గన్నవరంలో టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్‌ | TDP Leaders In Gannavaram Overaction | Sakshi
Sakshi News home page

గన్నవరంలో టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్‌

Published Mon, Feb 20 2023 6:37 PM | Last Updated on Mon, Feb 20 2023 7:10 PM

TDP Leaders In Gannavaram Overaction - Sakshi

గన్నవరం(కృష్ణాజిల్లా): టీడీపీ కార్యకర్తలు మరోసారి ఓవరాక్షన్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై రాళ్ల దాడికి దిగారు టీడీపీ కార్యకర్తలు. దీన్ని అడ్డుకున్న పోలీసులపై కూడా టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు.

టీడీపీ కార్యకర్తల దాడిలో సీఐ కనకారావుకు గాయాలయ్యాయి. మరొకవైపు గన్నవరం రోడ్డుపై టీడీపీ కార్యకర్తలు బైఠాయించారు. వాహనాలను అడ్డుకోవడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. వంశీని అసభ్య పదజాలంతో దూషిస్తూ టీడీపీ కార్యకర్తలు ఘర్షణ వాతావరణానికి ఆజ్యం పోశారు.

గన్నవరం పీఎస్‌ వద్ద కూడా వంశీకి వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేసి ఓవరాక్షన్‌ చేశారు. దాంతో ఆగ్రహించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు టీడీపీ ఆఫీస్‌కు వచ్చారు. అయితే టీడీపీ ఆఫీస్‌కు వచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement