సాక్షి, విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. అయన బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో మట్లాడుతూ.. సీఎం జగన్ చేస్తున్న పాలనకు అభినందనలు తెలిపారు. ఏపీ ఏం జరుగుతుందో తెలుసుకున్నానని, సీఎం జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు రిమార్కబుల్ అని తెలిపారు.
డిజిటల్ లైబ్రరీ, రైతు భరోసా కేంద్రాలు, వికేంద్రీకరణ దేశంలో ఎక్కడా లేని వినూత్న ఆలోచనలని చెప్పారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక యాప్ తీసుకొచ్చారని, కోవిడ్ వలన అనాథలైన పిల్లలకు రూ.10 లక్షలు డిపాజిట్ చేశారని తెలిపారు. వీటిని ఇతర రాష్ట్రాలకు కూడా సూచిస్తామని చెప్పారు. ఇక్కడ పరిస్థితులను ప్రత్యక్షంగా చూశాక ఏపీ కచ్చితంగా అగ్రస్థానాన్ని చేరుకుంటుందని తెలిపారు. అంతటి సామర్థ్యం ఏపీ రాష్ట్రానికి ఉందని, నీతి ఆయోగ్ నుంచి సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని తెలిపారు.
మధ్యాహ్నం 01: 30
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా రెండు రోజుల పాటు ఏపీలో జరిగే వివిధ కార్యక్రమాలలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ బృందం పాల్గొననున్నారు
ఉదయం 11: 45
వీరపనేని గూడెంలో నీతి ఆయోగ్ బృందం పర్యటన ముగిసింది. అక్కడి నుంచి నీతి ఆయోగ్ బృందం విజయవాడకు బయల్దేరింది.
ఉదయం 11: 30
వీరపనేనిగూడెం గ్రామ సచివాలయాన్ని నీతి ఆయోగ్ బృందం సందర్శించింది. గ్రామ సచివాలయం పనితీరును జిల్లా కలెక్టర్ జె.నివాస్ నీతి ఆయోగ్ బృందానికి వివరించారు. నీతి ఆయోగ్ బృందానికి సేంద్రీయ పద్ధతిలో పండించిన పంటలతో తయారు చేసిన ఆహారపదార్ధాలను వీరపనేని గూడెం గ్రామస్తులు అందజేశారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డా.రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. వీరపనేని గూడెం గ్రామస్తులుప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడం నిజంగా అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఇలాగే మరింత మంది ప్రకృతి వ్యవసాయం వైపు అగుడులేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
చదవండి: పొగమంచులో విమానం.. ప్రయాణికుల్లో టెన్షన్
ఉదయం 11: 00
► వీరపనేని గూడెంలోని రైతు భరోసా కేంద్రాన్ని డా.రాజీవ్ కుమార్ నేతృత్వంలోని నీతి ఆయోగ్ బృందం సందర్శించింది. నీతి ఆయోగ్ బృందానికి వీరపనేని గూడెం గ్రామస్తులు వినూత్నంగా స్వాగతం పలికారు. సేంద్రీయపద్ధతిలో పండించిన కూరగాయలు, చిరుధాన్యాలతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను నీతి ఆయోగ్ బృందం సందర్శించింది. గ్రామ సచివాలయంలో ప్రకృతి వ్యవసాయం పై మహిళా సంఘాలతో సమావేశం అయ్యింది. నీతి ఆయోగ్ బృందంతో పాటు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్, జాయింట్ కలెక్టర్ శివశంకర్, సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ పాల్గొన్నారు.
చదవండి: మహాయజ్ఞంలా సాగుతోన్న పెన్షన్ల పంపిణీ
ఉదయం 10: 00
►నీతి ఆయోగ్ బృందం కృష్ణా జిల్లాలోని వీరపనేని గూడెంకు చేరుకుంది. వీరపనేని గూడెంలో బి.సతీష్ రెడ్డి అనే రైతుకు చెందిన వరి పొలాన్ని పరిశీలించారు. రసాయనాలు వాడకుండా వరిసాగు చేసిన విధానాన్ని డా.రాజీవ్ కుమార్ నేతృత్వంలోని నీతి ఆయోగ్ బృందం అడిగి తెలుసుకున్నారు.
ఉదయం 9: 00
► ఢిల్లీ నుంచి నీతి ఆయోగ్ సభ్యుల బృందం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డా. రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులు రాగా.. వారందరికి ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో ప్రకృతి వ్యవసాయాన్ని నీతి ఆయోగ్ బృందం పరిశీలించనుంది.
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో నీతి ఆయోగ్ సభ్యుల బృందం మంగళవారం పర్యటించనుంది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డా. రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ బృందం పర్యటించనుంది. కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం వీరపనేనిగూడెంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను రాజీవ్ కుమార్‌తో కూడిన నీతి ఆయోగ్ బృందం పరిశీలించనుంది.
అనంతరం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సీఎంతో పాటు వివిధ శాఖల రాష్ట్రస్థాయి అధికారులతో నీతి ఆయోగ్ బృందం భేటీ కానుంది. సాయంత్రం వివిధ పరిశ్రమల ప్రతినిధులు , పారిశ్రామిక సంఘాలు , వివిధ యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లు , విద్యా సంస్థల ప్రతినిధులు, సామాజిక సంఘాల ప్రతినిధులతో నీతి ఆయోగ్ బృందం సమావేశం కానుంది.
చదవండి: చిత్తూరు జిల్లా పర్యటనకు సీఎం వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment