ప్రేమించాలంటూ యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న బీటెక్ విద్యార్థిపై నిర్భయ కేసు నమోదైంది.
బంజారాహిల్స్ : ప్రేమించాలంటూ యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న బీటెక్ విద్యార్థిపై నిర్భయ కేసు నమోదైంది. కళాశాలకు వెళ్లి యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, దారికాచి వేధిస్తున్న ఓ బీటెక్ విద్యార్థిని నిర్భయ చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... యూసుఫ్‌గూడ సమీపంలోని రహ్మత్‌నగర్‌లో నివసించే అభిషేక్(19) బీటెక్ చదువుతున్నాడు. యాదగిరినగర్‌లో నివసించే డిగ్రీ విద్యార్థిని, అభిషేక్ తమ 8వ తరగతి నుంచి స్నేహితులుగా ఉన్నారు.
అదే అదనుగా భావించిన అభిషేక్ ఆ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంట పడసాగాడు. తనకు ఇష్టం లేదని ఆమె ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకపోగా కొన్ని రోజుల నుంచి వేధింపులు శృతిమించి ఆమె చదువుతున్న కాలేజీ వరకు వెళ్లాయి. ప్రేమించకపోతే నీ అంతు చూస్తానంటూ బెదిరించడంతో బాధితురాలు తన తల్లిదండ్రుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లింది. తండ్రితో కలిసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అభిషేక్‌పై ఐపీసీ 354కింద కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.