సాక్షి, విశాఖపట్నం: స్థానిక బాబా ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు “కాంకర్డ్” పేరిట అంకుర సంస్థను ఏర్పాటు చేసినట్టు ప్రిన్సిపాల్ డా.గోవింద రాజు వెల్లడించారు. గురువారం జరిగిన ప్రారంభోత్సవ సభకు ముఖ్య అతిథిగా చెగ్ ఇండియా న్యూఢిల్లీకి చెందిన ప్రకృతి శ్రీవాస్తవ గౌరవ అతిధిగా క్యాథెరిన్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ ఆలివర్ రాయ్ హాజరయ్యారని తెలిపారు.
చదవండి: వావ్..వాట్సాప్‌లో అదిరిపోయే సూపర్ ఫీచర్లు..అవేంటో తెలుసా?
కాంకర్డ్ అంకుర సంస్థను బిట్స్ వైజాగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు పి. జాషువ రాజు ఆధ్వర్యంలో, ఐదుగురు విద్యార్థుల బృందం ఈ స్టార్టప్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుత కంప్యూటింగ్ అవసరాలకు అనుగుణంగా అధునాతన సాంకేతిక నైపుణ్యంతో, యుఐ/యుఎక్స్ డిజైనింగ్, వెబ్, మొబైల్ అప్లికేషన్ డెవలెప్మెంట్, డిజైన్ స్పాటిలైట్ వెర్టికల్స్ లో సాఫ్ట్వేర్ అభివృద్ధి చేస్తారని సంస్థ వ్యవస్థాపకులు జోషువా రాజు వివరించారు.
సహ వ్యవస్థాపకులు సందీప్, మేఘశ్యామ్ ఫుల్ స్ట్యాక్ డెవలప్మెంట్ లో అప్లికేషన్స్ అభివృద్ధి చేస్తారని, విద్యార్థి రాహుల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా, మహేష్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ గా వ్యవరిస్తారని చెప్పారు. మూడవ సంవత్సరం చదువుతున్న శ్రావ్య కంటెంట్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్‌గా పని చేస్తారన్నారు. విద్యార్థి దశలోనే ఇటువంటి సంస్థను ప్రారంభించడం అభినందనీయమని, వారికి తాము అండగా నిలుస్తామని ఈ సందర్భంగాప్రకృతి శ్రీవాస్తవ హామీ ఇచ్చారు. తమ విద్యార్థులు అంకుర సంస్థను విద్యార్థులు స్థాపించడం చాలా గర్వంగా ఉందని, భవిష్యత్తులో ఇటువంటి సంస్థల్ని మరిన్ని తీసుకురావాలని ప్రిన్సిపాల్ అభిలషించారు.
కళాశాల కరెస్పాండెంట్ డా. కొండ్రు శ్రీలక్ష్మి బృంద సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వీరిని ఆదర్శంగా తీసుకొని మరి కొన్ని సంస్థలు అన్ని విభాగాల్లోనూ స్టార్టప్‌తో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బిట్స్ వైజాగ్ అకడమిక్ ముఖ్య సలహాదారు డా. సీవీ గోపినాథ్, డీన్ డా.విక్టర్ బాబు శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment