విజయవాడ : ఇంటర్‌నెట్ నుంచి నీలి చిత్రాలను డౌన్‌లోడ్ చేసి వాటిని సీడీల రూపంలో విక్రయిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన బుధవారం కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్టణం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... సునీల్, వినోద్, నాగార్జున అనే ముగ్గురు యువకులు మండల కేంద్రంలో హైస్పీడ్ ఇంటర్‌నెట్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు.
కాగా వారు మంగళవారం అర్ధరాత్రి ఇంటర్‌నెట్ సెంటర్‌లో నీలి చిత్రాలను డౌన్‌లోడ్ చేసి సీడీల రూపంలో విక్రయిస్తున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఇంటర్‌నెట్ సెంటర్‌పై దాడి చేసి ముగ్గరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు వెల్లడించారు.