
సాక్షి, విజయవాడ: ప్రేమ పేరుతో మోసపోయిన ఓ బీటెక్ విద్యార్థిని ఆత‍్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన విజయవాడలో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసముంటున్న గుర్రం ప్రవీణ్ వృత్తిరీత్యా మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ప్రేమ పేరుతో స్థానిక కాలేజీలో బీటెక్ చదువుతున్న యువతిని మోసం చేస్తూ ఇన్ని రోజులు కాలం వెల్ల దీశాడు. ఆ యువతిని పీకల్లోతూ ప్రేమలోకి దించేశాడు.
చివరికి పెళ్లి ప్రస్తావనను ఆ యువతి తీసుకొచ్చేసరికి తనకు అప్పటికే పెళ్లైన విషయం చెప్పడంతో మోసానికి గురయినట్లు భావించింది. దీంతో మనస్థాపానికి గురై నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసపత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరింత సమాచారం తెలియాల్సివుంది.
Comments
Please login to add a commentAdd a comment