బీటెక్ విద్యార్థి దుర్మరణం
బీటెక్ విద్యార్థి దుర్మరణం
Published Sat, Apr 29 2017 11:44 PM | Last Updated on Tue, Sep 5 2017 9:59 AM
జూపాడుబంగ్లా: మోటార్ సైకిల్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో గొల్ల నరేష్(20) అనే బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన శనివారం ఉదయం...80 బన్నూరు సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్షసాక్షుల వివరాల మేరకు..కొత్తపల్లి మండలం శివపురం గ్రామానికి చెందిన రామసుబ్బయ్య చిన్న కుమారుడు నరేష్.. గుంటూరు జిల్లా మదనపల్లె సమీపంలోని బీటెక్ కళాశాలలో ద్వితీయసంవత్సరం చదువుతున్నాడు. కరివేనలో మిత్రుని వివాహానికి ద్విచక్రవాహనంపై కర్నూలు నుంచి బయలు దేరాడు. ఆత్మకూరు నుంచి కర్నూలుకు వస్తున్న బస్సు 80 బన్నూరు సమీపంలోని జంబులమ్మ దేవాలయం వద్ద.. మోటార్ సైకిల్‌ను ఢీకొంది. ప్రమాదంలో నరేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. హెల్మెట్ ఉన్నా అతన్ని కాపాడలేకపోయింది. మృతుని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ అశోక్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి మృతుని తల్లిదండ్రులను ఓదార్చారు.
Advertisement
Advertisement