
సోము సాయి (మృతదేహం)
సాక్షి, వైఎస్సార్ జిల్లా : వైఎస్సార్ కడప జిల్లాలో ఓ బీటెక్ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. రాజంపేటలోని డిగ్రీ కళాశాల సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఈ హత్య జరిగనట్లు తెలుస్తోంది. మృతుడు స్థానిక బోయనపల్లె అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల్లో సెకండీయర్ చదువుతున్న సోము సాయి(20)గా గుర్తించారు. పది రోజుల కిందట కళాశాలలో విద్యార్థుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సోము సాయి తండ్రి శివయ్య చిన్న వ్యాపారి.
సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో భోజనం చేసిన అనంతరం ఫోను రావడంతో సాయి బయటకు వెళ్లాడు. పది గంటల ప్రాంతంలో డిగ్రీ కళాశాల సమీపంలోని ముళ్లచెట్ల వద్ద రక్తం మడుగులో పడున్న విద్యార్థిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు వెళ్లి పరిశీలించగా అప్పటికేమృతిచెందాడు. కత్తులతో విచక్షణా రహితంగా పొడిచి చంపినట్లు మృతదేహంపై కత్తిపోట్లు ఉన్నాయి