Playing cricket
-
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
బ్యాటింగ్‌తో అదరగొడుతున్న ‘యంగ్ విరాట్’.. వీడియో వైరల్
శ్రీనగర్: మహిళ క్రికెట్‌కు ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది. అయినప్పటికీ ఆ వైపుగా బాలికలను ప్రోత్సహించేవారు చాలా తక్కువ. అలాంటిది జమ్ముకశ్మీర్ వంటి ప్రాంతాల్లో అస్సలు ఊహించలేం. కానీ, ఎప్పుడూ తుపాకుల మోతలతో దద్దరిల్లే ప్రాంతంలో ఓ చిన్నారి క్రికెట్ బ్యాటు పట్టింది. తన బ్యాటింగ్ నైపుణ్యంతో అందరి చూపును తనవైపునకు తిప్పుకుంటోంది. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న ఆ విద్యార్థిని వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లద్దాఖ్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(డీఎస్ఈ) ఆ వీడియోను ట్విటర్లో షేర్ చేసింది. తన క్రికెట్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న ఆరో తరగతి విద్యార్థిని మాక్సూమాగా గుర్తించినట్లు పేర్కొంది. ‘ఇంటి వద్ద మా నాన్న, స్కూల్లో మా టీచర్ క్రికెట్ ఆడమని ప్రోత్సహించారు. విరాట్ కోహ్లీలా ఆడేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నా. నా చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నాను. హెలికాప్టర్ వంటి షాట్స్ ఎలా ఆడాలి అనేది నేర్చుకుంటున్నా. నాకు ఇష్టమైన క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఆయనలాగే ఆడాలనుకుంటున్నా.’ అని విద్యార్థిని మాక్సూమా పేర్కొంది. వీడియోలో.. క్రికెట్ ఆడుతున్న తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఓ బంతిని ఏకంగా గ్రౌండ్ బయటకు పంపిన తీరు అందరిని ఆకట్టుకుంటోంది. శుక్రవారం వీడియో పోస్ట్ చేయగా 25వేల వ్యూస్, 1,200 లైక్స్ వచ్చాయి. My father at home and my teacher at school encourage me to play cricket. I'll put all my efforts to play like @imVkohli Maqsooma student class 6th #HSKaksar pic.twitter.com/2ULB4yAyBt — DSE, Ladakh (@dse_ladakh) October 14, 2022 ఇదీ చదవండి: రూ. 9 లక్షల లోన్ కట్టాలని బ్యాంక్ నోటీస్.. గంటల్లోనే అదృష్టం తలుపు తట్టింది -
చీకటిని జయించిన రాజు
సాధించాలన్న తపన ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు. అందుకు వయస్సు, అంగ వైకల్యం అడ్డురాదు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. ఆ కళ్లే లేకుంటే ప్రపంచమే అంధకారం. కాని చూపు లేకున్నా తాను ఎవ్వరికీ ఎందులోనూ తీసిపోనని నిరూపించారు పుష్పరాజ్. చిన్నప్పుడే కంటి చూపుకోల్పోయినా ఉన్నత చదువులు చదివి ప్రధానోపాధ్యాయుడి స్థాయికి చేరుకున్నారు. మరో వైపు క్రికెట్లో రాణిస్తూ ఎన్నో పతకాలను కైవసం చేసుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచారు. సాక్షి, కర్నూలు : కర్నూలు నగరానికి చెందిన సిమ్మన్స్, రాజేశ్వరి దంపతులకు పుష్పరాజ్, అశోక్ సంతానం. ఇందులో పెద్ద కుమారుడు పుష్పరాజ్.. చిన్న వయస్సులోనే కంటి చూపును కోల్పోయారు. అతనికి ఏడవ ఏటవచ్చే సరికి తండ్రి చనిపోయారు. తల్లి రాజేశ్వరి అధైర్యపడకుండా కర్నూల్లోని ఓ ప్రవేయిటు పాఠశాల్లో ఆయాగా చేరారు. పేదరికంలో ఉన్నప్పటికీ కుమారుడు పుష్పరాజ్‌కు కంటి చూపును తెచ్చుకోపవడానికి ప్రయత్నించారు. అప్పుచేసి ఎనిమిది సార్లు శస్త్ర చికిత్సలు చేయించారు. అయానా ఫలితం దక్కలేదు. పుష్పరాజ్‌ను ఉన్నత చదువులను చదివించాలని భావించి హైదరాబాద్‌లో ఉన్న దేవనగర్ అంధుల పాఠశాల్లో చేర్పించారు. అక్కడ 10వ తరగతి పూర్తిచేశారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో 490 మార్కులను సాధించి అప్పటి రాష్ట్ర గవర్నర్‌గా పని చేసిన రంగరాజన్ చేతులమీదుగా ఉత్తమ విద్యార్థిగా పురస్కారాన్ని అందుకున్నారు. పాఠశాల స్థాయిలో క్రికెట్లో మెలకువలు నేర్చుకున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ మంచి బ్యాట్స్‌మెన్‌గా రాణించారు. సంరక్షుడి నుంచి ఉపాధ్యాయుడిగా.. పదో తరగతి అనంతరం పుష్పరాజ్.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్లో హెచ్ఈసీ గ్రూపు తీసుకున్నారు. నిజాం కళాశాలలో బీఏ చదివారు. హైదరాబాద్‌లోనే వసతి గృహంలో ఉంటూ బీఈడీను పూర్తి చేశారు. క్రికెట్లోనూ రాణిస్తూ అందరి మన్ననలు అందుకున్నారు. భారత అంధుల క్రికెట్ జట్టుకు సేవలు అందించారు. వసతి గృహ సంరక్షుడి ఉద్యోగానికి ఎంపికై మద్దికెరలో రెండేళ్లు పనిచేశారు. విద్యార్థులకు ఉత్తమ సేవలు అందించినందుకు గాను 2007లో ఉత్తమ వసతి గృహ సంరక్షుడి ఆవార్డు వరించింది. అదే ఏడాదిలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సన్మానం అందుకున్నారు. క్రికెట్లో రాణించినందుకు 2012లో అప్పటి సీఎం కిరుణ్కుమార్రెడ్డి చేత సన్మానాన్ని పొందారు. స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం రావడంతో వసతి గృహ సంరక్షుడి ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆలూరు బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడి పనిచేస్తున్నారు. మారుతున్న కాలంతోపాటు సాంకేతికతను పుష్పరాజ్ అందిపుచ్చుకున్నారు. తన ల్యాప్‌టాప్ ద్వారా ఆన్లైన్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠ్యాంశాలు బోధించడంలో పుష్పరాజ్ దిట్ట. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సైతం ఈయన కైవసం చేసుకున్నారు. ధైర్యమే నా ఆయుధం.. వైకల్యం ఉందని బాధపడితే నేను ఈ స్థాయిలో ఉండేవాన్ని కాదు. ధైర్యమే ఆయుధంగా ముందుకు సాగాను. ప్రస్తుతం ఆలూరు ప్రభుత్వ బాలుర పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నాను. నా విజయానికి కృషి, పట్టుదల, క్రమశిక్షణే కారనం. కంటిచూపు లేదని నేను ఎన్నడూ బాధపడలేదు. అమ్మ ప్రోత్సాహంతో ఈస్థితికి చేరుకున్నాను. ప్రతి ఒక్కరిలో ఏదో రకమైన ప్రతిభ దాగి ఉంటుంది, దానిని వెలికి తీసినప్పుడు విజయం తప్పక వరిస్తుంది. – పుష్పరాజ్ -
క్రికెట్ ఆడుతూ ప్రాణాలు పోగొట్టుకున్న బాలుడు
-
రోజులాగానే క్రికెట్ ఆడేందుకు వెళ్లి..!
న్యూఢిల్లీ: రోజులాగానే ఆడుకునేందుకు వెళ్లిన కొందరు టీనేజీ యువకులు ఓ నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్టేషన్ ఆఫీసర్ సూరజ్ ఖండ్ పంకజ్ కుమార్ కథనం ప్రకారం.. రవి అనే వ్యక్తి ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం వీరు ఆరావళీ పర్వత ప్రాంతానికి వచ్చారు. అదే సమయంలో అక్కడ కొందరు కుర్రాళ్లు క్రికెట్ ఆడుతున్నారు. ఎవరూ వెళ్లని ప్రదేశానికి(అటవీ ప్రాంతం లోనికి) వీరు వెళ్లడాన్ని గమనించిన యువకులు వాళ్లను వెంబడించారు. రవి తనతో వచ్చిన యువతిని గొంతు నులిమి హత్యచేసి, బండరాయితో ఆమె తలపై మోదాడు. యువకులు ఘటనా ప్రదేశానికి సమీపించగానే యువతి మృతదేహాన్ని కప్పిఉంచే యత్నం చేశాడు. వారు మృతదేహాన్ని గమనిస్తారని భావించిన రవి వెంటనే అక్కడినుంచి పరారయ్యేందుకు యత్నించాడు. మేము ఆ వ్యక్తిని చేతులు గట్టిగా పట్టుకుని జేబులు చెక్ చేయగా అతని వద్ద ఏటీఎం కార్డులు, కొంత నగదుతో పాటు రివాల్వర్ ఉన్నట్లు సమాచారం. రవి వద్ద ఉన్న వస్తువులు తీసుకుని పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పారు. అక్కడికి వచ్చిన పోలీసులు నిందితుడిని స్టేషన్ కు తరలించి విచారణ చేయగా.. తనకు ఇదివరకే పెళ్లయిందని, ప్రస్తుతం తాను హత్య చేసిన యువతితో గత ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు వెల్లడించాడు. యువతి వద్ద ఉన్న నగదు, విలువైన వస్తువుల కోసమే ఆమెను హత్యచేశాడని స్టేషన్ ఆఫీసర్ సూరజ్ వివరించారు. -
ప్రాణం తీసిన క్రికెట్ గొడవ
న్యూఢిల్లీ: సరదాగా ఆడుతున్న క్రికెట్ ఆట కొట్లాటకు దారితీసింది. అప్పటివరకు స్నేహితులుగా ఉన్నవారు శత్రువులుగా మారారు. ఓ యువకుడు క్షణికావేశంలో క్రికెట్ బ్యాట్ తీసుకుని స్నేహితుడి తలపై బాదగా, అతను తీవ్రంగా గాయపడి మరణించాడు. ఢిల్లీలోని సాగర్పూర్ ప్రాంతంలో ఈ విషాదకర సంఘటన జరిగింది. మృతుడిని శివం (16)గా, నిందితుడిని ఆకాశ్ (19)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆకాశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మినోరా కల్పి గ్రామంలో ఉంటున్న శివం 15 రోజుల క్రితం కుటుంబ సభ్యులు, తమ్ముడితో గడిపేందుకు ఢిల్లీకి వచ్చాడు. గత బుధవారం స్నేహితులతో కలసి క్రికెట్ ఆడుతుండగా ఈ ఘటన జరిగింది. శివం స్నేహితుడు వెళ్లి జరిగిన విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు చెప్పాడు. వెంటనే ఆస్పత్రికి వెళ్లి చూడగా అప్పటికే శివం మరణించాడని అతని తండ్రి కన్నీటిపర్యంతమయ్యాడు. క్రికెట్ ఆడుతూ శివం, ఆకాశ్ గొడవపడ్డారని, ఆకాశ్ బ్యాట్‌తో కొట్టగా శివం కుప్పకూలిపోయాడని వారి స్నేహితుడు అమిత్ చెప్పాడు. కాగా శివం తల్లి మాట్లాడుతూ ఇది అనుకోకుండా జరిగిన ఘటన కాదని, కుట్రపూరిత ఉద్దేశ్యముందని ఆరోపించింది. పోలీసులు మాత్రం క్రికెట్ గొడవే కారణమని చెప్పారు.