వీడియో గేమ్ కొనివ్వలేదని..ఓ విద్యార్థి..
వీడియోగేమ్ కొనివ్వలేదని భవనం పైనుంచి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు..
హయత్‌నగర్: వీడియోగేమ్ కొనివ్వలేదని భవనం పైనుంచి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... కుంట్లూర్ రత్నా కాలనీకి చెందిన గండు శ్రీనివాస్ కుమారుడు అభినయ్(17) నాదర్‌గుల్‌లోని ఎంవిఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
గత వారం రోజులుగా వీడియోగేమ్ కొనివ్వాలని తండ్రిని కోరుతున్నాడు. అందుకు తండ్రి నిరాకరించడంతో మనస్థాపానికి గురైన అభినయ్ ఆదివారం రాత్రి తమ ఇంటి 2వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించా రు. వైద్యుల సూచనమేరకు ఎల్‌బి నగర్‌లోని కామినేని అసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.