three youth
-
రోజులాగానే క్రికెట్ ఆడేందుకు వెళ్లి..!
న్యూఢిల్లీ: రోజులాగానే ఆడుకునేందుకు వెళ్లిన కొందరు టీనేజీ యువకులు ఓ నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్టేషన్ ఆఫీసర్ సూరజ్ ఖండ్ పంకజ్ కుమార్ కథనం ప్రకారం.. రవి అనే వ్యక్తి ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం వీరు ఆరావళీ పర్వత ప్రాంతానికి వచ్చారు. అదే సమయంలో అక్కడ కొందరు కుర్రాళ్లు క్రికెట్ ఆడుతున్నారు. ఎవరూ వెళ్లని ప్రదేశానికి(అటవీ ప్రాంతం లోనికి) వీరు వెళ్లడాన్ని గమనించిన యువకులు వాళ్లను వెంబడించారు. రవి తనతో వచ్చిన యువతిని గొంతు నులిమి హత్యచేసి, బండరాయితో ఆమె తలపై మోదాడు. యువకులు ఘటనా ప్రదేశానికి సమీపించగానే యువతి మృతదేహాన్ని కప్పిఉంచే యత్నం చేశాడు. వారు మృతదేహాన్ని గమనిస్తారని భావించిన రవి వెంటనే అక్కడినుంచి పరారయ్యేందుకు యత్నించాడు. మేము ఆ వ్యక్తిని చేతులు గట్టిగా పట్టుకుని జేబులు చెక్ చేయగా అతని వద్ద ఏటీఎం కార్డులు, కొంత నగదుతో పాటు రివాల్వర్ ఉన్నట్లు సమాచారం. రవి వద్ద ఉన్న వస్తువులు తీసుకుని పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పారు. అక్కడికి వచ్చిన పోలీసులు నిందితుడిని స్టేషన్ కు తరలించి విచారణ చేయగా.. తనకు ఇదివరకే పెళ్లయిందని, ప్రస్తుతం తాను హత్య చేసిన యువతితో గత ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు వెల్లడించాడు. యువతి వద్ద ఉన్న నగదు, విలువైన వస్తువుల కోసమే ఆమెను హత్యచేశాడని స్టేషన్ ఆఫీసర్ సూరజ్ వివరించారు. -
అతడు ఆమె కేసు కొత్త మలుపు
హైదరాబాద్: అతడు ఆమె కేసు కొత్త మలుపు తిరిగింది. రెండు నెలల కిందటే అవినాశ్ అనే యువకుడు మోసం చేశాడంటూ ఎస్ఆర్నగర్ పోలీసులను ఓ అమ్మాయి ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే, ఆ అమ్మాయిపైనే తాజాగా ఆరోపణలు వెల్లువెత్తాయి. స్నేహితుల ద్వారా అవినాశ్‌కు ఆ మహిళే ఫేక్ బెదిరింపు కాల్స్ చేయించిందంటూ పోలీసులు తెలిపారు. ఈ కేసులో అమ్మాయికి సహకరించిన ముగ్గురుని పోలీసులు అరెస్టు చేసినట్లు చెప్పారు. అవినాశ్ వద్ద డబ్బులు డిమాండ్ కోసమే డ్రామా ఆడిందంటూ పోలీసులు చెప్పారు. -
నీలి చిత్రాల సీడీలు విక్రయిస్తున్న యువకులు అరెస్ట్
విజయవాడ : ఇంటర్నెట్ నుంచి నీలి చిత్రాలను డౌన్లోడ్ చేసి వాటిని సీడీల రూపంలో విక్రయిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన బుధవారం కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్టణం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... సునీల్, వినోద్, నాగార్జున అనే ముగ్గురు యువకులు మండల కేంద్రంలో హైస్పీడ్ ఇంటర్నెట్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. కాగా వారు మంగళవారం అర్ధరాత్రి ఇంటర్నెట్ సెంటర్లో నీలి చిత్రాలను డౌన్లోడ్ చేసి సీడీల రూపంలో విక్రయిస్తున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఇంటర్నెట్ సెంటర్‌పై దాడి చేసి ముగ్గరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
పార్టీకి పిలిచి.. గ్యాంగ్ రేప్
* నగరంలో వీకెండ్ పార్టీలో దారుణం * ఈ నెల 5న ఘటన... ఆలస్యంగా వెలుగులోకి... హైదరాబాద్: హైదరాబాద్‌లో మహిళల భద్రత మరోసారి ప్రశ్నార్థకమైంది. పీకల్లోతు వరకు మద్యం సేవించిన ‘మృగాళ్లు’ తోటి ఉద్యోగినిపైనే అత్యాచారానికి పాల్పడిన దారుణ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిర్భయ వంటి కఠినమైన చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ ఇలాంటి వారి పైశాచికత్వానికి కళ్లెం వేయలేకపోతున్నాయి. వీకెండ్ పార్టీ పేరుతో ఇద్దరు స్నేహితులు తమతో పాటు పని చేసే యువతిని నగర శివార్లలోని ఓ ఇంటికి తీసుకెళ్లారు. వారిలో ఒక వ్యక్తి అమ్మాయిపై అత్యాచారానికి ఒడిగట్టగా, మరో వ్యక్తి సైతం అత్యాచారయత్నం చేశాడు. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలను ఏసీపీ భాస్కర్‌గౌడ్ వెల్లడించారు. సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువతి(22) ఉప్పల్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తోంది. అదే కంపెనీలో పనిచేస్తోన్న నిహాల్(22), శ్రీకాంత్ (23)లు ఇద్దరు ఆమె సహోద్యోగులు. ఈ నెల 5న వారు ఆమెను వీకెండ్ పార్టీకంటూ ఆహ్వానించారు. తనతోపాటు పని చేసే ఉద్యోగులు కావడంతో ఆమె వారితో వెళ్లింది. పథకం ప్రకారం వారు హయత్‌నగర్‌లోని కుసుమానగర్కు చెందిన తమ స్నేహితుడు షైనీ ఇంటికి ఆ అమ్మాయిని తీసుకెళ్లారు. ఆ రోజు రాత్రి బాగా మద్యం సేవించారు. మద్యం మత్తులో నిహాల్ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. శ్రీకాంత్ కూడా ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. మరుసటి రోజు ఉదయం నిహాల్ ఆమెను ఎల్బీనగర్ రింగురోడ్డు వద్ద దింపి వెళ్లాడు. తనపై జరిగిన దాడి, అవమానం పట్ల ఆవేదనకు గురైన ఆమె ఈ నెల 15న తల్లిదండ్రులతో వచ్చి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిహాల్, శ్రీకాంత్‌లను అదుపులోకి తీసుకుని కేసును విచారణ చేపట్టారు. నిందితులపై అత్యాచారం కేసుతో పాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. రహస్యంగా విచారణ.... ఇలా ఉండగా ఈ కేసు విచారణలో గోప్యతను పాటిస్తోన్న పోలీసులు పూర్తి వివరాలను వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. నిందితుల వివరాలు కూడా బయటకు చెప్పడం లేదు. మరోవైపు హయత్‌నగర్‌లో పార్టీ చేసుకొనేందుకు తన ఇంటిని స్నేహితులకు అప్పగించిన షైనీ పార్టీ జరిగే సమయంలో వారితోనే ఉన్నాడా, లేడా వంటి వివరాలు వెల్లడించడం లేదు. మరోవైపు ఈ నెల 15న యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా 23వ తేదీ వరకు పోలీసులు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచడం, మీడియా దృష్టికి రాకుండా జాగ్రత్తలు పాటించడం గమనార్హం.