
నర్సాపూర్(జి): మండలంలోని బామిని(బి) గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల మేరకు... మండలంలోని బామిని(బి) గ్రామానికి చెందిన నార్వాడే హాసిని(18) హైదరాబాద్‌లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆరోగ్యం బాగలేకపోవడంతో ఇటీవల ఇంటికి వచ్చేసింది. గురువారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు నిర్మల్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి మృతిచెందింది. తండ్రి నార్వాడే వెంకట్ రావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కూతురు మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
Comments
Please login to add a commentAdd a comment