంక్‌లో (బ్రాంచీలనూ గమనంలోకి తీసుకుని) డిపాజిట్లన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. వాటిపై వచ్చే వడ్డీ వార్షికంగా రూ.10,000 దాటితే టీడీఎస్ పడుతుంది. మీరేం చేయాలి? ఆదాయపు పన్ను పడకుండా కొన్ని పరిమితులు ఉన్నాయి. 60 సంవత్సరాల లోపు కనీస ఆదాయ పరిమితి రూ.2.5 లక్షలు. 80 సంవత్సరాల వయస్సులోపు ఈ పరిమితి రూ.3 లక్షలు. రూ.80 సంవత్సరాల పైబడిన వారి విషయంలో ఈ పరిమితి రూ.5 లక్షలుగా ఉంది. ఈ మొత్తంకన్నా తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు బ్యాంకుల్లో 15జీ/15హెచ్ ఫారమ్‌లను దాఖలు చేసి తమ ఎఫ్డీ, ఆర్డీలపై టీడీఎస్ భారం నుంచి బైటపడవచ్చు. ఆదాయపు పన్ను పరిమితికన్నా తమ ఆదాయం తక్కువ ఉందని ధ్రువీకరిస్తూ... వ్యక్తులు దాఖలు చేయాల్సిన ఫామ్స్ ఇవి. 60 సంవత్సరాల లోపు వయస్సు వారికి ఫామ్ 15జీ వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 15హెచ్ వర్తిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇతర ఎటువంటి ఆదాయం లేకుండా... డిపాజిట్లపై వచ్చే వడ్డీపైనే బతికే వారికి ఈ ఫామ్‌ల దాఖలు మంచి ఫలితాలను అందిస్తాయి. పీఎఫ్ విత్డ్రాయల్స్పై కూడా.. కొన్ని పరిమితులకు లోబడి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) విత్‌డ్రాయల్స్ విషయంలో కూడా జూన్ 1 నుంచీ టీడీఎస్ భారం పడనుంది. ఐదు సంవత్సరాల లోపు (ఉద్యోగికి) సర్వీస్ ఉన్న ఉద్యోగి విత్డ్రాయల్స్పై టీడీఎస్ పడుతుంది. ఈ సందర్భంలో రూ.30,000 పైబడిన విత్డ్రాయల్స్పై టీడీఎస్ అమలవుతుంది. పాన్ నంబర్ సమర్పిస్తే టీడీఎస్ 10 శాతంగా ఉంటుంది. 15జీ, 15 హెచ్ ఫారమ్‌లు సమర్పిస్తే- టీడీఎస్ సమస్య ఉండదు. ఈ మూడూ సమర్పించకపోతే... టీడీఎస్ 33 శాతం వరకూ ఉంటుంది. ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కు బదలాయింపులపై మాత్రం టీడీఎస్ పడదు. అనారోగ్యం కారణాల వల్ల ఉద్యోగిని తొలగించినా టీడీఎస్ కట్కాదు. ఉద్యో గి సర్వీస్ ఐదేళ్లకు పైగా కొనసాగుతూ చేసే పీఎఫ్ విత్డ్రాయల్స్పై సైతం టీడీఎస్ ఉండదు.