
సాక్షి, విజయవాడ : ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి కోవిడ్ 19 మెడికల్ కిట్లు చేరుకున్నాయి. వీటిలో పీపీఈ కిట్లు, మాస్కులు, మెడిసిన్లు ఉన్నాయి. గన్నవరం విమానాశ్రయం నుండి స్టేట్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు అధికారులు రవాణా చేయనున్నారు.
వేగవంతమైన కరోనా నిర్ధారణ పరీక్షల కోసం లక్ష కోవిడ్ ర్యాపిడ్ కిట్లను ఇప్పటికే దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక చార్టర్ విమానంలో ఏపీకి తరలించిన విషయం తెలిసిందే. కొత్తగా మరిన్ని వైద్య పరికరాలు రావడంతో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షలు మరింతగా ఊపందుకోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment