నగరంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీ.టెక్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో మౌనిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. సురారం కాలనీలో నివసిస్తున్న చంద్రం, రేణుక దంపతుల కుమార్తె మౌనిక స్థానిక నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజిలో బీ.టెక్ ఫైనలియర్ చదువుతోంది.