
పోలీసుల అదుపులో నిందితులు, వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ నాగరాజు
నాచారం: విదేశాలకు వెళ్లాలనే కోరికతో చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తులను సీసీఎస్ మల్కాజిగిరి, భువనగిరి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 3.50 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ క్రైం డీసీపీ నాగరాజు, అడిషనల్ డీసీపీ ఎస్‌కె సలీమ ఆదివారం నాచారం సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. సరూర్‌నగర్, బాలాజీ నగర్‌కు చెందిన నెనావత్ వినోద్ కుమార్, అంబర్ పేటకు చెందిన మనీష్ ఇంజినీరింగ్ చదువుతున్నారు. జల్సాలకు అలవాటు పడిన వీరు గతంలో పలు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లారు.
జైలులో వీరికి పరిచయం ఏర్పడింది. దొంగిలించిన సొమ్ముతో కెనడాకు వెళ్లి స్థిరపడాలని నిర్ణయించుకున్న వీరు జైలు నుంచి విడుదలైన అనంతరం మీర్‌పేట్, ఉప్పల్, వనస్థలిపురం, పంజాగుట్ట , చించువాడ(పూణే) పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్నారు. ఆదివారం ఉదయం సీసీఎస్ భువనగిరి పోలీసులు వీరిని అరెస్ట్ చేసి వారి నుంచి 3 ద్విచక్రవాహనాలు, సోనీ ఎల్‌ఈడి టీవీ, ల్యాప్ టాప్, సామ్‌సంగ్ మొబైల్, 10 గ్రాముల బంగారు అభరణాలు, డిజిటల్ కెమెరా, హ్యాండీ క్యామ్, వెండి అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీరు బంగారు ఆభరణాలను అడ్డా కూలీలైన మహిళల సహాయంతో బంగారు షాపుల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన సీసీఎస్ భువనగిరి ఇన్స్‌పెక్టర్ పార్థసారథి, ఏఎస్‌ఐ షర్బుద్దీన్, కానిస్టేబుళ్లు ఇలయ, ప్రశాంత్ రెడ్డి, కిషోర్‌లను డీసీపీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment