బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి విశాఖ నగరంలో తీవ్ర కలకలం రేపింది. బుల్లయ్య కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న జ్యోత్స్న అనే విద్యార్థిని అక్కయ్యపాలెంలోని లెక్చరర్ ఇంట్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడంతో అనుమానాలు తలెత్తాయి. మల్కాపురం ప్రకాశ్ నగర్‌కు చెందిన జోత్స్న ఏడాదిన్నర కాలంగా అంకుర్ కిష్‌లే అనే లెక్చరర్ వద్ద ఐఐటీ కోచింగ్‌కు సంబంధించి సలహాలు తీసుకుంటోంది. బిహార్‌లోని పట్నాకు చెందిన అంకుర్.. అక్కయ్యపాలెంలోని అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. నిన్న ఉదయం అంకుర్ ఇంటికి వెళ్లిన జ్యోత్స్న అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయింది.