Super Hits
-
ఈ సూపర్‌హిట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ గురించి తెలుసా?
డబ్బు పొదుపు చేసుకోవాలనుకుంటున్నవారికి, ముఖ్యంగా దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేసే వారికి పోస్ట్ ఆఫీస్‌లో అనేక పథకాలు ఉన్నాయి. ఇవి సొమ్ముకు భద్రతతోపాటు మంచి రాబడిని అందిస్తాయి. వీటిలో ప్రధానమైన పథకాలలో ఒకటి పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్. ఇది 5 సంవత్సరాల కాలానికి పెట్టుబడిపై 7.5 శాతం వడ్డీని అందిస్తుంది.పోస్ట్ ఆఫీస్‌ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఈ పొదుపు పథకం ప్రయోజనాలను ఎవరైనా పొందవచ్చు. ప్రత్యేక విషయం ఏమిటంటే ఇందులో వచ్చే రాబడిపై ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును కూడా పొందుతారు. ఈ పథకాన్ని పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ అని కూడా అంటారు. ఇక్కడ వడ్డీ ఎప్పటికప్పుడు జమ అవుతూ ఉంటుంది.పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ప్రయోజనాలుఇందులో కనిష్ట పెట్టుబడి రూ.1000. దీనిపైనా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు.ఒక సంవత్సరానికి 6.9%, రెండేళ్లకు 7.0%, 3 సంవత్సరాలకు 7.1%, ఐదేళ్లకు 7.5% వడ్డీ రేటు ఉంటుంది.ఈ పథకం కింద వ్యక్తిగతంగా ఒక్కరు లేదా ఇద్దరు నుంచి ముగ్గురు వ్యక్తులు కలిసి జాయింట్ అకౌంట్ అయినా తెరవవచ్చు.5 సంవత్సరాల వ్యవధిలో సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం.ఈ పథకం ఎందుకు ఆకర్షణీయం?పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ అనేది వారి పెట్టుబడిపై హామీతో కూడిన రాబడిని కోరుకునే వారికి సురక్షితమైన, లాభదాయకమైన ఎంపిక. అధిక వడ్డీ రేటు, పన్ను మినహాయింపు ప్రయోజనాలు దీనిని ఆకర్షణీయమైన ఎంపికగా చేస్తాయి. ఈ పథకం ద్వారా మీరు మీ సొమ్ముకు భద్రతతోపాటు ఐదేళ్లలో మంచి వడ్డీని కూడా పొందవచ్చు. -
హీరో లేకుండానే బ్లాక్ బ్లస్టర్: ఏకంగా 800 శాతం లాభాలు
ఏదైనా సినిమా విజయవంతం కావాలంటే దర్శక నిర్మాతలతో పాట ఎలా ఉన్నా హీరోదే కీలక పాత్ర అనేది చాలాకాలంగాకొనసాగుతున్న ట్రెండ్. ఈ ట్రెండ్‌కు భిన్నంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు బ్లాక్ బ్లస్టర్ హిట్స్ అవుతున్న సినిమాలకు కొదవలేదు. అయితే హీరో లేకుండానే కలెక్షన్ల సునామీ సృష్టించిన సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ వివరాలు మీ కోసం.. 2010ల మధ్యకాలంలో తమిళం , తెలుగు చలనచిత్ర పరిశ్రమలలో మహిళా ప్రధాన చిత్రాలు బాగా పెరిగాయని చెప్పొచ్చు. అనుష్క శెట్టి, నయనతార లాంటి హీరోయిన్లు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ నమోదు చేశారు. వీటిల్లోచాలావరకు హిందీతోపాటు, ఇతర భాషలలో కూడా రీమేక్ అయ్యాయి. అదే 2018 తమిళ సూపర్ హిట్ మూవీ ‘కొలమావు కోకిల’. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి, తొమ్మిది రెట్లకుపైగా లాభాలను సంపాదించింది. నయనతార టైటిల్ రోల్లో నటించిన ‘కొలమావు కోకిల’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించగా యోగి బాబు, శరణ్య, శరవణన్, రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదే తెలుగులో కోకోకోకిల పేరుతో రీమేక్ అయింది. కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారానే, ఈ చిత్రం విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా విజయం సాధించింది. రూ. 8 కోట్ల బిడ్జెట్తో నిర్మితమై, ప్రపంచవ్యాప్తంగా 73 కోట్ల రూపాయలను వసూలు చేసింది. 800 శాతం లాభపడిన చిత్రంగా రికార్డు దక్కించుకుంది. 2022లో, కొలమావు కోకిల సినిమాను హిందీలో నూతన దర్శకుడు సిద్ధార్థ్ సేన్ రీమేక్ చేశారు. పంజాబ్ నేపథ్యంలో తెరకెక్కిన గుడ్‌లక్ జెర్రీ చిత్రంలో జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో దీపక్ డోబ్రియాల్, మితా వశిష్ట్, నీరజ్ సూద్, సౌరభ్ సచ్‌దేవా తదితరులు నటించారు. ఈ చిత్రం థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో రిలీజ్ అయింది. విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. కథ ఏంటంటే.. కోకిల (నయనతార) మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. తన తల్లి (శరణ్య)కు కాన్సర్ రావడంతో ఆపరేషన్ కు 15 లక్షలు కావాలి. మసాజ్ పార్లర్ లో ఉద్యోగం ద్వారా వచ్చే సొమ్ము సరిపోక ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కోకిల, డ్రగ్స్ సరఫరా చేసే ఓ గ్యాంగ్ లో ట్రాన్స్ పోర్టర్ గా చేరుతుంది. ఈ క్రమంలో ఆమె అనుకోని కష్టాల్లో పడుతుంది. ఈ కష్టాల్లోంచి ఆమె బయట పడడానికి ఆమె ఎదుర్కొన్న సమస్యలేమిటి ? చివరికి తన తల్లిని కాపాడుకుందా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ. ఎప్పటిలాగానే కోకిల పాత్రలో నయనతార పెర్పార్మెన్స్ అదరిపోతుంది.భారీ ఫైట్స్, హోరెత్తించే బీజీఎంలు, ఎలివేషన్స్ ఉండవు కానీ తన అమాయకత్వంతోనే విలన్లకు చెక్ చెప్పడం ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో నయన్‌ను ప్రేమించే వ్యక్తిగా కమెడియన్ యోగిబాబు వినోదం బాగా పండించాడు. వీరిద్దరిపై చిత్రించిన పాట యూట్యూబ్‌లో ట్రైండ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే. -
Independence Day 2023: మేరా భారత్ మహాన్
దేశం అనగానే భారతీయ ప్రేక్షకులు వెంటనే కనెక్ట్ అయిపోతారు. సరైన దేశభక్తి సినిమా వస్తే సూపర్ డూపర్ హిట్ చేసి భావోద్వేగంతో ఊగిపోతారు. బాలీవుడ్లో మంచి మంచి దేశభక్తి సినిమాలు వచ్చాయి. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన 10 దేశభక్తి సినిమాలు.. హకీకత్ (1964): దేశాల మధ్య యుద్ధాలు వస్తే సైనికుల వీరోచిత పోరాటాలు, త్యాగాలు తప్పనిసరి. వాటిని చూపుతూనే యుద్ధాలు ఎలా సగటు సైనికుడి ్రపాణాలు బలిగొంటాయో కూడా చూపిన సినిమా హకీకత్. 1962 నాటి ఇండో చైనా యుద్ధం మీద వచ్చిన ఈ సినిమా అతి తక్కువ మంది భారత సైనిక పటాలం చైనా భారీ సేనతో ఎలా తలపడిందో చూపుతుంది. బల్రాజ్ సహానీ, ధరేంద్ర తదితరులు నటించిన ఈ సినిమాకు చేతన్ ఆనంద్ దర్శకుడు. కైఫీ ఆజ్మీ రాసిన ప్రఖ్యాత దేశభక్తి గీతం ‘కర్ చలే హమ్ ఫిదా జాన్ ఏ వతన్ సాథియో’ ఇందులోదే. ఉప్కార్ (1967): దేశభక్తి సినిమాలు తీసి ‘మిస్టర్ భరత్’ బిరుదు ΄÷ందిన నటుడు మనోజ్ కుమార్ నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సూచన మేరకు ‘జై జవాన్ జై కిసాన్’ నినాదానికి ఇచ్చిన సినీ రూపం ‘ఉప్కార్’. సైనికులు దేశ సరి హద్దుల వద్ద మాత్రమే సంఘర్షణ చేస్తారు... కాని రైతులు దేశంలో జీవితాంతం సంఘర్షణ చేసి గింజలు పండించి జనం కడుపులు నింపుతారు... వారే నిజమైన హీరోలు అని చెప్పే సినిమా ఇది. ‘ఇస్ దేశ్ కి ధర్తీ ఉగ్లే హీరా మోథీ’ హిట్ గీతం ఇందులోదే. బోర్డర్ (1997): యుద్ధంలో చావు కళ్ల ముందు కదలాడుతుంటే దేశం తప్ప మరేమీ గుర్తు రాక సంతోషంగా బలిదానం ఇచ్చే సైనికుల వీరత్యాగం ఎలా ఉంటుందో ‘బోర్డర్’లో చూడాలి. 1971 నాటి ఇండో పాక్ యుద్ధాన్ని కథాంశంగా తీసుకుని దర్శకుడు జె.పి. దత్తా తీసిన ఈ సినిమా ఒక గొప్ప వార్ మూవీ. సన్ని డియోల్, సునీల్ శెట్టి తదితరులు నటించిన ఈ సినిమాలో సైనికుల జీవితాన్ని వాస్తవికంగా చూపడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. యుద్ధ వ్యూహాలు కూడా ఈ సినిమాలో తెలుస్తాయి. లగాన్ (2001): దేశభక్తికి క్రీడలు జత చేసి గొప్ప సంచలనం సృష్టించిన సినిమా ‘లగాన్’. పన్నుల మీద పన్నులు వేసి దాష్టీకం చేస్తున్న బ్రిటిష్ వారిని చిన్న పల్లెజనం క్రికెట్లో ఓడించడం ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఆమిర్ ఖాన్ నిర్మించిన ఈ సినిమాకు అశుతోష్ గోవారికర్ దర్శకుడు. ఆస్కార్ నామినేషన్ ΄÷ందింది. అద్భుతమైన కథనం, సంగీతం, నటన, భావోద్వేగాలు, ఆటలో ఉండే మలుపులు తోడు కావడంతో ప్రేక్షకులు జేజేలు పలికారు. ది లెజెండ్ ఆఫ్ భగత్‌సింగ్ (2002): అమర దేశభక్తుడు భగత్ సింగ్ కథను తీసుకుని రాజ్ కుమార్ సంతోషి తీసిన అద్భుతమైన సినిమా ఇది. అజయ్ దేవగణ్– భగత్ సింగ్ పాత్రను పోషించి ప్రేక్షకుల కంట కన్నీరు తెప్పించాడు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్... ఈ ముగ్గురు దేశభక్తులు తమ ఉడుకు నెత్తురుతో దేశం కోసం పోరాడి లేత వయసులో మరణించడం ప్రేక్షకుల మనసు కలచి వేసేలా ఈ సినిమా చూపుతుంది. దేశం కోసం ఎలాంటి స్ఫూర్తితో ఉండాలో తెలుపుతుంది. లక్ష్య (2004): మంచి దేశభక్తి సినిమా మాత్రమే కాదు యువతను లక్ష్యం వైపు నడిపించే సినిమా కూడా. రిలీజైనప్పుడు ప్రేక్షకుల నుంచి స్పందన అంతంత మాత్రంగా ఉన్నా ఆ తర్వాత కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. కార్గిల్ వార్‌ను నేపథ్యంగా తీసుకుని గొప్ప సాంకేతిక విలువలతో తీశారు. హృతిక్ రోషన్‌తో పాటు అమితాబ్ బచ్చన్ కూడా నటించారు. మిలట్రీ వాతావరణం, క్రమశిక్షణ, ధీరత్వం ఈ సినిమాలో పుష్టిగా చూడొచ్చు. స్వదేశ్ (2004): ఈ దేశం నీకేమిచ్చిందని కాదు... ఈ దేశానికి నువ్వేమిచ్చావ్ అని తరచి ప్రశ్నించుకోవాలని నెహ్రూ అన్నారు. ఆ ప్రశ్నకు జవాబు ఈ సినిమా. ఈ దేశంలో పుట్టి పెరిగి చదువుకుని పరాయి దేశానికి వెళ్లి ఆ దేశానికి సేవ చేయడం తప్పు కాదు కానీ మన దేశానికి ఏదైనా చేయాలన్న బాధ్యతను మరువకూడదని ఎంతో గట్టిగా చెప్పింది ‘స్వదేశ్’. షారూక్ ఖాన్ నటించిన ఈ చిత్రానికి అశుతోష్ గోవారికర్ దర్శకుడు. ఎన్ఆర్ఐల బాధ్యతను నిలదీసిన సినిమా ఇది. రంగ్ దే బసంతి(2006): ఉద్యోగం వచ్చే చదువును చదువుకోవడం వేరు, దేశం పట్ల చైతన్యాన్ని కలిగించుకుని బాధ్యతను గుర్తెరగడం వేరు. నేటి యువత తమ కెరీర్‌ను వెతుక్కుంటున్నది గాని దేశం కోసం ఏం చేయాలో ఆలోచించడం లేదు. ‘రంగ్ దే బసంతి’... అల్లరి చిల్లరి యూనివర్సిటీ కుర్రాళ్లను దేశం కోసం ఏదైనా గట్టిగా చేయాలని నిర్ణయించుకోవడాన్ని చూపుతుంది. పుచ్చిపోయిన వ్యవస్థను సరిచేయాలనుకుని ్రపాణాలు అర్పించే కుర్రాళ్ల కథ ఇది. రాకేష్ మెహ్రా దర్శకుడు. ఆమిర్ ఖాన్ హీరో. ది ఫర్గాటెన్ హీరో (2004): నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోసం ఈ దేశం గుండె సగర్వంగా స్పందిస్తూనే ఉంటుంది. బ్రిటిష్ వారిపై పోరాడటానికి ఏకంగా సైన్యాన్ని నిర్మించిన ధీరుడు ఆయన. నేతాజీ మరణం ఇంకా మిస్టరీనే. నేతాజీ జీవితాన్ని అథెంటిక్‌గా చూపిన సినిమా ఇది. శ్యామ్ బెనగళ్ దర్శకునిగా ఎంత రీసెర్చ్ చేశాడో తెలుస్తుంది. నేతాజీగా సచిన్ ఖడేకర్ అద్భుతంగా నటించారు. గతించిన చరిత్రకు దర్పణం ఈ సినిమా. రాజీ (2018): దేశం కోసం గూఢచారిగా పని చేసి త్యాగాలు చేసిన వారు ఎందరో. వారిలో పురుషులతో పాటు స్త్రీలు కూడా ఉన్నారు. అలాంటి ఒక స్త్రీ కథ ‘రాజీ’. ఆలియా భట్ నటించిన ఈ సినిమా పాకిస్తాన్‌కు కోడలుగా వెళ్లి అక్కడ భారత్ కోసం గూఢచారిగా పని చేసిన సెహమత్ అనే స్త్రీ ఎదుర్కొన్న సవాళ్లను చూపుతుంది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చిన్న బడ్జెట్‌తో నిర్మితమైనా భారీ వసూళ్లను రాబట్టింది. -
విరూపాక్ష 100 కోట్ల కలెక్షన్ల సునామీ.. దెబ్బకి మెగాస్టార్ రేంజ్‌కి సాయి ధరమ్ తేజ్
-
డాన్
ట్రెండ్ సెట్టర్ కొన్ని సూపర్‌హిట్స్ విశేషాలు సరదాగా ఉంటాయి. డాన్ స్క్రిప్ట్‌ని సలీమ్ జావెద్ రాశాక దానిని దేవ్ ఆనంద్, ధర్మేంద్ర రిజెక్ట్ చేస్తే పనికి రాదేమోనని రచయితలు పక్కన పడేశారు. అప్పుడే ఇండ్రస్ట్రీలో నారిమన్ అనే కెమెరామెన్ సొంత సినిమా తీసి అప్పుల్లో పడ్డాడు. అతడికి మంచి పేరుంది. పైగా అమితాబ్, జీనత్ అమన్‌కు స్నేహితుడు. మనోజ్ కుమార్ దగ్గర శిష్యుడిగా పని చేసిన చంద్ర బారట్కు కూడా స్నేహితుడే. కష్టాల్లో ఉన్న నారిమన్‌ను గట్టెక్కిద్దామని ముగ్గురూ నిశ్చయించుకుని కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. సలీమ్ జావెద్‌ను అడిగితే మా దగ్గర ఒక సన్నాసి స్క్రిప్ట్ ఉంది కావాలంటే పట్టుకుపోండి అని ఉదారంగా ఇచ్చేశారు. అప్పటికే గాడ్ ఫాదర్ రిలీజ్ అయ్యి డాన్ వంటి మాటలు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాయి. అలా ‘డాన్’ అనే టైటిల్ రిజిస్టర్ అయ్యి ఆ తర్వాత విడుదలయ్యి సంచలనం సృష్టించింది. అంతవరకూ ఠాకూర్లు ఏలుతున్న బాలీవుడ్లో ఆ తర్వాత డాన్లు రంగ ప్రవేశం చేశారు. అక్కణ్ణుంచి తెలుగులోకి కూడా డెన్లూ డాన్లు వచ్చేశారు. డాన్‌కు జరిగినన్ని రీమేక్‌కు మరే సినిమాకు జరగలేదు. తెలుగు తమిళం హిందీ భాషల్లో దాదాపు ఆరేడు సార్లు ఈ సినిమా రీమేక్ అయ్యింది. ఎన్టీఆర్ వంటి హీరో ఈ స్క్రిప్ట్ అంగీకరించి ‘యుగంధర్’ పేరుతో నటించారంటే ఊహించుకోవచ్చు. దీనికి ఇళయరాజా సంగీతం ఇవ్వడం ఒక విశేషం అయితే ఇందులోని ‘నా పరువం నీ కోసం’ పాట హిందీలోని ‘ఏ మేర దిల్ ప్యార్ కా దీవానా’ పాటకు దీటుగా నిలవడం మరో విశేషం. -
మహేష్ పోలీస్‌గా నటిస్తే....