Meerpet Police Station
-
టీకా తీసుకున్న 45 నిమిషాలకే మృతి
మీర్‌పేట (హైదరాబాద్): టీకా తీసుకున్న కొన్ని నిమిషాలకే ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మీర్‌పేట రాఘవేంద్రనగర్ కాలనీలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన శ్రీపాతి నర్సింహ్మారెడ్డి (46), అతడి భార్య వాణి శుక్రవారం జిల్లెలగూడలో చల్లా లింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన టీకా కేంద్రంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం ద్విచక్ర వాహనంపై సమీపంలోని తమ టైలరింగ్ షాప్‌కి వెళ్లారు. అక్కడ సెల్‌ఫోన్ చూస్తూ నర్సింహ్మారెడ్డి ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. కుటుంబ సభ్యులు మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వ్యాక్సిన్ తీసుకున్న 45 నిమిషాల్లోనే నర్సింహ్మారెడ్డి చనిపోవడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. చదవండి: అయ్యో పాపం.. ఇదేం శాపం Covid-19: కరోనా పుట్టుక కనిపెట్టలేమా? వైరాలజిస్టులు ఏం చెబుతున్నారు? -
గో కార్టింగ్ సీజ్, నిర్వాహకులు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : గుర్రంగూడలోని హాస్టన్ గో కార్టింగ్ నిర్వాహకులను మీర్‌పేట పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సంబంధిత శాఖల నుంచి అనుమతి లేకుండానే గో కార్టింగ్ నిర్వహిస్తున్నారని, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే సందర్శకులను అనుమతి ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ సంస్థ నిర్వహాకులు గుర్రం లోహిత్ రెడ్డి, కిరణ్ కుమార్, శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసి గో కార్టింగ్ సెంటర్‌ను సీజ్ చేశారు. కాగా వనస్థలిపురంలోని ఎఫ్‌సీఐ కాలనీకి చెందిన శ్రీ వర్షిణి అనే యువతి గో కార్టింగ్ చేస్తూ మృతి చెందిన విషయం తెలిసిందే. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె మృతి చెందిందంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గో కార్టింగ్ నిర్వాహకులపై ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణి మృతదేహానికి ఆమె కుటుంబ సభ్యులు శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. (గో కార్టింగ్ ప్రమాదంలో శ్రీ వర్షిణి మృతి) -
గో కార్టింగ్ ప్రమాదంపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: హాస్టన్ గో కార్టింగ్ ప్లే జోన్ నిర్వాహకులపై మీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. గత బుధవారం సాయంత్రం గో కార్టింగ్ రైడింగ్ చేస్తూ బీటెక్ విద్యార్థిని శ్రీ వర్షిణి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. రైడింగ్ చేస్తున్న క్రమంలో ప్రమాదానికి గురైన శ్రీవర్షిణి గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న ప్రాణాలు విడిచింది. పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరికొద్ది సేపట్లో శ్రీ వర్షిణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవనుంది. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. వెంట్రుకలు చిక్కుకోవడంతో గో కార్టింగ్ రైడ్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు హెల్మెట్ జారి కింద పడగా వెంట్రుకలు టైర్లలో చిక్కుకోవడంతో శ్రీ వర్షిణి కిందపడిపోయింది. ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హాస్టెన్ గో-కార్టింగ్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే శ్రీవర్షిణి మృతి చెందిందని మృతురాలి సోదరుడు నాగప్రణీత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నాడు. ఎటువంటి భద్రతా చర్యలు లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని తెలిపాడు. అయితే, సెల్ఫీ కోసం శ్రీ వర్షిణి హెల్మెట్ తీసే ప్రయత్నం చేయడంతో ఆమె వెంట్రుకలు టైర్ వీల్లో చిక్కుకున్నాయని, ఆమె కిందపడటంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందిందని హాస్టన్ గో కార్టింగ్ జోన్ నిర్వాహకులు చెప్తున్నారు. (చదవండి: గో కార్టింగ్ ప్రమాదంలో శ్రీ వర్షిణి మృతి) -
గో కార్టింగ్ ప్రమాదంలో శ్రీ వర్షిణి మృతి
సాక్షి, హైదరాబాద్ : గో కార్టింగ్ ప్లే జోన్లో తీవ్రంగా గాయపడ్డ శ్రీ వర్షిణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా కమరపల్లి మండలానికి చెందిన కాపా నాగేశ్వరరావు, మంజుల దంపతులకు కుమార్తె శ్రీవర్షిణి (21), కుమారుడు నాగప్రణీత్లు ఉన్నారు. నాగేశ్వరరావు మృతి చెందడంతో రెండున్నరేళ్ల క్రితం తల్లి మంజుల పిల్లలతో కలిసి రెండున్నరేళ్ల క్రితం వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీకి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. శ్రీవర్షిణి వరంగల్ కిట్స్‌లో బీటెక్ 3వ సంవత్సరం సీఎస్సీ గ్రూప్ చదువుతోంది. బుధవారం ఇంటికి బంధువులు రావడంతో శ్రీ వర్షిణి వారితో కలిసి సరదాగా రాత్రి 7.30 గంటల సమయంలో గుర్రంగూడలోని హస్టెన్ గో-కార్టింగ్‌కు వెళ్లారు. కాగా శ్రీవర్షిణి బంధువుతో కలిసి రైడ్‌కు వెళ్లగా ప్రమాదవశాత్తు హెల్మెట్ జారి కింద పడగా వెంట్రుకలు టైర్లలో చిక్కుకోవడంతో కిందపడి తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో వెంటనే శ్రీవర్షిణి చికిత్స నిమిత్తం గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీవర్షిణి గురువారం మధ్యాహ్నం 3.40 గంటలకు మృతి చెందింది. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది... హాస్టెన్ గో-కార్టింగ్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే శ్రీవర్షిణి మృతి చెందిందని మృతురాలి సోదరుడు నాగప్రణీత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నాడు. ఎటువంటి భద్రతా చర్యలు లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని తెలిపాడు. హెల్మెట్ తీయడం వలనే ఈ ప్రమాదం దీనిపై గో-కార్టింగ్ యాజమాన్యం స్పందిస్తూ అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. నిర్వాహకుడు కిరణ్ మాట్లాడుతూ.. శ్రీ వర్షిణితో పాటు వాళ్ల బాబాయ్ నిన్న రాత్రి ఏడు గంటల ప్రాంతంలో మా కార్టన్‌కు వచ్చారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే మేము కార్టన్ ఇస్తాం. శ్రీ వర్షిణి, వాళ్ల బాయ్ ఇద్దరూ ఒకే వెహికల్‌పై ఉన్నారు. ఇద్దరు హెల్మెట్ పెట్టుకున్నారు. ఒక రౌండ్ వేశాక రెండో రౌండ్లో శ్రీ వర్షిణి హెల్మెట్ తీసి సెల్ఫీ కోసం ప్రయత్నం చేసింది. దీంతో ఆమె వెంట్రుకలు టైర్ వీల్లో చిక్కుకున్నాయి. ఆమె కిందపడటంతో తలకు దెబ్బ తగలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. గత మూడేళ్లుగా కార్టిన్ నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. హెల్మెట్ తీయడం వలనే ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారని తెలిపారు. -
గో కార్టింగ్: బీటెక్ విద్యార్థినికి తీవ్ర గాయాలు
సాక్షి, హైదరాబాద్ : గో కార్టింగ్ సరదా బీటెక్ విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ సంఘటన నగర శివారులోని గుర్రంగూడ గో కార్టింగ్ ప్లే జోన్లో చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థిని శ్రీ వర్షిణి తన స్నేహితులతో కలిసి గో కార్టింగ్‌కు వెళ్లింది. గో కార్టింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ టైర్‌కు యువతి తల వెంట్రుకలు చుట్టుకున్నాయి. వేగంగా వెళుతున్న సమయంలో ప్రమాదం జరగడంతో శ్రీ వర్షిణి తల బలంగా నేలకు తగిలింది. ఆమె పెట్టుకున్నహెల్మెట్ కూడా పగిలిపోయి తలకు తీవ్రంగా గాయమైంది. దీంతో శ్రీ వర్షిణిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. మరోవైపు గో కార్టింగ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని శ్రీ వర్షిణి తల్లిదండ్రులు మీర్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నగరంలో విషాదం: ఫిల్లర్ గుంతలో పడి..
సాక్షి, హైదరాబాద్: మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఓ నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలో పడి మూడేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందీహిల్స్ కాలనీ రోడ్ నెం.19లో ఉన్న 20 ఫీట్ రోడ్డు పక్కన కన్స్ట్రక్షన్ కోసం ఫిల్లర్ గుంత తవ్వారు. నిన్న కురిసిన వర్షానికి ఆ గుంత నీటితో నిండిపోయింది. ఆడుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు ఆ గుంతలో పడి ఆ బాలుడు మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న మీర్పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి హఠాన్మరణంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాధిత కుటుంబం నల్గొండ జిల్లా నాంపల్లి మండలం పసునూర్ గ్రామానికి చెందినవారుగా తెలిసింది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబం ఆత్మహత్య!
సాక్షి, హైదరాబాద్: మీర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అల్మాస్‌గూడలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం సాయంత్రం వెలుగుచూసింది. మృతుల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ హరీష్ కుటుంబంగా పోలీసులు గుర్తించారు. అపార్ట్మెంట్లోని మొదటి అంతస్తులో నివాసముంట్ను హరీష్ కుటుంబ సభ్యులు రెండు రోజులుగా బయటికి రాకపోవడంతో.. ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు బద్దలు కొట్టి చూడగా.. నలుగురు విగతజీవులుగా కనిపించారు. మృతులను హరీష్, స్వప్న గిరీష్, సువర్ణగా పోలీసులు గుర్తిచారు. ఆర్థిక ఇబ్బందులతో నలుగురూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. (చదవండి: కరోనా: ఇకపై 28 రోజుల హోం క్వారంటైన్) -
ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి
-
ట్రాక్టర్ ఢీ: కళ్లెదుటే స్నేహితుడి దుర్మరణం
సాక్షి, హైదరాబాద్: మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని జిల్లెల్లగూడ వివేకానంద చౌరస్తాలో ఓ ట్రాక్టర్ సైకిల్‌ను ఢీకొట్టింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో జగదీష్ (12) అనే బాలుడు మృతిచెందగా.. అతడి స్నేహితుడు ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాలు.. సూర్యాపేట జిల్లాకు చెందిన నగేశ్, మంగమ్మ దంపతులు గత కొంతకాలంగా మీర్‌పేటలోని దాసరి నారాయణ కాలనీలో నివాసముంటున్నారు. ఈక్రమంలో వారి రెండో కుమారుడు జగదీశ్ స్నేహితుడితో కలిసి సైకిల్‌పై వెళ్తున్నాడు. వివేకానంద చౌరస్తావద్దకు రాగానే.. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వారి సైకిల్‌ను ఢీకొట్టింది. జగదీశ్ ట్రాక్టర్ చక్రాల కింద పడిపోగా.. అతని స్నేహితుడు ఎగిరి పక్కకు పడ్డాడు. తీవ్రగాయాలతో జగదీశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. జగదీశ్ బాలాపూర్‌లోని శ్రీగాయత్రి పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఇక ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ కూడా మైనరే కావడం గమనార్హం. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీలో నమోదయ్యాయి. -
పాఠశాల విద్యార్థుల మధ్య ఘర్షణ
హైదరాబాద్: పాఠశాల విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డ సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంఘటన ప్రకారం... జిల్లెలగూడలోని చల్లా లింగారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సురేష్, గణేష్, ప్రభులు 10వ తరగతి చదువుతున్నారు. సహ విద్యార్థినిని ప్రభు గత కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. సురేష్ ఆమెతో చనువుగా ఉండటాన్ని చూసిన ప్రభు పలుమార్లు అతనిని హెచ్చరించాడు. అయినా సురేష్ ఆమెతో చనువుగా ఉంటుండటంతో ఆగ్రహానికి గురైన ప్రభు శనివారం ఉదయం 11 గంటలకు పాఠశాల విరామ సమయంలో బయటకు వచ్చిన సురేష్‌తో తన తోటి స్నేహితులతో కలిసి వాగ్వావాదానికి దిగాడు. ఇరువురి మధ్య మాటా.. మాట పెరగడంతో కోపోద్రిక్తుడైన ప్రభు పక్కనే ఉన్న బీరుసీసాను పగులగొట్టి సురేష్‌పై దాడి చేశాడు. దీంతో సురేష్‌కు వీపు కింది భాగంలో గాయమైంది. అడ్డుకోబోయిన మరో విద్యార్థి గణేష్‌పై కూడా దాడి చేయడంతో అతనికి మెడ భాగంలో గాయమైంది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు గమనించి దగ్గరకు వెళ్లగా ప్రభు, అతని స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. గాయపడ్డ సురేష్, గణేష్‌లు వెంటనే మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా వారిని చికిత్స నిమిత్తం పోలీసులు మందమల్లమ్మ చౌరస్తాలోని ఆర్‌కెమల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. కౌన్సెలింగ్ ఇచ్చి పంపించాం: విద్యార్థుల మధ్య అహం దెబ్బతినడంతో పాటు, డబ్బుల విషయంలో ఘర్షణ జరిగిందని, ప్రేమ వ్యవహారమేమీ లేదని మీర్‌పేట పోలీసులు అంటున్నారు. ఈ ఘర్షణలో ఇద్దరు గాయపడగా దాడికి పాల్పడిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చి పంపించామని పోలీసులు తెలిపారు. వేర్వేరు సెక్షన్లు కావడంతో తరచూ వీరి మధ్య అహం దెబ్బతిని గొడవకు దారితీసిందని పోలీసులు అంటున్నారు. -
పేకాట స్థావరంపై దాడి..ఎనిమిది మంది అరెస్ట్
హైదరాబాద్ : మీర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వినాయక హిల్స్ కాలనీలో పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. గుట్టు చప్పుడు కాకుండా ఓ ఇంటిలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ.50 వేల నగదు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బంక్‌లో పెట్రోల్ పోయిస్తుండగా దాడి చేశారు!
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో శుక్రవారం సాయంత్రం ఓ రియల్టర్‌పై దాడి జరిగింది. బీఎన్‌రెడ్డి నగర్ బంక్‌లో పెట్రోల్ పోయిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు రియల్టర్ శ్రీనివాసరెడ్డి, అతని డ్రైవర్ ఫిరోజ్‌పై రాళ్లతో దాడి చేశారు. అయితే ఈ రోజు ఉదయమే తనకు ప్రాణహాని ఉందంటూ.. మీర్పేట్ పోలీస్ స్టేషన్లో రియల్టర్ శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అసలు నిందితులెవరు?
* ఒకే హత్య కేసులో వేర్వేరు నిందితుల అరెస్టు * కొత్త మలుపు తిరిగిన జంగయ్య హత్య కేసు * వారం క్రితమే ముగ్గురిని అరెస్టు చేసిన మీర్‌పేట పోలీసులు * రెండు రోజుల క్రితం ఇదే కేసులో వేరే నలుగురి అరెస్టు చూపిన ‘పట్నం’ పోలీసులు * రెండు ఠాణాల కథనంలో ఏది నిజం..? సాక్షి, సిటీబ్యూరో: ఒకే హత్య కేసులో రెండు పోలీస్స్టేషన్ల అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి రిమాండ్ డైరీలో నిందితులను వేర్వేరుగా చూపడం సంచలనం సృష్టిస్తోంది. ఇబ్రహీంపట్నం, మీర్పేట్ పోలీసుల వ్యవహార శైలి పోలీస్‌మార్క్ న్యాయాన్ని తలపిస్తోంది. సర్వత్రా చర్చనీయాంశమైన ఈ వ్యవహారంలో ఎవరిది తప్పు..ఎవరిది ఒప్పు అనే విషయం నిగ్గు తేల్చేందుకు విచారిస్తున్నామని ఎల్బీనగర్ డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. ఇంతకీ ఏం జరిగిందంటే...మీర్పేట్ పోలీస్‌స్టేషన్‌లో... గతనెల 30వ తేదీ రాత్రి మీర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన నల్లగొండ జిల్లా సంస్థాన్‌నారాయణపూర్ మండలం వాయిల్లపల్లి జనగాం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జంగయ్య (35) హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ హత్య కేసులో మీర్‌పేట పోలీసులు హతుడి స్నేహితులైన ఆటో డ్రైవర్లు కొత్తపల్లి రమేష్ (25), టేకుమత్తుల రమేష్ (26), రేపాక రాజు (30)లను ఈనెల 16న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ ముగ్గురు చర్లపల్లి జైలులో ఉన్నారు. నిందితుల్లో ఒకడైన రాజు ఇబ్రహీంపట్నంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌కు సొంత సోదరుడు. తన భార్యతో హతుడు జంగయ్య సన్నిహితంగా ఉంటున్నాడని గ్రామస్తులు చెప్పడంతో కొత్తపల్లి రమేష్ అతనిపై కక్షపెంచుకున్నాడని, అలాగే, రూ. 60 వేల బాకీ విషయంలో టేకుమత్తుల రమేష్‌కు జంగయ్య మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయని, వీరిద్దరూ రాజుతో కలిసి పథకం పన్ని హత్య చేశారని రిమాండ్ రిపోర్టులో మీర్‌పేట పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుంచి హతుడి ఆటోతో పాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసు దర్యాప్తులో ఉండగానే ఇబ్రహీంపట్నం కానిస్టేబుల్ తను సోదరుడు రాజును కేసులోంచి తప్పించేందుకు మరికొందరితో కలిసి ప్రయత్నించి.. బోల్తాపడ్డాడు. ఇబ్రహీంపట్నం పోలీసులు... ఈనెల 1న ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలో ఐటీఐ చదువుతూ ఆటో నడుపుతున్న బడంగ్‌పేటకు చెందిన అభిమన్యు (19) హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అతని స్నేహితులు బాలాపూర్‌కు చెందిన లక్ష్మణ్‌నాయక్ (19), సాయితేజ (19), శేఖర్ (19), కార్తీక్ (19)లను ఈనెల 19న ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు రమేష్ (19), రఘవాచారి (19) పరారీలో ఉన్నారని రిమాండ్ డైరీలో పేర్కొన్నారు. అభిమన్యు హత్యకు ఒక రోజు ముందు అంటే గత నెల 30న మీర్‌పేట ఠాణా పరిధిలో ఆటో డ్రైవర్ జంగయ్యను కూడా తామే హత్య చేశామని నిందితులు వెల్లడించారని ఇబ్రహీంపట్నం పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ డైరీలో పేర్కొన్నారు. జంగయ్యను హత్య చేసింది సాయితేజ, శేఖర్, కార్తీక్‌తో పాటు పరారీలో ఉన్న రమేష్, రాఘవాచారిలేనని కూడా నిందితుల వాంగ్మూలంలో పేర్కొన్నారు. అనుమానాలెన్నో..? * ఇంతకీ జంగయ్యను మీర్‌పేట పోలీసులు అరెస్టు చేసిన నిందితులే చంపారా? లేక ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్టు చేసిన వారు చంపారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. * అయితే, మేము చేసిందే నిజమైన దర్యాప్తు, మేము పట్టుకున్న వారే అసలైన నిందితులని ఇటు మీర్‌పేట, అటు ఇబ్రహీంపట్నం పోలీసులు చెబుతున్నారు. * శాస్త్రీయంగా ఆలోచిస్తే మాత్రం ఇద్దరిలో ఒకరు చెప్తున్నదే నిజం. మరొకరిది అబద్ధం. * అబద్ధం చెప్పాల్సిన అవసరం, కేసును తప్పుదారి పట్టించాల్సిన అవసరం ఎవరికుంది?. * కానిస్టేబుల్ సోదరుడు రాజును కేసు నుంచి తప్పించకపోవడంతో మొత్తం కేసునే తారుమారు చేయాలనుకున్నారా?. * అభిమన్యును చంపిన నిందితులను భయపెట్టి వారికి అంజయ్య హత్య కేసు కూడా అంటగడుతున్నారా? * మీర్‌పేట పోలీసులు నిందితుల నుంచి అంజయ్య సెల్‌ఫోన్‌తో పాటు అతని ఆటోనూ సీజ్ చేశారు. * హత్య అనంతరం ఆంజయ్య ఆటోను ఎల్బీనగర్లోని ప్రైవేట్ ఆటో స్టాండ్‌లో పార్కింగ్ చేసినట్లు రాజు సంతకం పెట్టిన దాఖలాలు ఉన్నాయి. * పార్కింగ్ వారు ఇచ్చిన రసీదును సైతం రాజు నుంచి మీర్‌పేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. * వీరు అసలైన హంతకులు కాకపోతే , వీరి వద్ద అంజయ్య సెల్‌ఫోన్, ఆటో ఎలా ఉంటుంది. * ఇబ్రహీంపట్నం పోలీసులు నిందితుల నుంచి అంజయ్య ఉంగరం (బంగారం కాదు) సీజ్ చేశామంటున్నారు. * అసలు ఈ ఉంగరం అంజయ్యదేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. * ఎందుకూ పనికిరాని ఉంగరాన్ని నిందితులు ఎందుకు దొంగిలిస్తారు. * ఉంగరం దొంగిలించిన నిందితులు హతుడి జేబులోని సెల్‌ఫోన్‌ను ఎందుకు దొంగిలించలేదు? -
సోదరిపై అన్న లైంగిక దాడికి యత్నం
హైదరాబాద్: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కిరాతకుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న పదేళ్ల సోదరిపై లైంగికదాడికి యత్నించాడు. మీర్‌పేట ఎస్ఐ సత్యనారాయణ కథనం ప్రకారం... జిల్లెలగూడ ప్రగతినగర్కాలనీలో అక్కాచెల్లెళ్లు నివాసముంటున్నారు. భర్తలు లేని వీరు కూలీపని చేసుకుంటూ జీవిస్తున్నారు. అక్కకు యాదగిరి (25) కుమారుడు, చెల్లెలకు పదేళ్ల కుమార్తె ఉంది. రెండు రోజుల క్రితం అక్కాచెల్లెళ్లు బయటకు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న యాదగిరి సోదరిపై లైంగికదాడికి యత్నించాడు. చిన్నారి ప్రతిఘటించి బయటకు పరుగుతీసింది. అప్పటి నుంచి స్కూల్ మానేసి ఇంట్లోనే ఏడుస్తూ కూర్చుం టోంది. దీంతో తల్లి నిలదీయగా జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో శనివారం సాయంత్రం తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.