
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం కడప నుంచి గన్నవరం చేరుకున్న సీఎం జగన్.. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి చేరారు. విమానాశ్రయం నుంచి ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, భరత్, వెంకటరమణ, బాలశౌరి ఉన్నారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం రేపు (మంగళవారం) ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ప్రధానితో సమావేశం ముగిశాక.. ఢిల్లీ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం జగన్ పాల్గొంటారు.