రోజులాగానే క్రికెట్ ఆడేందుకు వెళ్లి..! | man arrested for murder live in partner in delhi | Sakshi
Sakshi News home page

రోజులాగానే క్రికెట్ ఆడేందుకు వెళ్లి..!

Published Sat, Dec 10 2016 4:42 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

రోజులాగానే క్రికెట్ ఆడేందుకు వెళ్లి..! - Sakshi

రోజులాగానే క్రికెట్ ఆడేందుకు వెళ్లి..!

న్యూఢిల్లీ: రోజులాగానే ఆడుకునేందుకు వెళ్లిన కొందరు టీనేజీ యువకులు ఓ నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్టేషన్ ఆఫీసర్ సూరజ్ ఖండ్ పంకజ్ కుమార్ కథనం ప్రకారం.. రవి అనే వ్యక్తి ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం వీరు ఆరావళీ పర్వత ప్రాంతానికి వచ్చారు. అదే సమయంలో అక్కడ కొందరు కుర్రాళ్లు క్రికెట్ ఆడుతున్నారు.

ఎవరూ వెళ్లని ప్రదేశానికి(అటవీ ప్రాంతం లోనికి) వీరు వెళ్లడాన్ని గమనించిన యువకులు వాళ్లను వెంబడించారు. రవి తనతో వచ్చిన యువతిని గొంతు నులిమి హత్యచేసి, బండరాయితో ఆమె తలపై మోదాడు. యువకులు ఘటనా ప‍్రదేశానికి సమీపించగానే యువతి మృతదేహాన్ని కప్పిఉంచే యత్నం చేశాడు. వారు మృతదేహాన్ని గమనిస్తారని భావించిన రవి వెంటనే అక్కడినుంచి పరారయ్యేందుకు యత్నించాడు.

మేము ఆ వ్యక్తిని చేతులు గట్టిగా పట్టుకుని జేబులు చెక్ చేయగా అతని వద్ద ఏటీఎం కార్డులు, కొంత నగదుతో పాటు రివాల‍్వర్ ఉన్నట్లు సమాచారం. రవి వద్ద ఉన్న వస్తువులు తీసుకుని పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పారు. అక్కడికి వచ్చిన పోలీసులు నిందితుడిని స్టేషన్ కు తరలించి విచారణ చేయగా.. తనకు ఇదివరకే పెళ్లయిందని, ప్రస్తుతం తాను హత్య చేసిన యువతితో గత ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు వెల్లడించాడు. యువతి వద్ద ఉ‍న్న నగదు, విలువైన వస్తువుల కోసమే ఆమెను హత్యచేశాడని స్టేషన్ ఆఫీసర్ సూరజ్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement