
టీకాలను జిల్లాలకు తరలిస్తున్న అధికారి
గన్నవరం: పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ నుంచి మరో 4 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు ఆదివారం రాష్ట్రానికి చేరుకున్నాయి. న్యూఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానంలో ఈ డోసులను ఇక్కడికి తరలించారు. అనంతరం విమానాశ్రయం నుంచి కంటైనర్లలో గన్నవరంలోని రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల భవనానికి తీసుకువచ్చి భద్రపరిచారు.
మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ వేసేందుకు 2 రోజుల వ్యవధిలో 5 లక్షల కోవిషీల్డ్ డోసులను దిగుమతి చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక్కడి నుంచి 13 జిల్లాలకు తరలించినట్లు శీతలీకరణ అధికారి దేవానందం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment