సాక్షి, హైదరాబాద్: మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అల్మాస్‌గూడలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం సాయంత్రం వెలుగుచూసింది. మృతుల్ని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హరీష్ కుటుంబంగా పోలీసులు గుర్తించారు. అపార్ట్‌మెంట్‌లోని మొదటి అంతస్తులో నివాసముంట్ను హరీష్ కుటుంబ సభ్యులు రెండు రోజులుగా బయటికి రాకపోవడంతో.. ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు బద్దలు కొట్టి చూడగా.. నలుగురు విగతజీవులుగా కనిపించారు. మృతులను హరీష్, స్వప్న గిరీష్, సువర్ణగా పోలీసులు గుర్తిచారు. ఆర్థిక ఇబ్బందులతో నలుగురూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.
(చదవండి: కరోనా: ఇకపై 28 రోజుల హోం క్వారంటైన్)
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య!
Published Wed, Apr 22 2020 7:56 PM | Last Updated on Wed, Apr 22 2020 8:12 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment