
కౌలుకు తీసుకుని సాగు..
అమరచింత ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందుతున్నందున ఈసారి 15 ఎకరాలను కౌలుకు తీసుకుని వరిపంట సాగుచేశాను. ఎకరాకు రూ. 25వేల నుంచి రూ. 30వేల వరకు పెట్టుబడి పెట్టాను. వారంలో రెండు రోజులే సాగునీరు అందడంతో పంట ఎదగలేదు. ఇలాంటి సమయంలో నీటిని పూర్తిగా నిలిపివేయడం వల్ల పంటను పశువులకు వదిలిపెట్టి రోడ్డున పడే పరిస్థితి నెలకొంది.
– గుంతల చెన్నప్ప, రైతు, అమరచింత
పొట్టదశలో ఉన్నాయి..
జూరాల ఎడమ కాల్వ ద్వారా సాగునీటిని పొందుతూ ములమళ్ల శివారులో 10 ఎకరాల్లో వరిసాగు చేస్తున్నా. ప్రస్తుతం పంట పొట్టదశలో ఉంది. రెండు తడుల వరకు నీటిని అందిస్తే పంట చేతికందే అవకాశం ఉంది. అధికారులు ముందుగా వారబందీతో సాగునీటిని అందించారు. అంతే కాకుండా గత నెల నుంచి వారంలో రెండు రోజులే సాగునీటిని అందించారు. ఇప్పుడు సైతం అదే విధంగా పంటలు చేతికొచ్చే వరకు సాగునీటిని అందించాలి.
– ఆంజనేయులు, రైతు, మస్తీపురం
మరో రెండు తడులు
అందించాలి..
అమరచింత ఎత్తిపోతలకు జూరాల ఎడమ కాల్వ నుంచి సాగునీటిని పొందుతున్నాం. ఎత్తిపోతల ఆయకట్టు పరిధిలో ములమళ్ల, సింగపేట, ఖానాపురం, మస్తీపురం, అమరచింత, పాంరెడ్డిపల్లె గ్రామాల పరిధిలో ఈసారి యాసంగిలో 800 ఎకరాల్లో వరిసాగు చేస్తున్నాం. ప్రాజెక్టు అధికారులు వారబందీలో కోత పెట్టి కేవలం వారంలో రెండు రోజులు మాత్రమే సాగునీటిని అందించారు. ప్రస్తుతం వరిపైర్లు పొట్టదశలో ఉన్నాయి. గింజలు గట్టిపడాలంటే మరో రెండు తడులపాటు సాగునీటిని అందించాలి.
– ఆంజనేయులు,
అమరచింత లిఫ్ట్ ప్రధాన కార్యదర్శి
ఉన్నతాధికారుల ఆదేశాలతో..
ప్రస్తుతం ప్రాజెక్టులో నీటినిల్వ మట్టం తగ్గుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయకట్టుకు ఇదే చివరి తడిగా సాగునీటిని వదిలి.. కాల్వలకు నీటి సరఫరాను నిలిపివేశాం. నీటినిల్వ మట్టం రోజురోజుకు పడిపోతుండటంతో వారబందీ ద్వారా రైతులకు సాగునీటిని అందించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సాగుకు నీటిని వినియోగించే పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లా ప్రజలకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటున్నాం.
– జగన్మోహన్, ఈఈ
●

కౌలుకు తీసుకుని సాగు..

కౌలుకు తీసుకుని సాగు..

కౌలుకు తీసుకుని సాగు..