వీడియోగేమ్ కొనివ్వలేదని భవనం పైనుంచి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... కుంట్లూర్ రత్నా కాలనీకి చెందిన గండు శ్రీనివాస్ కుమారుడు అభినయ్(17) నాదర్‌గుల్‌లోని ఎంవిఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.