28న పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభం
28న పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభం
Published Fri, Feb 17 2017 11:04 PM | Last Updated on Tue, Sep 5 2017 3:57 AM
కర్నూలు (ఓల్డ్‌సిటీ): స్థానిక ప్రధాన తపాలా కార్యాలయంలో ఈనెల 28న పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. పోస్టుమెన్లు ఉత్తరాలను సార్టింగ్ చేసుకునే చోటును అనువైన ప్రదేశంగా గుర్తించారు. తూర్పు వైపున ప్రత్యేక ద్వారాన్ని కూడా నిర్మించారు. ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించేందుకు రీజనల్ పాస్‌పోర్టు అధికారి ఎం.ఎల్.పి.చౌదరి నేతృత్వంలోని పర్యవేక్షణ కమిటీ శుక్రవారం వైజాగ్ నుంచి కర్నూలు వచ్చింది. స్థలాన్ని కొలతలు వేసుకుని ఎక్కడ ఏ సదుపాయం ఏర్పాటు చేయాలనే అంశంపై అంచనా వేసుకున్నారు. కౌంటర్లు, టేబుళ్లు, కరెంటు సదుపాయం, జనరేటర్ సామర్థ్యం వంటి వాటి గురించి తెలుసుకున్నారు. పాస్‌పోర్టు కార్యాలయానికి ప్రత్యేక సర్వర్ గది, ప్రత్యేక జనరేటర్ ఉండాలని కమిటీ ప్రతినిధులకు సూచించారు. కార్యక్రమంలో వైజాగ్ ప్రతినిధి కృష్ణతోపాటు కర్నూలు పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు, ఏఎస్పీ సి.హెచ్.శ్రీనివాస్, పోస్టుమాస్టర్ వై.డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement