
నడికూడ: సెల్ఫీ సరదా ఓ బీటెక్ విద్యార్థి ప్రాణం తీసింది. వాగు మాటు వద్ద సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి అందులో పడి మృతి చెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామం వాగులో గురువారం చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. కాజీపేటకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ (19) హసన్‌పర్తిలోని కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గురువా రం ఉదయం కాలేజీ స్నేహితులు సయ్యద్ జాహెద్‌షా, అబ్దుల్ షాదాబ్‌తో కలిసి బైక్‌పై సరదాగా కంఠాత్మకూర్ వాగు వద్దకు వచ్చారు. ఇస్మాయిల్ వాగులోని ఓ మాటు (నీటిని నిల్వచేసేందుకు అడ్డంగా వేసిన కట్ట) వద్ద సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి అందులో పడిపోయాడు. దూరంగా ఉన్న స్నేహితులు గట్టిగా అరవడంతో స్థానికంగా ఉన్న వారు వచ్చి కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే అతను మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న దామెర ఎస్సై రాజేందర్ సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.
ఇది కూడా చదవండి: ఎంపీ భార్య, కుమారుడి కిడ్నాప్ కేసులో ఐదుగురి అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment