
సాక్షి, హైదరాబాద్ : గో కార్టింగ్ సరదా బీటెక్ విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ సంఘటన నగర శివారులోని గుర్రంగూడ గో కార్టింగ్ ప్లే జోన్‌లో చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థిని శ్రీ వర్షిణి తన స్నేహితులతో కలిసి గో కార్టింగ్‌కు వెళ్లింది. గో కార్టింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ టైర్‌కు యువతి తల వెంట్రుకలు చుట్టుకున్నాయి. వేగంగా వెళుతున్న సమయంలో ప్రమాదం జరగడంతో శ్రీ వర్షిణి తల బలంగా నేలకు తగిలింది. ఆమె పెట్టుకున్నహెల్మెట్ కూడా పగిలిపోయి తలకు తీవ్రంగా గాయమైంది. దీంతో శ్రీ వర్షిణిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. మరోవైపు గో కార్టింగ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని శ్రీ వర్షిణి తల్లిదండ్రులు మీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment