
సాక్షి,విశాఖపట‍్నం : పరీక్షల్లో తప్పానన్న మనస్తాపంతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పాతనగరంలో శని వారం ఈ సంఘటన జ రిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిలకపేటలో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న శీలం మణితేజ (22) బీటెక్ (డీఎంఈ) నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఫెయిల్ అయిన మణితేజ మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మణితేజ తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఏఎస్‌ఐ వి.మురహరి ఆధ్వర్యంలో సిబ్బంది కేసు దర్యాప్తు చేస్తున్నారు.