
సాక్షి, అమరావతి: కరోనా కట్టడి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు మరో 7.20 లక్షల కోవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి. కాగా కోవిషీల్డ్ డోసులు పుణె నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోగా, అక్కడి నుంచి టీకా డోసులను గన్నవరంలోని టీకా నిల్వ కేంద్రానికి తరలించనున్నారు. అనంతరం జాబితాల ప్రకారం టీకా నిల్వ కేంద్రం నుంచి జిల్లాలకు అధికారులు తరలిస్తారు.