
సాయికృష్ణ (ఫైల్)
మీర్‌పేట: బీటెక్ మూడవ సంవత్సరంలో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో మనస్తాపానికి లోనైన ఓ విద్యార్థి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా, వెంకంపాడు గ్రామానికి చెందిన బుర్రా ఉపేందర్ కుమారుడు సాయికృష్ణ (22) గత మూడేళ్లుగా మీర్‌పేట ఆర్‌ఎన్‌రెడ్డినగర్‌లో ఉంటూ టీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో పార్ట్‌టైంగా ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవాడు. బీటెక్ 3వ సంవత్సరం ఫలితాల్లో కొన్ని సబ్జెక్టులలో ఫెయిల్‌కావడంతో మనస్తాపానికి గురైన సాయికృష్ణ శుక్రవారం మధ్యాహ్నం తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని గుర్తించిన పక్క గదిలోని యువకులు సాయికృష్ణ స్నేహితుడు సైదులుకు సమాచారం అందించాడు. అతను మృతుడి బాబాయ్ వెంకన్నకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. వెంకన్న ఫిర్యాదు మేరకు మీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment