
ఈ యువతిని ఆదుకోరూ...
బీటెక్ చదువుతున్న ఓ యువతి టీబీ వ్యాధితో తీవ్ర వేదనకు గురవుతోంది.
- బీటెక్ విద్యార్థినికి టీబీ
- వైద్యానికి రూ.4.5 లక్షలు అవసరం
- దాతలు ఆదుకోవాలని వినతి
హైదరాబాద్: బీటెక్ చదువుతున్న ఓ యువతి టీబీ వ్యాధితో తీవ్ర వేదనకు గురవుతోంది. వైద్యానికి తగిన ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతోంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన శ్రీనివాసులు పెద్ద కుమార్తె ఎస్.సువర్చలాదేవి బీటెక్ మూడవ సంవత్సరం చదువుతుంది. శ్రీనివాసులు వృత్తిరీత్యా కూల్‌డ్రింక్ షాపు నిర్వహిస్తున్నాడు.
గత మార్చిలో సువర్చలాదేవి జ్వరంతో బాధపడుతుండగా హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. టీబీ వ్యాధి వచ్చిందని, వైద్యానికి రూ.4.5 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో వారు తల్లడిల్లిపోయారు. ఆర్థిక పరిస్థితి సహకరించనందున దాతలు సహాయం అందించాలని కోరుతున్నారు. సాయం చేయదలచిన వారు..బ్యాంకు ఎకౌంట్-194110100003448 (ఆంధ్రా బ్యాంకు, యర్రగొండపాలెం బ్రాంచ్) ఫోన్: 9493266482, 9666013171 నెంబర్లలో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.