గుంటూరు జిల్లా లో సీఎం ఇంటికి సమీపాన కృష్ణానదిలో ఇసుక గుంతలో పడి ఆదివారం వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి సాయి తేజ మృతిచెందాడు.
ఇసుక అక్రమ తవ్వకాలే కారణం
తాడేపల్లి రూరల్(మంగళగిరి): గుంటూరు జిల్లాలో సీఎం ఇంటికి సమీపాన కృష్ణానదిలో ఇసుక గుంతలో పడి ఆదివారం వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి సాయి తేజ మృతిచెందాడు. ఇసుక అక్రమ తవ్వకాలు అతడిని బలితీసుకున్నాయి. అతడితో ఉన్న ఐదుగురు అతికష్టం మీద ఒడ్డుకు చేరుకున్నారు.
కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న సాయితేజ, ఎలుగంటి సూర్య (వైఎస్సార్ జిల్లా కడప), కార్లపూడి బాలాజీ, దాసరి సుగుణ్ (విజయ వాడ), వంగల ప్రదీప్‌రెడ్డి (నల్లగొండ జిల్లా దేవర కొండ), విద్యాసాయిసుమంత్(కరీంనగర్) ఆది వారం ముఖ్యమంత్రి నివాసం చూద్దామంటూ కృష్ణా కరకట్ట వైపు వెళ్లారు. అక్కడ నిషేధిత ఇసుక రేవు వద్ద నదిలో స్నానానికి దిగారు. ఇసుక అక్ర మార్కులు పెద్దఎత్తున ఇసుక తవ్వడంతో అక్కడ భారీ గోతులేర్పడ్డాయి. విషయం తెలియని విద్యా ర్థులు నీళ్లలోకి దిగి గోతిలో పడిపోయారు. సాయి తేజ మునిగిపోగా, మిగిలినవారు ఓ పడవ ఆధా రంగా ఒడ్డుకు చేరారు. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సాయితేజ మృతదేహాన్ని వెలికితీశారు.